Shuru
Apke Nagar Ki App…
కళ్యాణదుర్గంలో రాజకీయాలకు అతీతంగా ఎర్రిస్వామికి నివాళులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాల ఎర్రిస్వామి(92) మృతి చెందిన విషయం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా పలు పార్టీల నాయకులు ఎర్రిస్వామి భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, టీడీపీ సీనియర్ నేత మల్లికార్జున, సీపీఐ నేత సంజీవప్ప, బీజేపీ కన్వీనర్ దేవరాజ్, పట్టణంలోని ప్రముఖులు, కాంగ్రెస్ అభిమానులు నివాళులర్పించారు
Merzaa Tv
కళ్యాణదుర్గంలో రాజకీయాలకు అతీతంగా ఎర్రిస్వామికి నివాళులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాల ఎర్రిస్వామి(92) మృతి చెందిన విషయం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా పలు పార్టీల నాయకులు ఎర్రిస్వామి భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, టీడీపీ సీనియర్ నేత మల్లికార్జున, సీపీఐ నేత సంజీవప్ప, బీజేపీ కన్వీనర్ దేవరాజ్, పట్టణంలోని ప్రముఖులు, కాంగ్రెస్ అభిమానులు నివాళులర్పించారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎమ్మిగనూరులో అంగరంగ వైభవంగా వినాయక చవితి.. మండపాల్లో ఎమ్మెల్యే బీవీ పూజలు భక్తి, ఐక్యతకు ప్రతీక వినాయక చవితి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే1
- లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు శ్రీ లక్ష్మి నరసింహ , ఈరన్న స్వామి వర్ల దేవస్థానం ఉరుకుంద హుండీ లెక్కింపు 14 రోజుల అమౌంట్ Rs.1,20,72,793/- అన్నదానం హుండీ Rs.10,76,772/- మొత్తం ,31,49,565/- సెంట్రల్ బ్యాంకు అఫ్ శ్రీలంక 50 రూపాయలు బంగారం : 31గ్రామ్స్ 770mg,వెండి : 14కేజీల 500గ్రామ్స్ * 2026 శ్రావణమాసం ఉత్సవాల సంబంధించి శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె.వాణి ఆధ్వర్యంలో మరియు పాలకమండలి సభ్యులు ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ బి.సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ కమీషనర్ కర్నూల్, దేవస్థాన పర్యవేక్షకులు మరియు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంభ సేవాసమితి ఆదోని వారు పాల్గొనియున్నారు.2
- మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు మైదుకూరు, సెప్టెంబర్ 16: మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- చర్మ డప్పు కళాకారుల పెన్షన్ గడువు పెంచాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగించాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ ఎమ్మిగనూరు: చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేయనున్న పెన్షన్ దరఖాస్తుల గడువును మరింత పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కళాకారుడికి పెన్షన్ అందేలా నిబంధనలను సరళీకరించి, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల, మూడు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, చర్మకారులు, డప్పు కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమని ఆంటోనీ పేర్కొన్నారు. పెన్షన్ కోసం చర్మకారులు, డప్పు కళాకారులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో పాటు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ ప్రక్రియను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఉన్న కొన్ని నిబంధనలు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేద చర్మకారులు, డప్పు కళాకారులకు ఇబ్బందికరంగా మారాయని ఆంటోనీ తెలిపారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ (Self Declaration) విధానం వల్ల అర్హులైన పలువురు కళాకారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే అద్దె ఇళ్లలో నివసిస్తున్న కళాకారుల వద్ద ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు తదితర పత్రాలు లేకపోవడం వల్ల వారు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరతరాలుగా సంప్రదాయ చర్మకార వృత్తిని, డప్పు కళను నమ్ముకుని జీవిస్తున్న పేద కళాకారులకు ఇటువంటి నిబంధనలు అడ్డంకిగా మారకూడదని ఆయన అన్నారు. ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు అవకాశం కల్పించాలి ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను నిర్ధారించే విధంగా ఆన్‌లైన్ ప్రక్రియను కొనసాగించాలని ఆంటోనీ కోరారు. కుటుంబ వివరాలు, చిరునామా, వృత్తి తదితర అంశాలను రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అద్దె ఇళ్లలో నివసించే కళాకారులకు కరెంట్ బిల్లు, హౌస్ ట్యాక్స్ వంటి పత్రాల నిబంధనలను సడలించాలని, వారి సంప్రదాయ వృత్తిని ప్రామాణికంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించాలని సూచించారు. గడువు పొడిగించి ప్రతి అర్హుడికి అవకాశం ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరింత పొడిగించాలని ఆంటోనీ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చర్మకారులు, డప్పు కళాకారులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో పాటు అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొంత సమయం కేటాయించి, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క కళాకారుడు కూడా కేవలం నిబంధనల కారణంగా పెన్షన్‌కు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్మకారులు, డప్పు కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకరించి, ఆధార్–రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం కల్పించడంతో పాటు పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంటోనీ ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.1
- వినాయక నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. డిజెలకు అనుమతి లేదు గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మహానంది ఎస్ఐఎన్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలంలోని మండపాల నిర్వాహకులతో పలు సూచనలు చేశారు. నిమజ్జనాల సమయంలో డీజే లకు అనుమతి లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తూ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.1
- బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.1
- జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు 9వ గేటు మరమ్మతు పనులు పూర్తి జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రూ.2.40 లక్షలతో మరమతు పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సమస్యకు ఉన్నతాధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం చూసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.1
- గణపతిని తెస్తుండగా జరిగిన దుర్ఘటన పటాస్ లకు దూరంగా ఉండండి డీజే మరియు త్రా గుడ కు ప్రమాదకర మైన వాటికి దూరంగా ఉండండి విషయం పటాస్ ల దాటికి సౌండ్ దాటికి లైటింగ్ దాటికి డ్రైవర్ కి కనబడక ఈ విషాదం జరిగింది అందరూ అన్నిటికీ దూరంగా ఉండి జాగ్రత్త వహించాలని కో రడ మై నది4
- నాగర్ కర్నూల్ టి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు ప్రియుడు తో కత్తితో పొడిచిన ప్రియుడు విషయం భార్యకు ప్రియుడు కు అడ్డుగా ఉన్నా డ ని చంపేశారు పోలీసులు ఈ కేసును చే దించారు వీడియో1