గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ఫేజ్ 2 శిక్షణ తరగతులు గోదావరిఖని, ఆగస్టు 26: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ఫేజ్-2 ప్రక్రియలో భాగంగా బుధవారం గోదావరిఖనిలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, దీపక్ రాథోడ్ ప్రభాకర్ రెడ్డి, ఫహీం, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ SIR ఫేజ్-2 ప్రక్రియను అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా, అనర్హులు లేదా మరణించిన వారి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి సవరణలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా SIR ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని కోరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, మాట్లాడుతూ.. SIR ఫేజ్-2 శిక్షణలో అందిస్తున్న మార్గదర్శకాలను సిబ్బంది పూర్తిగా అవగాహన చేసుకుని క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ ఫేజ్ 2 శిక్షణ తరగతులు గోదావరిఖని, ఆగస్టు 26: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ఫేజ్-2 ప్రక్రియలో భాగంగా బుధవారం గోదావరిఖనిలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, దీపక్ రాథోడ్ ప్రభాకర్ రెడ్డి, ఫహీం, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ SIR ఫేజ్-2 ప్రక్రియను అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా, అనర్హులు లేదా మరణించిన వారి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి సవరణలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా SIR ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని కోరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, మాట్లాడుతూ.. SIR ఫేజ్-2 శిక్షణలో అందిస్తున్న మార్గదర్శకాలను సిబ్బంది పూర్తిగా అవగాహన చేసుకుని క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
- మిలాద్ -ఉన్ - నబీ సందర్భంగా ఊరేగింపు. ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు గోదావరిఖని గాంధీనగర్ లోని నురాని మదర్సా నుంచి గాంధీనగర్, కళ్యాణ్ నగర్, రీగల్ షూ మార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు.. మహ్మద్ ప్రవక్త సల్లెవలె వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ - ఉన్ - నబీ పండుగ సందర్భంగా తన్ జిమ్ అహెలే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు గోదావరిఖని గాంధీనగర్ లోని నురాని మదర్సా నుంచి గాంధీనగర్, కళ్యాణ్ నగర్, రీగల్ షూ మార్ట్ మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ ఊరేగింపును కాంగ్రెస్ నాయకుడు బాబర్ సలీంపాషా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబర్ సలీంపాషా మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త ఐకమత్యం, సోదర భావం, ధర్మ మార్గంలో నడవడం, జీవన విధానంపై చేసిన మార్గదర్శనం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. గోదావరిఖని చౌరస్తాలో జరిగిన సమావేశంలో తమ్ అధ్యక్షులు షేక్ హాజి అలీ గారు మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గంలో నడవాలని, ప్రవక్త ఒక్క ముస్లీంలకే కాదు ఆయన ప్రపంచం మొత్తానికి ఆదర్శ ప్రాయంగా నిలిచారని చెప్పారు. ప్రవక్త అనంత కరుణామయుడని, విశ్వశాంతి నిమిత్తం అల్లాహ్ ప్రవక్తను ఆఖరి ప్రవక్తగా ఎంపిక చేసినట్టు చెప్పారు. అనంతరం చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మసీదు అధ్యక్షులు షేక్ అలీ, రియాజ్ బేగ్, సర్వర్ హుస్సేన్, ఖాసీం, తన్జమ్ ప్రధాన కార్యదర్శి మీర్ జాకీర్, యాకూబ్, హస్సేన్ చిస్తి, సయ్యద్ జాని, హుస్సేన్ (బాజీ), ఖలీమ్, మీర్ ఫయాజ్, మొబిన్, ఉమర్, షాన్వాజ్, తాజ్, సయ్యద్ జానీ, సర్దార్, సలీం, మొయిన్, గౌస్ బాబా, అఫ్రోజ్, అఫ్ఘల్, ఆఫ్రిది, ఇషాంత్, రహమాన్, అధిక సంఖ్యలో ముస్లీంలు పాల్గొన్నారు.1
- *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* *రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం* *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* *రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం* . ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోఇటీవల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులు ఐన అమరవేణి నర్సాగౌడ్ గారికి పూల మాలలు శాలువాలతో ఆత్మీయ సన్మానం చేశారు నిర్వహించారు. అమరవేణి నర్సాగౌడ్ హనుముల భాస్కర్ మాట్లాడుతూ :- ఈ దేశంలో 85% పైనున్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రాకుండా కేవలం పిడికెడు మంది ఉన్న అగ్రకులాలు రాజ్యాంగపరమైన పదవులను అనుభవిస్తూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కకుండా చేస్తున్న వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం లభించే వరకు ఐక్యంగా పోరాడుతామని తెలియజేశారు బీసీల జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా, హక్కులు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. . ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ , సోన్ మండల అధ్యక్షులు మ్యాక ప్రేమ్ కుమార్ నాయకులు రమేష్, సత్యనారాయణ, రాజేష్, లక్ష్మీనారాయణ, కిషోర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం - 4 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు - వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి 3 కోట్ల 11 లక్షల రూపాయలు - పంచాయతీరాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం తాడ్వాయి,ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం సీఆర్‌ఆర్–ప్లెయిన్ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ..మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ రఘు,స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఓనం వేడుకల్లో ఘనంగా అయ్యప్ప స్వామికి మహా పడిపూజ కార్యక్రమం MLG: గోవిందరావుపేటలోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంలో బుధవారం ఓనం పండుగ సందర్భంగా స్వామివారికి శుభయాత్ర, కోనేరులో చక్రస్నానం, అభిషేకం, మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు డింగరి రంగాచార్యుల ఆధ్వర్యంలో ధూపాటి సమ్మక్క–అంతయ్య కుటుంబ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ పీఎంకే గాంధీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.1
- ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధే ప్రాధాన్యత - రూ: 4 కోట్ల 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు : మంత్రి సీతక్క. ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 26 (భారత శక్తి): గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం సీఆర్‌ఆర్–ప్లెయిన్ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.1
- ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. మల్లంపల్లి మండల కేంద్రంలో శివం గార్డెన్ లో నత్తి మొగిలి కూతురు వివాహానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని పలు శుభకార్యాలకు పెళ్లిళ్లు కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఏటూరునాగారం చేరుకొని ఏటూరునాగారం మండల కేంద్రంలో Y జంక్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిచారు ఏటూరునాగారం మండలంలో శివపురం గ్రామంలో సిసి రోడ్లను మంత్రి సీతక్క ప్రారంభోత్సవం అదేవిధంగా గోగుపల్లి గ్రామంలో కూడా నూతన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసారు.. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్...రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడం కోసం ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్ కు భూమి పూజ కార్యక్రమం ఉంటుంది...కావున ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో ప్రైవేటు కార్యక్రమం లో మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు. మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్లు స్వయంగా మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా వారికి అందజేయనున్నారు. మల్లూరు- మామిడిగూడెం లో నూతనంగా నిర్మాణం చేసిన పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.4
- *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప - బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.1
- సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట కోదాడ రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే తెలంగాణ : సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట వద్ద బుధవారం ఉదయం కంటైనర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అయితే మృతులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. మృతులు యాసారపు చిన్ని(32), బొల్లిపొంగు మేరీ జోష్న(29), చెన్నకేశవుల నాగేంద్రబాబు(21)గా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.1