అభివృద్ధికి అందరూ సహకరించాలి పెద్దపల్లి పట్టణం మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అభివృద్ధికి అందరూ సహకరించాలి. పెద్దపల్లి పట్టణం మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం. రోడ్డు వెడల్పు పనులు వేగవంతం చేయాలి. పట్టణాభివృద్ధిలో భాగంగానే మెయిన్ రోడ్డు విస్తరణ.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేదు. పెద్దపల్లి జిల్లా,సెప్టెంబర్ 15 రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా నుండి మజీద్ వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు మరియు సుందరీకరణ పనులను స్థానిక నాయకులతో మరియు అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ.పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా నుండి మజీద్ చౌరస్తా వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి రోడ్డు నిర్మాణంతో పాటు రెండు పక్కల అండర్ గ్రౌడ్ డ్రైనేజి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గత కొన్ని రోజుల నుండి రోడ్డు పనులు జరుగుతున్నాయి అని బుధవారం నుండి డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరుగుతుంది అని వినాయక చవితి నిమర్జనం లోపు రోడ్డు పనుల్లో ఎలాంటి సమస్యలున్న పరిష్కారం చేస్తామని తెలిపారు. రోడ్డు వెడల్పు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారు కోరారు. రోడ్డు 80 ఫిట్లు ఉండాలి కానీ ప్రజల ఆలోచన మేరకే, వ్యాపారస్తుల అభిప్రాయంతో 55 ఫిట్లకు కుదించడం జరిగిందని అన్నారు. జెండా చౌరస్తా నుండి మసీదు వరకు నూతనంగా నిర్మించే రోడ్డు పెద్దపల్లి పట్టణానికి తలమణికంగా ఉంటుందని పెద్దపల్లి పట్టణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి జెండా చౌరస్తా ప్రాంతానికి షాపింగ్ కోసం వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అలాగే రోడ్డు వెడల్పు పనులకు వ్యాపార వర్గాలు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి అందరూ సహకరించాలి పెద్దపల్లి పట్టణం మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అభివృద్ధికి అందరూ సహకరించాలి. పెద్దపల్లి పట్టణం మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం. రోడ్డు వెడల్పు పనులు వేగవంతం చేయాలి. పట్టణాభివృద్ధిలో భాగంగానే మెయిన్ రోడ్డు విస్తరణ.. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేదు. పెద్దపల్లి జిల్లా,సెప్టెంబర్ 15 రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా నుండి మజీద్ వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు మరియు సుందరీకరణ
పనులను స్థానిక నాయకులతో మరియు అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ.పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా నుండి మజీద్ చౌరస్తా వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి రోడ్డు నిర్మాణంతో పాటు రెండు పక్కల అండర్ గ్రౌడ్ డ్రైనేజి నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గత కొన్ని రోజుల నుండి రోడ్డు పనులు జరుగుతున్నాయి అని బుధవారం నుండి డ్రైనేజీ
పనులు ప్రారంభించడం జరుగుతుంది అని వినాయక చవితి నిమర్జనం లోపు రోడ్డు పనుల్లో ఎలాంటి సమస్యలున్న పరిష్కారం చేస్తామని తెలిపారు. రోడ్డు వెడల్పు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రభుత్వ విప్ విజయరమణ రావు గారు కోరారు. రోడ్డు 80 ఫిట్లు ఉండాలి కానీ ప్రజల ఆలోచన మేరకే, వ్యాపారస్తుల అభిప్రాయంతో 55 ఫిట్లకు కుదించడం జరిగిందని అన్నారు. జెండా చౌరస్తా నుండి మసీదు వరకు నూతనంగా నిర్మించే రోడ్డు పెద్దపల్లి పట్టణానికి తలమణికంగా
ఉంటుందని పెద్దపల్లి పట్టణ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి జెండా చౌరస్తా ప్రాంతానికి షాపింగ్ కోసం వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని అలాగే రోడ్డు వెడల్పు పనులకు వ్యాపార వర్గాలు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
- మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.1
- పత్రికా ప్రకటన నంద్యాల జిల్లా 15.09.2026 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆత్మకూరు:నంద్యాల జిల్లా. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.4
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- గణపతిని తెస్తుండగా జరిగిన దుర్ఘటన పటాస్ లకు దూరంగా ఉండండి డీజే మరియు త్రా గుడ కు ప్రమాదకర మైన వాటికి దూరంగా ఉండండి విషయం పటాస్ ల దాటికి సౌండ్ దాటికి లైటింగ్ దాటికి డ్రైవర్ కి కనబడక ఈ విషాదం జరిగింది అందరూ అన్నిటికీ దూరంగా ఉండి జాగ్రత్త వహించాలని కో రడ మై నది4
- భారత్ మాల రోడ్డు నుండి రాజోలి మండల కేంద్రానికి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలి. రాజోలి మీదుగా వెళ్తున్న భారత్‌మాల రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని అయితే మండల కేంద్రమైన రాజోలికి కనెక్టివిటీ రోడ్డు లేకుండా నిర్మాణం జరుగుతోందని మండల కేంద్రానికి తప్పనిసరిగా కనెక్టివిటీ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజోలి గ్రామస్తులు భారత్‌మాల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ నిరంతరాయంగా మండల కేంద్రానికి ప్రజలు రాత్రి పగలు అని తేడా లేకుండా రాకపోకలు సాగిస్తుంటారు కాబట్టి మండల కేంద్రానికి కనెక్టివ్ రోడ్డు ను నిర్మించాలని డిమాండ్ చేశారు.1
- వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం.. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ గారు ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.2
- ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.1
- *సెల్ఫీ వీడియో కలకలం* *గడ్డి మందు తాగుతూ..* *వేధింపులు తట్టుకోలేక మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం* *కుటుంబ సభ్యుల ఫిర్యాదు* *బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆశ్రయించిన కుటుంబం* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రైమ్9 న్యూస్ రిపోర్టర్ పోలిశెట్టి సత్యనారాయణ (చంటి) గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు గమనించి ఆయనను తొలుత నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆక్వా సాగులో నష్టాల కారణంగా అప్పులపాలైన సత్యనారాయణ, అనంతరం అప్పులు తీర్చినప్పటికీ కొందరు వడ్డీ వ్యాపారులతో కలిసి సహచర మీడియా ప్రతినిధులు తనను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రెస్‌మీట్లకు వెళ్లిన సందర్భాల్లో అవమానాలకు గురిచేశారని, సత్యనారాయణను పిలిస్తే తాము ప్రెస్‌మీట్లకు రామని కొందరు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్యనారాయణ భార్య, పిల్లలు, అన్న సుబ్రహ్మణ్యం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి సత్యనారాయణే ప్రధాన ఆధారమని, ఆయనకు ఏదైనా జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై టీవీ 9 మారుతి, టీవీ 5 సందీప్, ఐ న్యూస్ రాజేష్, సాక్షి పత్రిక కేతినేడి రంగపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరుతూ...ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు.3