logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

టీజీఈ జేఏసీ సన్నాహక సమావేశం............................. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ఉమర్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. అనంతరం జిల్లా పాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

20 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
20 hrs ago
18235469-1692-46ff-81e5-2b544c4bf77c
8d213f58-13c0-4485-8718-81811a971b17
fd8996e9-dbdd-4309-877e-de650c805650

టీజీఈ జేఏసీ సన్నాహక సమావేశం............................. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ఉమర్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. అనంతరం జిల్లా పాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంజిల్లాలోని ఇందిరానగర్ సమీపంలో కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద బొలెరో వాహనం మేకల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నాలుగు మేకలు గాయపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహనం వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంజిల్లాలోని ఇందిరానగర్ సమీపంలో కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద బొలెరో వాహనం మేకల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నాలుగు మేకలు గాయపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహనం వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియ నేతకాని సామాజిక వర్గంలో పెను మంటలు రేపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన శక్తిగా ఉన్న నేతకానీలను జనాభా లెక్కల్లో విస్మరించడంపై ఆ సామాజిక వర్గ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వివక్షను నిరసిస్తూ నేతకాని విద్యార్థి సంఘం (TNMVS OUJAC) రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ​"మా ఉనికిని తుడిచేస్తారా?" - ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిని ప్రసాద్ ​కులగణన నివేదికల్లో నేతకాని కులానికి కనీస గుర్తింపు ఇవ్వకపోవడంపై ఓయూ వేదికగా జరిగిన సమావేశంలో సాయిని ప్రసాద్ నేత మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు ​కుట్ర పూరిత వివక్ష: "తెలంగాణ గడ్డపై 12 లక్షల జనాభా కలిగిన మా సమాజాన్ని లెక్కల్లో చూపకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, నేతకానీల గొంతు నొక్కే ప్రయత్నం." ​40 నియోజకవర్గాల్లో పంజా: రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతకాని ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారని, తమను తక్కువ అంచనా వేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. ​తొత్తుల పాలన: ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ముకాస్తూ, అత్యంత వెనుకబడిన నేతకానీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ​ఉద్యమ కార్యాచరణ సిద్ధం ​ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నేతకాని బిడ్డలంతా ఏకతాటిపైకి వచ్చి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ప్రక్రియ నేతకాని సామాజిక వర్గంలో పెను మంటలు రేపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధాన శక్తిగా ఉన్న నేతకానీలను జనాభా లెక్కల్లో విస్మరించడంపై ఆ సామాజిక వర్గ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ వివక్షను నిరసిస్తూ నేతకాని విద్యార్థి సంఘం (TNMVS OUJAC) రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
​"మా ఉనికిని తుడిచేస్తారా?" - ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిని ప్రసాద్
​కులగణన నివేదికల్లో నేతకాని కులానికి కనీస గుర్తింపు ఇవ్వకపోవడంపై ఓయూ వేదికగా జరిగిన సమావేశంలో సాయిని ప్రసాద్ నేత మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు
​కుట్ర పూరిత వివక్ష: "తెలంగాణ గడ్డపై 12 లక్షల జనాభా కలిగిన మా సమాజాన్ని లెక్కల్లో చూపకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, నేతకానీల గొంతు నొక్కే ప్రయత్నం."
​40 నియోజకవర్గాల్లో పంజా: రాష్ట్రవ్యాప్తంగా 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతకాని ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారని, తమను తక్కువ అంచనా వేస్తే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు.
​తొత్తుల పాలన: ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ముకాస్తూ, అత్యంత వెనుకబడిన నేతకానీలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
​ఉద్యమ కార్యాచరణ సిద్ధం
​ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నేతకాని బిడ్డలంతా ఏకతాటిపైకి వచ్చి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • రోడ్డు నియమాలను అందరూ పాటించాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అలైవ్ అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ అప్పాల జలపతి, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఉన్నారు.
    1
    రోడ్డు నియమాలను అందరూ పాటించాలని జన్నారం మండల ఎస్సై ఉదయ్ కిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ సూచించారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అలైవ్ అరైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ అప్పాల జలపతి, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఉన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల : జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు.  ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.  కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు,  వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.
    1
    జగిత్యాల :
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయం తాటిపల్లిలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగిత్యాల కు చెందిన సీనియర్ కంటి వైద్యులు డా. ముదస్సర్ తన సిబ్బందితో కలిసి వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. 
ఈ సందర్భంగా డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వాహన డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంవిఐ లు అభిలాష్, ప్రమీల, షేక్ రియాజ్, రామారావు, కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 
కంటి పరీక్షల అనంతరం, డా. ముదస్సర్ ప్రస్తుత ఎండాకాలంలో వాహన డ్రైవర్లతో పాటుగా చిన్నపిల్లలు,  వృద్దులు కంటి జాగ్రతల కోసం టీబీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    50 min ago
  • పత్రికా ప్రకటన ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 16 :- *రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అదనపు డీజీ.* *"అరైవ్ అలైవ్" లో భాగంగా ప్రమాదాల నివారణకు కృషి* *ప్రభుత్వ ఆమోదిత రేడియం స్టిక్కర్లను లారీలకు అతికించిన అదనపు డీజీపి* *గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ డా అనిల్ కుమార్* “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. అతివేగంతో జరిగిన ప్రమాదానికి గురైన కారును ప్రజలకు కనిపించే విధంగా గుడిహత్నూర్ సమీపంలో ఏర్పాటు చేసి, గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ డా అనిల్ కుమార్ గారిచే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొన్నారు. అదేవిధంగా భారీ వాహనాలకు వెనుక భాగంలో ప్రభుత్వం ఆమోదిత ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లను అతికించడం జరిగింది. వీటి ద్వారా ఎంత దూరం నుండి అయినా రేడియం స్టిక్కర్ల పై లైట్ పడినట్లు అయితే అవి మెరుస్తూ రోడ్లపై ఉన్న వాహనాలను వాహనదారులను కనిపించే విధంగా ప్రతిబింబిస్తాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అవగాహన ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. వేగం వల్ల జరిగే ప్రమాదాల తీవ్రతను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రమాదానికి గురైన కారును ప్రదర్శనగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ముఖ్యంగా ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల అవకాశాలు అధికమవుతాయని హెచ్చరించారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీస్తుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించి, ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనను జిల్లా పోలీసు శాఖ మరియు సోమ హైవే సంస్థల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పరిపాలన అదనపు ఎస్పీ పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సోమ సంస్థ సిబ్బంది, ఇచ్చోడా సీఐ సిహెచ్ రమేష్, గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
ఏప్రిల్ 16 :-
*రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అదనపు డీజీ.* 
*"అరైవ్ అలైవ్" లో భాగంగా ప్రమాదాల నివారణకు కృషి* 
*ప్రభుత్వ ఆమోదిత రేడియం స్టిక్కర్లను లారీలకు అతికించిన అదనపు డీజీపి* 
*గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ డా అనిల్ కుమార్* 
“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. అతివేగంతో జరిగిన ప్రమాదానికి గురైన కారును ప్రజలకు కనిపించే విధంగా గుడిహత్నూర్ సమీపంలో ఏర్పాటు చేసి, గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ ఆపరేషన్ అదనపు డీజీపీ డా అనిల్ కుమార్ గారిచే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొన్నారు. అదేవిధంగా భారీ వాహనాలకు వెనుక భాగంలో ప్రభుత్వం ఆమోదిత ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లను అతికించడం జరిగింది. వీటి ద్వారా ఎంత దూరం నుండి అయినా రేడియం స్టిక్కర్ల పై లైట్ పడినట్లు అయితే అవి మెరుస్తూ రోడ్లపై ఉన్న వాహనాలను  వాహనదారులను కనిపించే విధంగా ప్రతిబింబిస్తాయి.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అవగాహన ద్వారానే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. వేగం వల్ల జరిగే ప్రమాదాల తీవ్రతను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రమాదానికి గురైన కారును ప్రదర్శనగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ముఖ్యంగా ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల అవకాశాలు అధికమవుతాయని హెచ్చరించారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీస్తుందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించి, ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనను జిల్లా పోలీసు శాఖ మరియు సోమ హైవే సంస్థల సహకారంతో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, పరిపాలన అదనపు ఎస్పీ పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సోమ సంస్థ సిబ్బంది, ఇచ్చోడా సీఐ సిహెచ్ రమేష్, గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    20 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి  ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
    1
    lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • ప్రభుత్వ పాఠశాలలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి పాఠశాల హెచ్ఎం గిరిధర్ అన్నారు. శుక్రవారం గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులువిద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ ఉన్నారు.
    1
    ప్రభుత్వ పాఠశాలలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి పాఠశాల హెచ్ఎం గిరిధర్ అన్నారు. శుక్రవారం గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులువిద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ ఉన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.