ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 188 (తేదీ 21.07.2011)ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నంద్యాలలో జూన్ 19న జరిగిన జిల్లా స్థాయి సదస్సులో అధికారులు అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయితీలకు అప్పగించబడిన సహజ వనరులు, ఉమ్మడి ఆస్తులు, గ్రామ ఉమ్మడి భూములు, చెరువులు, కుంటలు, పచ్చిక బయళ్ళు, స్మశానవాటికలు, పోరంబోకు భూములు తదితర వనరులను పరిరక్షించడం ద్వారా సుస్థిర గ్రామాభివృద్ధిని సాధించవచ్చని ఈ సదస్సు పేర్కొంది. నంద్యాల జిల్లా హెచ్‌ఆర్‌డీ కేంద్రంలో జిల్లా పరిపాలన, ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ సంయుక్త ఆధ్వర్యంలో 'సహజ వనరులు, గ్రామ పంచాయితీ ఆస్తులు మరియు గ్రామ ఉమ్మడి వనరుల సంరక్షణలో సంరక్షకత్వాన్ని బలోపేతం చేయడం' అనే అంశంపై ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల నుండి డిప్యూటీ ఎంపీడీవోలు, డిప్యూటీ తహసీల్దార్లు, జిల్లా పంచాయితీ కార్యాలయం, జిల్లా రెవెన్యూ కార్యాలయం అధికారులు, జిల్లా పరిపాలన మరియు ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభ సమావేశంలో జిల్లా స్థాయి పంచాయితీ అధికారి అధికారులను స్వాగతిస్తూ, గ్రామ పంచాయితీ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. గ్రామీణ ప్రజల జీవనోపాధులకు, పర్యావరణ సమతుల్యతకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ఉమ్మడి వనరులు కీలకమని వివరించారు. 'క్రిటికాలిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కామన్స్' అంశంపై జరిగిన చర్చలో చెరువులు, కుంటలు, వాగులు, పచ్చిక బయళ్ళు, దహనవాటికలు, గ్రామ పోరంబోకు భూములు వంటి వాటి ప్రాధాన్యతను అధికారులు చర్చించారు. భూగర్భజలాల పెంపు, పశుసంపద ఆధారిత జీవనోపాధులు, జీవ వైవిధ్య సంరక్షణ, నేల-నీటి పరిరక్షణ, వాతావరణ మార్పులకు గ్రామాల అనుకూలత పెంపులో ఈ వనరుల పాత్రను విశ్లేషించారు. ఎఫ్.ఈ.ఎస్. సంస్థ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో చేపట్టిన ఉమ్మడి వనరుల పునరుద్ధరణ, సమాజ భాగస్వామ్యంతో నిర్వహణ, స్థానిక పాలనా వ్యవస్థల బలోపేతం వంటి కార్యక్రమాలను వివరించింది. మొదటి సాంకేతిక సమావేశంలో ఉమ్మడి వనరుల పరిరక్షణకు సంబంధించిన చట్టపరమైన, సంస్థాగత వ్యవస్థలపై చర్చ జరిగింది. ఇందులో బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ చట్టంలోని 22-A నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం, అసైన్డ్ ల్యాండ్ (పి.ఓ.టి.) చట్టం, 73వ రాజ్యాంగ సవరణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994, జీవో నెంబర్ 188, జీవో నెంబర్ 667, జీవో నెంబర్ 368, సి.సి.ఎల్.ఏ. ఉత్తర్వులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులపై వివరణ ఇచ్చారు. గ్రామ పంచాయితీ ఆస్తులను గుర్తించడం, సంరక్షించడం, పునరుద్ధరించడం, ఆక్రమణల నుండి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చట్టాలు ఇప్పటికే విస్తృత అధికారాలను కల్పించాయని, వాటిని సమర్థంగా వినియోగించుకోవాలని నిపుణులు సూచించారు. రెండవ సమావేశంలో జీవో నెంబర్ 188, ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయితీ ఆస్తుల రక్షణ నియమాలు – 2011పై అవగాహన కల్పించారు. గ్రామ పంచాయితీ ఆస్తుల వర్గీకరణ, భూ జాబితాల తయారీ, గ్రామ సభ ఆమోదం, గెజిట్ ప్రచురణ, ఆస్తుల రిజిస్టర్ల నిర్వహణ, ఆక్రమణల గుర్తింపు, తొలగింపు ప్రక్రియలపై వివరించారు. జీవో నెంబర్ 188 ప్రకారం గ్రామ పంచాయితీలకు చెందిన ఆస్తులు మూడు ప్రధాన కేటగిరీలుగా (పంచాయితీ సొంత ఆస్తులు, దానాలు లేదా బదిలీల ద్వారా వచ్చిన ఆస్తులు, పంచాయితీ ఆధీనంలో ఉన్న ఉమ్మడి వనరులు) ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటలు, వాగులు, పచ్చిక బయళ్ళు, పోరంబోకు భూములు, స్మశానాలు, నూర్పిడి కళ్ళాలు, బందెల దొడ్లు వంటి వనరులు గ్రామీణ జీవనానికి కీలకమని గుర్తించారు. గ్రూపులుగా విడిపోయిన అధికారులు గ్రామ మ్యాపులు, ఎఫ్.ఎం.బి.లు, అదంగళ్లు, రీసర్వే రికార్డులు, పంచాయితీ ఆస్తుల రిజిస్టర్లు, గెజిట్ నోటిఫికేషన్లు, భూ వర్గీకరణ పత్రాలు వంటి రికార్డులను ఉపయోగించి ఉమ్మడి వనరులను ఎలా గుర్తించవచ్చనే అంశంపై చర్చించారు. జీవో నెంబర్ 188 అమలులో కీలక దశలు, పంచాయితీ-రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం బలోపేతం చేయడం, గ్రామ పంచాయితీలకు, రెవెన్యూ శాఖకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక, చట్టపరమైన, సంస్థాగత మద్దతు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామ పంచాయితీ ఆస్తుల జాబితాలను సిద్ధం చేయడం, గ్రామ సభల ద్వారా ధృవీకరించడం, గెజిట్ ప్రచురణ, డిజిటల్ డేటాబేస్‌ల తయారీ, ఆక్రమణల రిజిస్టర్ల నిర్వహణ, ఆస్తులకు సరిహద్దులు గుర్తించడం వంటి అంశాలను ప్రాధాన్యతగా సూచించారు. రెవెన్యూ మరియు పంచాయితీ రాజ్ శాఖల అధికారులు సంయుక్తంగా భూముల పరిశీలన నిర్వహించడం, రెగ్యులర్ రివ్యూ సమావేశాలు నిర్వహించడం, జి.ఐ.ఎస్. ఆధారిత మ్యాపింగ్ చేపట్టడం, స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి సూచనలు చేశారు. జీవో నెంబర్ 188 ప్రకారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అత్యున్నత సాధికార కమిటీ, జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలలో రక్షణ కమిటీలను ఏర్పాటు చేసి వాటిని చురుకుగా పనిచేయించాలని అధికారులు నొక్కిచెప్పారు. భూముల ఇన్వెంటరీ తయారీ, గెజిట్ ప్రచురణ, ఆక్రమణల గుర్తింపు, తొలగింపు, ఆస్తుల సరిహద్దుల నిర్ధారణ, పునరుద్ధరణ చర్యల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. పంచాయితీలు రాజ్యాంగబద్ధ స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా తమ పరిధిలోని సహజ వనరులను సంరక్షించడంలో కీలక పాత్ర పోషించాలని సదస్సులో మాట్లాడిన అధికారులు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్–42 ప్రకారం రైతులు, మహిళలు, యువకులతో కూడిన స్థానిక కమిటీలను ఏర్పాటు చేసి ఉమ్మడి వనరుల వినియోగం, సంరక్షణకు స్థానిక నియమాలు రూపొందించుకోవచ్చని తెలిపారు. ఉమ్మడి వనరులను కాపాడుకోవడం ద్వారా గ్రామ స్వరాజ్య సాధనకు బలమైన పునాది ఏర్పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్.డి.ఓ. రాంబాబు, ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ ప్రతినిధులు బి. సదాశివ, ధనశేఖరన్, రమేష్ బాబు, జ్యోతి బాబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 188 (తేదీ 21.07.2011)ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నంద్యాలలో జూన్ 19న జరిగిన జిల్లా స్థాయి సదస్సులో అధికారులు అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయితీలకు అప్పగించబడిన సహజ వనరులు, ఉమ్మడి ఆస్తులు, గ్రామ ఉమ్మడి భూములు, చెరువులు, కుంటలు, పచ్చిక బయళ్ళు, స్మశానవాటికలు, పోరంబోకు భూములు తదితర వనరులను పరిరక్షించడం ద్వారా సుస్థిర గ్రామాభివృద్ధిని సాధించవచ్చని ఈ సదస్సు పేర్కొంది. నంద్యాల జిల్లా హెచ్‌ఆర్‌డీ కేంద్రంలో జిల్లా పరిపాలన, ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ సంయుక్త ఆధ్వర్యంలో 'సహజ వనరులు, గ్రామ పంచాయితీ ఆస్తులు మరియు గ్రామ ఉమ్మడి వనరుల సంరక్షణలో సంరక్షకత్వాన్ని బలోపేతం చేయడం' అనే అంశంపై ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల నుండి డిప్యూటీ ఎంపీడీవోలు, డిప్యూటీ తహసీల్దార్లు, జిల్లా పంచాయితీ కార్యాలయం, జిల్లా రెవెన్యూ కార్యాలయం అధికారులు, జిల్లా పరిపాలన మరియు ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభ సమావేశంలో జిల్లా స్థాయి పంచాయితీ అధికారి అధికారులను స్వాగతిస్తూ, గ్రామ పంచాయితీ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఉద్ఘాటించారు. గ్రామీణ ప్రజల జీవనోపాధులకు, పర్యావరణ సమతుల్యతకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ఉమ్మడి వనరులు కీలకమని వివరించారు. 'క్రిటికాలిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కామన్స్' అంశంపై జరిగిన చర్చలో చెరువులు, కుంటలు, వాగులు, పచ్చిక బయళ్ళు, దహనవాటికలు, గ్రామ పోరంబోకు భూములు వంటి వాటి ప్రాధాన్యతను అధికారులు చర్చించారు. భూగర్భజలాల పెంపు, పశుసంపద ఆధారిత జీవనోపాధులు, జీవ వైవిధ్య సంరక్షణ, నేల-నీటి పరిరక్షణ, వాతావరణ మార్పులకు గ్రామాల అనుకూలత పెంపులో ఈ వనరుల పాత్రను విశ్లేషించారు. ఎఫ్.ఈ.ఎస్. సంస్థ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో చేపట్టిన ఉమ్మడి వనరుల పునరుద్ధరణ, సమాజ భాగస్వామ్యంతో నిర్వహణ, స్థానిక పాలనా వ్యవస్థల బలోపేతం వంటి కార్యక్రమాలను వివరించింది. మొదటి సాంకేతిక సమావేశంలో ఉమ్మడి వనరుల పరిరక్షణకు సంబంధించిన చట్టపరమైన, సంస్థాగత వ్యవస్థలపై చర్చ జరిగింది. ఇందులో బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ చట్టంలోని 22-A నిబంధనలు, ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం, అసైన్డ్ ల్యాండ్ (పి.ఓ.టి.) చట్టం, 73వ రాజ్యాంగ సవరణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994, జీవో నెంబర్ 188, జీవో నెంబర్ 667, జీవో నెంబర్ 368, సి.సి.ఎల్.ఏ. ఉత్తర్వులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులపై వివరణ ఇచ్చారు. గ్రామ పంచాయితీ ఆస్తులను గుర్తించడం, సంరక్షించడం, పునరుద్ధరించడం, ఆక్రమణల నుండి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చట్టాలు ఇప్పటికే విస్తృత అధికారాలను కల్పించాయని, వాటిని సమర్థంగా వినియోగించుకోవాలని నిపుణులు సూచించారు. రెండవ సమావేశంలో జీవో నెంబర్ 188, ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయితీ ఆస్తుల రక్షణ నియమాలు – 2011పై
అవగాహన కల్పించారు. గ్రామ పంచాయితీ ఆస్తుల వర్గీకరణ, భూ జాబితాల తయారీ, గ్రామ సభ ఆమోదం, గెజిట్ ప్రచురణ, ఆస్తుల రిజిస్టర్ల నిర్వహణ, ఆక్రమణల గుర్తింపు, తొలగింపు ప్రక్రియలపై వివరించారు. జీవో నెంబర్ 188 ప్రకారం గ్రామ పంచాయితీలకు చెందిన ఆస్తులు మూడు ప్రధాన కేటగిరీలుగా (పంచాయితీ సొంత ఆస్తులు, దానాలు లేదా బదిలీల ద్వారా వచ్చిన ఆస్తులు, పంచాయితీ ఆధీనంలో ఉన్న ఉమ్మడి వనరులు) ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటలు, వాగులు, పచ్చిక బయళ్ళు, పోరంబోకు భూములు, స్మశానాలు, నూర్పిడి కళ్ళాలు, బందెల దొడ్లు వంటి వనరులు గ్రామీణ జీవనానికి కీలకమని గుర్తించారు. గ్రూపులుగా విడిపోయిన అధికారులు గ్రామ మ్యాపులు, ఎఫ్.ఎం.బి.లు, అదంగళ్లు, రీసర్వే రికార్డులు, పంచాయితీ ఆస్తుల రిజిస్టర్లు, గెజిట్ నోటిఫికేషన్లు, భూ వర్గీకరణ పత్రాలు వంటి రికార్డులను ఉపయోగించి ఉమ్మడి వనరులను ఎలా గుర్తించవచ్చనే అంశంపై చర్చించారు. జీవో నెంబర్ 188 అమలులో కీలక దశలు, పంచాయితీ-రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం బలోపేతం చేయడం, గ్రామ పంచాయితీలకు, రెవెన్యూ శాఖకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక, చట్టపరమైన, సంస్థాగత మద్దతు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామ పంచాయితీ ఆస్తుల జాబితాలను సిద్ధం చేయడం, గ్రామ సభల ద్వారా ధృవీకరించడం, గెజిట్ ప్రచురణ, డిజిటల్ డేటాబేస్‌ల తయారీ, ఆక్రమణల రిజిస్టర్ల నిర్వహణ, ఆస్తులకు సరిహద్దులు గుర్తించడం వంటి అంశాలను ప్రాధాన్యతగా సూచించారు. రెవెన్యూ మరియు పంచాయితీ రాజ్ శాఖల అధికారులు సంయుక్తంగా భూముల పరిశీలన నిర్వహించడం, రెగ్యులర్ రివ్యూ సమావేశాలు నిర్వహించడం, జి.ఐ.ఎస్. ఆధారిత మ్యాపింగ్ చేపట్టడం, స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి సూచనలు చేశారు. జీవో నెంబర్ 188 ప్రకారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అత్యున్నత సాధికార కమిటీ, జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలలో రక్షణ కమిటీలను ఏర్పాటు చేసి వాటిని చురుకుగా పనిచేయించాలని అధికారులు నొక్కిచెప్పారు. భూముల ఇన్వెంటరీ తయారీ, గెజిట్ ప్రచురణ, ఆక్రమణల గుర్తింపు, తొలగింపు, ఆస్తుల సరిహద్దుల నిర్ధారణ, పునరుద్ధరణ చర్యల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. పంచాయితీలు రాజ్యాంగబద్ధ స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా తమ పరిధిలోని సహజ వనరులను సంరక్షించడంలో కీలక పాత్ర పోషించాలని సదస్సులో మాట్లాడిన అధికారులు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్–42 ప్రకారం రైతులు, మహిళలు, యువకులతో కూడిన స్థానిక కమిటీలను ఏర్పాటు చేసి ఉమ్మడి వనరుల వినియోగం, సంరక్షణకు స్థానిక నియమాలు రూపొందించుకోవచ్చని తెలిపారు. ఉమ్మడి వనరులను కాపాడుకోవడం ద్వారా గ్రామ స్వరాజ్య సాధనకు బలమైన పునాది ఏర్పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్.డి.ఓ. రాంబాబు, ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ ప్రతినిధులు బి. సదాశివ, ధనశేఖరన్, రమేష్ బాబు, జ్యోతి బాబు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
- నంద్యాల కోర్టులో జూలై 11న జరగనున్న మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మనరాజా సూచించారు. శనివారం నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో నంద్యాల డివిజన్ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. న్యాయమూర్తి అమ్మనరాజా మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో రాజీ చేయదగ్గ కేసులను రాజీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజీ మార్గం ద్వారా అమూల్యమైన సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఎక్కువ కేసులను పరిష్కరించడమే లక్ష్యంగా కక్షిదారులు ముందుకు రావాలని కోరారు. లోక్ అదాలత్‌లో రాజీ కుదిరిన కేసులపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నొక్కిచెప్పారు.1
- నంద్యాల జిల్లాలోని మహానంది మండల పరిధిలోని గాజులపల్లె గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మండలంలోని మొత్తం 4,200 మంది రైతులకు ₹2.84 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిధుల పంపిణీ జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ కంచర్ల శివయ్య, మండల క్లస్టర్ ఇన్‌ఛార్జి నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గోపవరం సొసైటీ చైర్మన్ గంగవరపు ఉమామహేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు ఉల్లి మధు, నాయకులు శశికళ కొండారెడ్డి, లక్ష్మీనారాయణ, రవి స్వామి, హరి ప్రసాద్ రెడ్డి, కిరణ్ కుమార్ గౌడ్, నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- కూటమి ప్రభుత్వం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్పష్టం చేశారు. నందికొట్కూరులో జరిగిన రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య, 'పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ' పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ₹20 వేల చొప్పున మూడు విడతలుగా ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు. రైతుల కోసం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన మరోసారి పేర్కొన్నారు.1
- ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులకు చేయూతను అందిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7 వేలు జమ చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.1
- ఎమ్మిగనూరు నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత 76 సంవత్సరాలుగా మదాసి కురువ/మదారి కురువ కులస్తులకు జరుగుతున్న అన్యాయంపై ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, కన్వర్టెడ్ క్రిస్టియన్ పాస్టర్లకు SC సర్టిఫికెట్లను అంగడిలో పప్పుల బెల్లాలు లాగా పంచిపెడుతూ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. నిజమైన ఎస్సీలైన మదాసి కురువ/మదారి కురువ సోదరులకు SC సర్టిఫికెట్ ఇస్తే, కురుబ/కురుమలు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారని ప్రచారం చేయడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. SCలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని సమితి తెలియజేసింది. రాయలసీమ జిల్లాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులను కుల మార్పిడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎస్సీలోని 58 కులాలు హక్కులను పొందుతూ ముందుకు పోతూ ఉంటే, ఏకైక కులమైనటువంటి మదాసి కురువ/మదారి కురువ కులస్తులు ఇప్పటివరకు కోల్పోయిన రాజ్యాంగ హక్కులను పునరుద్ధరించేంతవరకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి పోరాడుతూనే ఉంటుందని ప్రసన్నకుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ మద్దిలేటి మదాసి కురువ, సాల్వాడి సురేంద్ర, మహదేవప్ప పవన్, జూలకల్లు మునిష్, సుంకేసుల హుస్సేన్ అప్ప, అలువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.1
- వనపర్తి జిల్లాలోని పానగల్ మండలంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మామిడి చెట్లను నరికివేసిన సంఘటన చోటుచేసుకుంది. కేతేపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల మన్యం, రాజు, సురేష్‌లకు చెందిన మామిడి తోటలో ఈ విధ్వంసం జరిగింది. రాజు తెలిపిన వివరాల ప్రకారం, వారి తోటలో మొత్తం 150 మామిడి చెట్లు ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో 130 మామిడి చెట్లను నరికి ధ్వంసం చేశారు.1
- నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో శనివారం ఆకస్మికంగా కురిసిన వర్షం, గత నాలుగు రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు పెద్ద ఉపశమనాన్నిచ్చింది. ఎండల తీవ్రతకు ఎండిపోతాయని భయపడిన పంట మొలకలు ఈ వానతో తిరిగి జీవం పోసుకుంటాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు, చేతికొచ్చే తరుణంలో ఉన్న మొలకలు ప్రాణం పోసుకుంటాయనే ధీమాతో రైతన్నల కళ్లల్లో ఆనందం వెల్లువిరిసింది. బిజినపల్లి మంగనూరులో పడిన ఈ చినుకు, నిజంగానే పంట మొలకలకు కొత్త జీవితాన్నిచ్చి, రైతన్నల మోమున చిరునవ్వులు పూయించింది.1
- ప్రియ సహోదరీ సోదరులారా, ఈ సందేశం ప్రభు యేసుక్రీస్తు సన్నిధిలో స్తుతించిన, ఆరాధించిన, ప్రార్థించిన, మరియు వైవిధ్యానించిన వారికి అపారమైన సంతోషం, సమాధానం లభిస్తాయని తెలియజేస్తుంది. దీనితో పాటు, ఎంతో ఆనందంగా జీవము, బలము, క్షేమాదాలను పొందుతారని స్పష్టం చేయబడింది.1