గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన..సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలో విద్యార్థుల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈకార్యక్రమల్లో భాగంగా విద్యార్థులకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్, పోక్సో చట్టం,సోషల్ మీడియా వినియోగం/మోసాలు,మహిళ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు ఈసందర్భంగా ఈరోజు ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవునూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి అవగాహన కల్పించి , వేధింపులకు గురైతే వెంటనే నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలని , నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని షీ టీమ్అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని , గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐలు ప్రమీల,రవి , సిబ్బంది శ్రీలత, ప్రియాంక,శ్రీనివాస్‌తో పాటు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన..సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలో విద్యార్థుల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈకార్యక్రమల్లో భాగంగా విద్యార్థులకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్, పోక్సో చట్టం,సోషల్ మీడియా వినియోగం/మోసాలు,మహిళ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు ఈసందర్భంగా ఈరోజు ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవునూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి అవగాహన కల్పించి , వేధింపులకు గురైతే వెంటనే నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126 56425 కు ఫిర్యాదు చేయాలని , నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని షీ టీమ్అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులకు స్పందించకూడదని , గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐలు ప్రమీల,రవి , సిబ్బంది శ్రీలత, ప్రియాంక,శ్రీనివాస్‌తో పాటు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- 22ఏ నిషేధిత భూముల నుంచి పట్టా భూములను తొలగించాలి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని 22ఏ సెక్షన్ ఉద్దేశించబడిందన్నారు. అయితే ఆ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 22ఏ(2) నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో భూములను చేర్చే ప్రక్రియను చట్టబద్ధంగా చేపట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం తహసీల్దార్, ఆర్డీవో లేదా జిల్లా కలెక్టర్ స్థాయిలోనే సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం సాధ్యం కాదని, ప్రభుత్వ స్థాయిలో నిర్దేశిత ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని అన్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో భూ యజమానులకు న్యాయం జరిగేలా సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చే విషయంలో చట్టపరమైన ప్రక్రియను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 22ఏ సెక్షన్‌ను రాజకీయ ప్రయోజనాలు, అవినీతికి వేదికగా మార్చిందని ఆయన ఆరోపించారు. పట్టాదారులకు సరైన నోటీసులు ఇవ్వకుండా, నిర్దేశిత ప్రక్రియను పాటించకుండా వేలాది ఎకరాల భూములు, వేలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. ఊర్లకు ఊర్లే నిషేధిత జాబితాలో... కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టా భూములు 22ఏ జాబితాలోకి వెళ్లాయని గంగుల కమలాకర్ తెలిపారు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లో 22ఏ కారణంగా వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వచ్చిన నివేదికలు కూడా పేర్కొంటున్నాయన్నారు గ్రామపంచాయతీ, మున్సిపల్ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారు, ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న పట్టాదారులు సైతం ఇప్పుడు వాటిని విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్య, వైద్యం, వివాహాలు, కుటుంబ అవసరాల కోసం భూములను విక్రయించుకోవాల్సిన సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భూముల రికార్డుల విషయంలో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు సమగ్రంగా పరిశీలించి స్పష్టత తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒకవైపు అర్హత కలిగిన పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ప్రభుత్వ ప్రయోజనాల కోసం సేకరించిన భూముల రికార్డులు సరిచేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సెక్షన్ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గంగుల కమలాకర్ హెచ్చరించారు. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గంగులతో పాటు.. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టిఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. ప్రజా ప్రతినిధులు.. భూ బాధితులు.. బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. సీపీ గౌష్ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.1
- గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.1
- జగిత్యాల జిల్లా గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమ మద్యం పట్టివేత...ముగ్గురు అరెస్ట్, 6 లక్షల 98 వేల రూ.ల మద్యం సీజ్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో ఎక్సైజ్ అధికారులు మద్యం పట్టుకున్నారు. మహారాష్ట్రలోని దాద్రా, హవేలి, దయ్యూధామన్ నుంచి అక్రమంగా కథలాపూర్ మండలం గంభీర్పూర్ కు రవాణా చేస్తున్న మద్యంపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యం ను పట్టుకున్నారు. వాటి విలువ మహారాష్ట్రలో 2లక్షల 80వేలు ఉంటే, తెలంగాణలో 6 లక్షల 98 వేల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సెల్ఫోన్ ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సుంకం ఎగ్గొట్టి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని ఎక్సైజ్ జిల్లా అధికారి తిరుపతి తెలిపారు.2
- ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.2
- శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.1
- మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్ వర్మ నాయకత్వంలో ముందడుగు మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.1
- *శిశు మందిర్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి హోమం మరియు రాఖీ ఉత్సవం* శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని పౌర్ణమి యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యజ్ఞంలో పాల్గొని వేద మంత్రోచ్ఛారణల మధ్య హవన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, పరస్పర ప్రేమకు, రక్షణ భావానికి ప్రతీక అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, దేశభక్తి వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు. యజ్ఞం అనంతరం విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాఠశాల ఆవరణం భక్తి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. కార్యక్రమంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, డా. ఎలగందుల శ్రీనివాస్, కొణిజర్ల మహేష్, శిరీష, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్, ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, టి రాజేశ్వర్ రావు, అప్పిడి వకుళా దేవి తదితరులు పాల్గొన్నారు.2