తక్కువ వడ్డీకి రుణాలు. అధిక వడ్డీ ఆశచూపి మోసగించిన వ్యక్తిపై ప్రత్తిపాటికి ఫిర్యాదు చేసిన పలు గ్రామాల ప్రజలు తక్కువ వడ్డీకి రుణాలు. అధిక వడ్డీ ఆశచూపి మోసగించిన వ్యక్తిపై ప్రత్తిపాటికి ఫిర్యాదు చేసిన పలు గ్రామాల ప్రజలు • బాధితుల ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు జరిపి, వారికి న్యాయం చేయాలని పోలీసులకు సూచించిన ప్రత్తిపాటి • త్వరలోనే అర్హులకు ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్లు, • ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి అధిక వడ్డీల ఆశ చూపడంతో పాటు.. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని తెలివిగా నమ్మించి తమ కష్టార్జితాన్ని దోచుకున్న వ్యక్తిపై పలు గ్రామాల ప్రజలు శనివారం మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటికి ఫిర్యాదు చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో ఎమ్మెల్యేను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగళ్ల వెంకట్రావు అనే వ్యక్తి.. రూ.10 వేలు మొదలు ఆ పైన మీస్థాయికి తగినంత ఇస్తే, ఆ మొత్తాన్ని తెలిసిన సంస్థల్లో పెట్టుబడులు రూపంలోకి మార్చి, ఎక్కువ లాభాలు అందిస్తానని నమ్మబలికి, అందినకాడికి దండుకొని ఇప్పుడు ముఖం చాటేశాడని ప్రజలు ఎమ్మెల్యే ప్రత్తిపాటికి మొరపెట్టుకున్నారు. తమకు జరిగిన మోసాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి తెలియచేశామని, వారు విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారని, తమకు జరిగిన మోసాన్ని గుర్తించి, సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడి తమకు న్యాయం జరిగేలా చూడాలని చిలకలూరిపేట మండలం గొట్టిపాడు, మిట్టపాలెం, దండమూడి, ఈవూరివారిపాలెం, అవిశాయపాలెం గ్రామస్తులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు ఫిర్యాదుచేశారు. గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన ప్రత్తిపాటి పోలీస్ అధికారులతో మాట్లాడి, మోసపోయిన వారికి న్యాయం చేయాలని, పేద, మద్యతరగతి ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని ఆదేశించారు. బాధితులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందున, అధైర్య పడాల్సిన పనిలేదని ప్రత్తిపాటి తెలిపారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో చిలకలూరిపేట పోలీస్ వారు పిర్యాదుపై సమగ్ర దర్యాప్తు జరిపి, మీకు తగిన న్యాయం చేస్తారని ప్రత్తిపాటి బాధితులకు భరోసా ఇచ్చారు. *త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు* సామాజిక పింఛన్లు పొందే అర్హులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెబుతుందని, అర్హులైన వారికి తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుతాయని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పింఛన్లు కావాలని పలు అర్జీలు తన దృష్టికి రావడంపై స్పందించారు. ఇప్పటికే ప్రభుత్వం అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు అందిస్తోందని, అలానే వికలాంగులకు న్యాయం చేసిందన్నారు. వృద్ధులకు కూడా త్వరలోనే న్యాయం చేస్తుందని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు, మద్దిబోయిన శివ, బేరింగ్ మౌలాలి, పట్టణ సి.ఐ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- ఈ సందర్భంగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ కూసంపూడి మహేష్ అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయానికి విచ్చేసిన నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన నాయకులు ప్రజల సుఖశాంతి, ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం ఘనంగా కొనసాగింది.1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by V Ramarao1
- నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ *నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.* పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 135వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెల్లవారుజామున విగ్రహం ముఖ భాగం పూర్తిగా చిద్రమై ఉండటాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కావాలనే చేసిన దుశ్చర్యగా భావిస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.1
- Post by Bondhu Suresh1
- పెదకూరపాడు: మాజీ ఎమ్మెల్యే టిడిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఓర్వలేక గత ప్రభుత్వంలో తామే చేసామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని జిల్లా మాజీ టిడిపి కార్యదర్శి ఆర్తి మల్ల రమేష్ అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో కూడా గ్రామ గ్రామాన 70% సిసి రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బ్రహ్మయ్య ముంతాజ్ అప్పారావు పాల్గొన్నారు.1
- Post by V Ramarao4
- Post by Bondhu Suresh1