logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

​పిఠాపురంలో అగ్నిమాపక వారోత్సవాలు: షాపింగ్ మాల్స్‌లో ఫైర్ సేఫ్టీ డెమో పిఠాపురం: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అగ్నిమాపక సేవా వారోత్సవాల్లో భాగంగా, రెండో రోజైన బుధవారం పిఠాపురం అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో పట్టణంలోని పలు చోట్ల ఆకస్మిక ప్రమాదాలకు అవకాశమున్న షాపింగ్ మాల్స్ మరియు మార్ట్‌లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రదేశాలలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మంటలను ఎలా అదుపు చేయాలి, అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలనే అంశంపై సిబ్బందికి మరియు ప్రజలకు ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగితే భయాందోళనకు గురికాకుండా సురక్షితంగా బయటపడే మార్గాలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ ఓ మాట్లాడుతూ ప్రజల ప్రాణ,ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, మాల్స్ నిర్వాహకులు మరియు పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొన్నారు.

5 days ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Local News Reporter Pithapuram, Kakinada•
5 days ago
d41824dd-c1d8-42a2-bcfe-5e662440cd08

​పిఠాపురంలో అగ్నిమాపక వారోత్సవాలు: షాపింగ్ మాల్స్‌లో ఫైర్ సేఫ్టీ డెమో పిఠాపురం: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అగ్నిమాపక సేవా వారోత్సవాల్లో భాగంగా, రెండో రోజైన బుధవారం పిఠాపురం అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో పట్టణంలోని పలు చోట్ల ఆకస్మిక ప్రమాదాలకు అవకాశమున్న షాపింగ్

6a2708a7-9ad6-4a58-9a48-b5c283a29fe5

మాల్స్ మరియు మార్ట్‌లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రదేశాలలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మంటలను ఎలా అదుపు చేయాలి, అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలనే అంశంపై సిబ్బందికి మరియు ప్రజలకు ప్రత్యక్ష ప్రదర్శన

5a03dacb-954a-4fe4-94b9-b6baf7cbc2c4

ఇచ్చారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగితే భయాందోళనకు గురికాకుండా సురక్షితంగా బయటపడే మార్గాలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ ఓ

4b43a229-9b50-4cdc-8429-a4238387bf0b

మాట్లాడుతూ ప్రజల ప్రాణ,ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, మాల్స్ నిర్వాహకులు మరియు పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొన్నారు.

More news from Kakinada and nearby areas
  • పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్‌ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్‌లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్‌లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
    3
    పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్‌ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్‌లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్‌లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    18 hrs ago
  • శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు
    1
    శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు
    user_యదీద్యా అభి శర్మ
    యదీద్యా అభి శర్మ
    పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    1
    జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by Sageni gangadhar
    1
    Post by Sageni gangadhar
    user_Sageni gangadhar
    Sageni gangadhar
    జి. మడుగుల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది... జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం. ఘటన స్థలాలనికి చేరుకున్న గాజువాక ఫైర్ ఇంజన్లు దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో మంటలు చెలరేగుతున్నాయి...
    4
    విశాఖ గాజువాక సోనోవిజన్ 4వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది...
జనరేటర్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటున్న సోనో విజన్ షోరూమ్ యాజమాన్యం.
ఘటన స్థలాలనికి చేరుకున్న  గాజువాక ఫైర్ ఇంజన్లు 
దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.
ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.
మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది... 
యాభై లక్షలు ఆస్థి నష్టం అంచనా వేసిన అధికారులు... 
అనాధికార నిర్మాణంలో ఎలక్ట్రికల్ గూడ్స్ స్టోరేజ్ చేయడంతో చెలరేగిన మంటలు... 
గాజువాకలో అనాదికార నిర్మాణాలకి జీవీఎంసీ, రాజకీయ నేతలు అనుమతులు ఇవ్వడంతో కనీసం ఫైర్ సేఫ్టీ లేని నిర్మాణాలలో  మంటలు చెలరేగుతున్నాయి...
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*
    2
    చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*
    user_Gurrala vigeswara ramarao
    Gurrala vigeswara ramarao
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
    3
    పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు.
కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.  వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.