logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వర్ని మండలంలో ప్లాస్టిక్ కవర్లపై నిషేధం అమలు* నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొదటిసారి రూ.2,000, రెండోసారి రూ.5,000 జరిమానా వర్ని మండలం:. ( ఆగస్టు 1): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిజామాబాద్ జిల్లా: వర్ని మండల కేంద్రంలో పాలిథిన్ ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నేటి నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గ్రామ సర్పంచ్ కనకదుర్గ రవి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ ప్రజలు మార్కెట్‌కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఇంటి నుంచే జూట్ సంచులు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొదటిసారి రూ.2,000, రెండోసారి రూ.5,000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. దుకాణదారులు ప్లాస్టిక్ కవర్ల విక్రయం ఆపి, పర్యావరణహిత ప్రత్యామ్నాయ సంచులు వాడాలని కోరారు. ప్లాస్టిక్ వల్ల ప్రకృతికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు, సర్పంచ్ కనకదుర్గ రవి విజ్ఞప్తి చేశారు.

1 hr ago
user_RAHUL
RAHUL
బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
1 hr ago
ed0d086d-ed61-4a2f-8b4c-a54b6e01abff

వర్ని మండలంలో ప్లాస్టిక్ కవర్లపై నిషేధం అమలు* నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొదటిసారి రూ.2,000, రెండోసారి రూ.5,000 జరిమానా వర్ని మండలం:. ( ఆగస్టు 1): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిజామాబాద్ జిల్లా: వర్ని మండల కేంద్రంలో పాలిథిన్ ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నేటి నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గ్రామ సర్పంచ్ కనకదుర్గ రవి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ ప్రజలు మార్కెట్‌కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఇంటి నుంచే జూట్ సంచులు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొదటిసారి రూ.2,000, రెండోసారి రూ.5,000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. దుకాణదారులు ప్లాస్టిక్ కవర్ల విక్రయం ఆపి, పర్యావరణహిత ప్రత్యామ్నాయ సంచులు వాడాలని కోరారు. ప్లాస్టిక్ వల్ల ప్రకృతికి తీవ్ర నష్టం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు, సర్పంచ్ కనకదుర్గ రవి విజ్ఞప్తి చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • బోధన్ ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) 675వ ఉర్సు మహోత్సవాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పాల్గొన్నారు. దర్గా వద్ద చాదర్ సమర్పించి, గులాబీ పూలతో నివాళులర్పించిన కమిషనర్... రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు పోలీస్ కమిషనర్‌కు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదారు, మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    బోధన్ ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) 675వ ఉర్సు మహోత్సవాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పాల్గొన్నారు.
దర్గా వద్ద చాదర్ సమర్పించి, గులాబీ పూలతో నివాళులర్పించిన కమిషనర్... రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దర్గా నిర్వాహకులు పోలీస్ కమిషనర్‌కు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదారు, మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • భారీ వర్షంతో తడిసిముద్దైన బాన్సువాడ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన బాన్సువాడ పట్టణంలో శనివారం కురిసిన భారీ వర్షంతో జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వ్యవసాయ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.
    2
    భారీ వర్షంతో తడిసిముద్దైన బాన్సువాడ
లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

బాన్సువాడ పట్టణంలో శనివారం కురిసిన భారీ వర్షంతో జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది.
కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వ్యవసాయ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Banswada, Kamareddy•
    5 hrs ago
  • నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి మంత్రి కామెంట్స్ ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి.. అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఉత్తమ్ కుమార్ కామెంట్స్ శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా ఉన్నాయి బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా ఎలా ఉంది ప్రజలు గమనించాలి జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము
    4
    నిజామాబాదు జిల్లా 

శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి 

మంత్రి కామెంట్స్ 

ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది 

కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు

బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి 

గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు 

దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి..

అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది 
కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది 

కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది


ఉత్తమ్ కుమార్ కామెంట్స్ 

శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది 

మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది 



రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది  స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం 

మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది 

దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి 

నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు 

ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు 

కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై 

అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా  ఉన్నాయి 

బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా  ఎలా ఉంది ప్రజలు గమనించాలి 

జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము
    user_Boss
    Boss
    Photographer భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    1
    సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం."
"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... 
సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది."
**"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.
    1
    జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు
బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు
జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని  ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంత మంది చేతి వాటం చూయించారని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కలిసి పిర్యాదు చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో నూతన పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 5,92,91,364 ఖర్చు కాగా అందులో 75 బిల్లులు 1,13,14566 రూపాయల చెల్లింపు విషయంలో, అంతే కాకుండా SDRF సంబంధించిన 71,28,937 రూపాయలు ఖర్చు కా అందులో 5 బిల్లులకు గాను 59,86,353 రూపాయలు చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా అనుమానం అందని వీటి విషయంలో సరియైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై, వాటి వెనక ఉన్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరడం జరిగిందని, ఈ విషయంలో సరియైన స్పందన రాకపోతే విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి పిర్యాదు చేస్తామని అన్నారు.
    1
    నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు
కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంత మంది చేతి వాటం చూయించారని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కలిసి పిర్యాదు చేయటం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ  కామారెడ్డి పట్టణంలో నూతన పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 5,92,91,364 ఖర్చు కాగా అందులో 75 బిల్లులు 1,13,14566 రూపాయల చెల్లింపు విషయంలో, అంతే కాకుండా SDRF సంబంధించిన 71,28,937 రూపాయలు ఖర్చు కా అందులో 5 బిల్లులకు గాను 59,86,353 రూపాయలు చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా అనుమానం అందని వీటి విషయంలో సరియైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై, వాటి వెనక ఉన్న ప్రజా ప్రతినిధులపై  చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ని కోరడం జరిగిందని, ఈ విషయంలో సరియైన స్పందన రాకపోతే  విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి పిర్యాదు చేస్తామని అన్నారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి..* ఓట్ల కోసం విద్యార్థులకు మాయమాటలు చెప్పి ,గెలిచి గద్దనెక్కిన తర్వాత విద్యార్థుల ఆత్మగౌరాన్ని దెబ్బతీస్తున్నాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి విద్యార్థులను అవమానించడం బాధాకరం.. *తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని బస్టాండ్ దగ్గర బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేయడం జరిగింది..* *ఈ సందర్భంగా జిల్లా యువమోర్చ అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ..* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి వారిని ఈ విధంగా సంబోధించడం విద్యార్థులను, వారి కష్టాన్ని తీవ్రంగా అవమానించడమే అవుతుందని అన్నారు.. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకు కనీసం ఉద్యోగ దరఖాస్తులు నింపడం కూడా రాదని హేళన చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా వారిని "క్రిమినల్స్", "వేస్ట్" అంటూ నోరుపారేసుకోవడం వారి అహంకార పూరిత వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం చూస్తుంటే—రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులు చదవకూడదని, ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులుగానే ఉండిపోవాలని వారు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. నిరుద్యోగ భృతి 4,000 వేలు, యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సంపూర్ణంగా విఫలమైన ఈ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులపైనే ఇటువంటి నిందలు వేయడం దురదృష్టకరం అని కాంగ్రెస్ ప్రభుత్వ ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమించి ఎండగడుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి ,బిజెపి నాయకులు, రజినీకాంత్,భూమేష్ యాదవ్,సందీప్, చిరంజీవి, అశోక్ ,బిజెవైఎం నాయకులు అరుణ్,రాజు, సందీప్, సాయి, ప్రణయ్ తదితరులు ఉన్నారు..
    1
    ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి..*
ఓట్ల కోసం విద్యార్థులకు మాయమాటలు చెప్పి ,గెలిచి గద్దనెక్కిన తర్వాత విద్యార్థుల ఆత్మగౌరాన్ని దెబ్బతీస్తున్నాడు.
ముఖ్యమంత్రి పదవిలో ఉండి విద్యార్థులను అవమానించడం  బాధాకరం..
*తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని  బస్టాండ్  దగ్గర బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు  ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం  కార్యక్రమం చేయడం జరిగింది..*
*ఈ సందర్భంగా జిల్లా యువమోర్చ అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ..*
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి వారిని ఈ విధంగా సంబోధించడం విద్యార్థులను, వారి కష్టాన్ని తీవ్రంగా అవమానించడమే అవుతుందని అన్నారు..
ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది.  ఇటీవల ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకు కనీసం ఉద్యోగ దరఖాస్తులు నింపడం కూడా రాదని హేళన చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా వారిని "క్రిమినల్స్", "వేస్ట్" అంటూ నోరుపారేసుకోవడం వారి అహంకార పూరిత వైఖరికి నిదర్శనం.
కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం చూస్తుంటే—రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులు చదవకూడదని, ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులుగానే ఉండిపోవాలని వారు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. 
నిరుద్యోగ భృతి 4,000 వేలు, యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సంపూర్ణంగా విఫలమైన ఈ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులపైనే ఇటువంటి నిందలు వేయడం దురదృష్టకరం అని  కాంగ్రెస్ ప్రభుత్వ ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమించి ఎండగడుతుందని అన్నారు..
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి ,బిజెపి  నాయకులు, రజినీకాంత్,భూమేష్ యాదవ్,సందీప్, చిరంజీవి, అశోక్ ,బిజెవైఎం నాయకులు అరుణ్,రాజు, సందీప్, సాయి, ప్రణయ్  తదితరులు ఉన్నారు..
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    58 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.