logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌‌కు ఆదేశం 2013 నాటి అత్యాచారం కేసులో దోషిగా తేలిన మాజీ తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లొంగిపోవడం నుంచి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. తేజ్‌పాల్ పిటిషన్‌పై జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ సోమవారం విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. తేజ్‌పాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, గోవా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తేజ్‌పాల్ అప్పీల్‌ను విచారణకు స్వీకరించాలంటే ముందుగా ఆయన లొంగిపోయినట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని.. లేదంటే లొంగిపోవడం నుంచి మినహాయింపు కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని తుషార్ మెహతా వాదించారు. సుప్రీంకోర్టు రూల్స్, 2013తో పాటు గత తీర్పులను ఆయన ప్రస్తావించారు. అయితే కపిల్ సిబల్ మాత్రం గోవా ప్రభుత్వం ప్రస్తావించిన సుప్రీంకోర్టు నిబంధనలు ఈ కేసుకు వర్తించవని వాదించారు.

4 hrs ago
user_Saddala Adi
Saddala Adi
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
9fbe2741-4783-47e0-a089-7d5e26958ddf

అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌‌కు ఆదేశం 2013 నాటి అత్యాచారం కేసులో దోషిగా తేలిన మాజీ తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లొంగిపోవడం నుంచి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. రెండు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. తేజ్‌పాల్ పిటిషన్‌పై జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ సోమవారం విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. తేజ్‌పాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, గోవా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తేజ్‌పాల్ అప్పీల్‌ను విచారణకు స్వీకరించాలంటే ముందుగా ఆయన లొంగిపోయినట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని.. లేదంటే లొంగిపోవడం నుంచి మినహాయింపు కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని తుషార్ మెహతా వాదించారు. సుప్రీంకోర్టు రూల్స్, 2013తో పాటు గత తీర్పులను ఆయన ప్రస్తావించారు. అయితే కపిల్ సిబల్ మాత్రం గోవా ప్రభుత్వం ప్రస్తావించిన సుప్రీంకోర్టు నిబంధనలు ఈ కేసుకు వర్తించవని వాదించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.
    1
    దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ
రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః
ప్రారంభించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.
    1
    మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.
    user_Inayathulla Khan
    Inayathulla Khan
    Local News Reporter కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి
కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_Sanjeev
    Sanjeev
    Local News Reporter తాడిపత్రి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • రాయదుర్గంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు..భక్తి శ్రద్ధలతో ఊరేగింపు రాయదుర్గం పట్టణంలో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం బళ్లారి రోడ్డులోని దుర్గా మస్జిద్‌ వద్ద నుంచి జులూస్-ఏ-ముహమ్మదీ ప్రారంభమైంది.జులూస్‌ ఆత్మకూరు వీధి, ఊరువాకిలి,వినాయక సర్కిల్‌, లక్ష్మీ బజార్‌ మీదుగా సాగి తిరిగి దర్గా మస్జిద్‌ వద్దకు చేరుకుంది. ఊరేగింపులో మక్కా, మదీనా నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రదర్శించారు. నాత్‌లు, సలాత్‌లు చదువుతూ భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ఊరేగింపుతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.ఊరేగింపు సాగిన మార్గంలో ప్రవక్త హజ్రత్‌ మహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, మానవాళికి ఆయన అందించిన సందేశాలు, గొప్పతనాన్ని వివరిస్తూ నాత్‌ఖ్వాన్లు, మౌలానాలు ప్రసంగించారు.
    1
    రాయదుర్గంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు..భక్తి శ్రద్ధలతో ఊరేగింపు
రాయదుర్గం పట్టణంలో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం బళ్లారి రోడ్డులోని దుర్గా మస్జిద్‌ వద్ద నుంచి జులూస్-ఏ-ముహమ్మదీ ప్రారంభమైంది.జులూస్‌ ఆత్మకూరు వీధి, ఊరువాకిలి,వినాయక సర్కిల్‌, లక్ష్మీ బజార్‌ మీదుగా సాగి తిరిగి దర్గా మస్జిద్‌ వద్దకు చేరుకుంది. ఊరేగింపులో మక్కా, మదీనా నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రదర్శించారు. నాత్‌లు, సలాత్‌లు చదువుతూ భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ఊరేగింపుతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.ఊరేగింపు సాగిన మార్గంలో ప్రవక్త హజ్రత్‌ మహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, మానవాళికి ఆయన అందించిన సందేశాలు, గొప్పతనాన్ని వివరిస్తూ నాత్‌ఖ్వాన్లు, మౌలానాలు ప్రసంగించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి
    1
    రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి
రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్‌ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర  ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు
రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర  ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె  గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన  అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను  పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు,  పద్ధతులు,  మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు  అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర,  రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..! మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
    1
    మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..!
మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
    user_Mandula Venkatesh
    Mandula Venkatesh
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • రాయదుర్గంలో ఘనంగా శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలో బుధవారం భగవాన్ శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హాటకేశ్వరస్వామి దేవాలయం నుంచి జయంతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం శ్రీ జిహ్వేశ్వరస్వామి వారి భావచిత్రపటాన్ని వెండి రథంలో అలంకరించి పట్టణ ప్రధాన వీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపు బళ్లారి రోడ్, వినాయక సర్కిల్ మీదుగా ఓబులాచారి రోడ్డు వరకు కొనసాగింది.ఊరేగింపులో స్వకుళ సాళి సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్వకుళ సాళి సమాజ అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడుతూ, సభ్య సమాజంలో యుగపురుషుడిగా అవతరించిన శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతిని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం నామకరణ మహోత్సవం,అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెంకటేశులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
    1
    రాయదుర్గంలో ఘనంగా శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు నిర్వహణ
రాయదుర్గం పట్టణంలో బుధవారం భగవాన్ శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హాటకేశ్వరస్వామి దేవాలయం నుంచి జయంతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం శ్రీ జిహ్వేశ్వరస్వామి వారి భావచిత్రపటాన్ని వెండి రథంలో అలంకరించి పట్టణ ప్రధాన వీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపు బళ్లారి రోడ్, వినాయక సర్కిల్ మీదుగా ఓబులాచారి రోడ్డు వరకు కొనసాగింది.ఊరేగింపులో స్వకుళ సాళి సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా స్వకుళ సాళి సమాజ అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడుతూ, సభ్య సమాజంలో యుగపురుషుడిగా అవతరించిన శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతిని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం నామకరణ మహోత్సవం,అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెంకటేశులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.