logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాణాసంచా పేలుడు ఘటన దిగ్భ్రాంతి..చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్* *బాణాసంచా పేలుడు ఘటన దిగ్భ్రాంతి కలిగించింది* *చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్* *ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే* చల్లపల్లి పోలీస్ స్టేషనులో బాణాసంచా పేలుడు ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం చల్లపల్లి పోలీస్ స్టేషనులో దీపావళి టపాసుల పేలుడు ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పేలుడు ధాటికి గురై ధ్వంసమైన ఎస్ఐ కారు, స్టేషన్ భవనం, భీతావహంగా మారిన పరిసరాలు పరిశీలించారు. ఘటనా స్థలంలో పగిలిపోయిన కుండీలు, స్టేషన్ వరండాలో దెబ్బ తిని పలు చోట్ల కాలిపోయిన రిసెప్షన్ కౌంటర్, పగిలిపోయిన ఎస్ఐ గది డోర్, దెబ్బ తిన్న వెనుక గుమ్మం, వరండా పక్క గదిలో ఊడిపోయిన సీలింగ్ పరిశీలించారు. చల్లపల్లి సీఐ కే.ఈశ్వరరావు, మోపిదేవి ఎస్ఐ పామర్తి గౌతమ్ కుమార్ ఘటన జరిగిన తీరును ఎమ్మెల్యేకు వివరించారు. ప్రమాదంలో గాయపడిన చల్లపల్లి ఎస్ఐ డీ.దుర్గా ఆంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, కానిస్టేబుల్ డీ.నాగరాజులకు ఎక్కువ గాయాలు కాగా వారిని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. స్వల్ప గాయాలకు గురైన హెడ్ కానిస్టేబుల్ తేజ, కానిస్టేబుల్ శివపార్వతి చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దీపావళి టపాసులు కోర్టుకు తరలించే క్రమంలో ప్రమాదవశాత్తు సంభవించిన ఈ ఘటనలో ఎస్ఐ సహా ఐదుగురు పోలీస్ సిబ్బంది గాయాలకు గురికావడం బాధాకరం అన్నారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం వాటిల్లకపోవడం అదృష్టం అన్నారు. పేలుడు ధాటికి భవనంలోని అన్ని గదులు దెబ్బ తిన్నాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రమాద ఘటనలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ తేజ, మహిళా కానిస్టేబుల్ శివపార్వతిలను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

1 hr ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
338805e3-e1ae-4704-b15e-12bc63f29a16

బాణాసంచా పేలుడు ఘటన దిగ్భ్రాంతి..చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్* *బాణాసంచా పేలుడు ఘటన దిగ్భ్రాంతి కలిగించింది* *చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్* *ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే* చల్లపల్లి పోలీస్ స్టేషనులో బాణాసంచా పేలుడు ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం చల్లపల్లి పోలీస్ స్టేషనులో దీపావళి టపాసుల పేలుడు ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పేలుడు ధాటికి

20534670-6a61-49c0-a7ee-5b63f6db6bbe

గురై ధ్వంసమైన ఎస్ఐ కారు, స్టేషన్ భవనం, భీతావహంగా మారిన పరిసరాలు పరిశీలించారు. ఘటనా స్థలంలో పగిలిపోయిన కుండీలు, స్టేషన్ వరండాలో దెబ్బ తిని పలు చోట్ల కాలిపోయిన రిసెప్షన్ కౌంటర్, పగిలిపోయిన ఎస్ఐ గది డోర్, దెబ్బ తిన్న వెనుక గుమ్మం, వరండా పక్క గదిలో ఊడిపోయిన సీలింగ్ పరిశీలించారు. చల్లపల్లి సీఐ కే.ఈశ్వరరావు, మోపిదేవి ఎస్ఐ పామర్తి గౌతమ్ కుమార్ ఘటన జరిగిన తీరును ఎమ్మెల్యేకు వివరించారు.

f855daad-b3b5-4632-837e-67930a79b64d

ప్రమాదంలో గాయపడిన చల్లపల్లి ఎస్ఐ డీ.దుర్గా ఆంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, కానిస్టేబుల్ డీ.నాగరాజులకు ఎక్కువ గాయాలు కాగా వారిని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. స్వల్ప గాయాలకు గురైన హెడ్ కానిస్టేబుల్ తేజ, కానిస్టేబుల్ శివపార్వతి చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దీపావళి టపాసులు కోర్టుకు తరలించే క్రమంలో ప్రమాదవశాత్తు సంభవించిన ఈ ఘటనలో ఎస్ఐ సహా ఐదుగురు పోలీస్

be991128-3789-4dc8-a432-399001a8edb5

సిబ్బంది గాయాలకు గురికావడం బాధాకరం అన్నారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం వాటిల్లకపోవడం అదృష్టం అన్నారు. పేలుడు ధాటికి భవనంలోని అన్ని గదులు దెబ్బ తిన్నాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రమాద ఘటనలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ తేజ, మహిళా కానిస్టేబుల్ శివపార్వతిలను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గుండాలపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో గుండాలపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • *అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
    2
    *అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం*
తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    6 hrs ago
  • కదిరి యోగి వేమన ఉత్సవాలలో విచక్షణారహితంగా హుస్సేన్, దేవా కానిస్టేబుళ్లు వంశీ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి జరుగుతున్న ఉత్సవాలలో వేదిక ప్రక్కన ఉన్న వంశీని చితకబాదినట్లు వంశి మీడియాతో వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని ప్రభుత్వ వైద్యశాలలో మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు. ఆ ఇద్దరినీ సస్పెండ్ చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.
    1
    కదిరి యోగి వేమన  ఉత్సవాలలో విచక్షణారహితంగా  హుస్సేన్, దేవా  కానిస్టేబుళ్లు వంశీ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి జరుగుతున్న ఉత్సవాలలో వేదిక ప్రక్కన ఉన్న వంశీని చితకబాదినట్లు వంశి  మీడియాతో వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని ప్రభుత్వ వైద్యశాలలో మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు. ఆ ఇద్దరినీ సస్పెండ్ చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    4 hrs ago
  • బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు. కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: 1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్. 2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543). 3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు. 4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి, అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి, జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్ అభినిందించారు. పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
    1
    బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు.
కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది  బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు.
జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్.
2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543).
3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు.
4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి,
అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి,  జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్  అభినిందించారు.
పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యకు సోమవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చి రంగయ్యపై పూల వర్షం కురిపించారు. వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కావడానికి రంగయ్య కారణమంటూ జనాలు నినాదాలు చేశారు. జై జగన్, జై తలారి రంగయ్య అంటూ నినాదాలు చేశారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ, వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్యకు సోమవారం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చి రంగయ్యపై పూల వర్షం కురిపించారు. వైసీపీ నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఎ రెన్యువల్ కావడానికి రంగయ్య కారణమంటూ జనాలు నినాదాలు చేశారు. జై జగన్, జై తలారి రంగయ్య అంటూ నినాదాలు చేశారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ రేసును పోలీసులు వేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ ఇంచార్జ్ ఎస్పై గురు ప్రసాద్ రెడ్డి, కనేకల్ ఎస్పై నాగ మధు బృందం ఆదివారం కనేకల్ మండలం ఎర్రగుంట వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నేపుకల్ గ్రామానికి చెందిన రైతు బోయ గోవిందు 2026 జనవరి 11న గొర్రెల విక్రయించి రూ.1.50 లక్షల నగదుతో ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా ముగ్గురు నిందితులు బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చి కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితుల్లో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త ఓబులేసు ఇలియాన్ మనోహర రెడ్డి, మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్కెర రెడ్డి, పామిడి పట్టణం నెహ్రు నగర్కు చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడి గ్రామానికి చెందిన బెస్త మహేంద్ర ఉన్నారు. ప్రధాన నిందితుడు ఓబులేసు గత జనవరిలో బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో హోల్సేల్ చక్కెర, ఐటీసీ సిగరెట్లు ఏజెంటుగా వ్యాపారం ప్రారంభించి స్థానికుల నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు.
    1
    రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్ గ్రామ సమీపంలో జరిగిన దారి దోపిడీ రేసును పోలీసులు వేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ ఇంచార్జ్ ఎస్పై గురు ప్రసాద్ రెడ్డి, కనేకల్ ఎస్పై నాగ మధు బృందం ఆదివారం కనేకల్ మండలం ఎర్రగుంట వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నేపుకల్ గ్రామానికి చెందిన రైతు బోయ గోవిందు 2026 జనవరి 11న గొర్రెల విక్రయించి రూ.1.50 లక్షల నగదుతో ద్విచక్ర వాహనంలో గ్రామానికి వెళ్తుండగా ముగ్గురు నిందితులు బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చి కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరెస్టు చేసిన నిందితుల్లో గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన బెస్త ఓబులేసు ఇలియాన్ మనోహర రెడ్డి, మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చక్కెర రెడ్డి, పామిడి పట్టణం నెహ్రు నగర్కు చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడి గ్రామానికి చెందిన బెస్త మహేంద్ర ఉన్నారు. ప్రధాన నిందితుడు ఓబులేసు గత జనవరిలో బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో హోల్సేల్ చక్కెర, ఐటీసీ సిగరెట్లు ఏజెంటుగా వ్యాపారం ప్రారంభించి స్థానికుల నమ్మకాన్ని పొందినట్లు పోలీసులు తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్ 'అమృత ధార' వాటర్ ప్లాంట్‌ ప్రారంభం - విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు. - కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్‌. - పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ ​గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో 1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
    4
    పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్  'అమృత ధార' వాటర్ ప్లాంట్‌ ప్రారంభం
- విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు.
- కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్‌.
- పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 
రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. 
ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ ​గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో  1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల  ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
    2
    మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం*
తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.