తన జన్మభూమి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తనకు జన్మనిచ్చిన నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం వేల్పూరు గ్రామ అభివృద్ధికి శ్వాస ఉన్నంత వరకు కృషి చేస్తానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్లు, మినీ వాటర్ ట్యాంక్, ముస్లిం స్మశాన వాటిక ప్రహరీ గోడను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ... అధికారంలో ఉన్న సమయంలో గ్రామంలో కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులను పూర్తి చేశామని గుర్తు చేశారు. పదవిలో ఉన్నా లేకున్నా, వేల్పూర్ ప్రగతికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు చొరవ చూపుతానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొండి అశోక్, ఉప సర్పంచ్ సాకలి బాలయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్, మండల కన్వీనర్ నాగధర్, నాయకులు రేగుల రాములు, బొబ్బురు ప్రతాప్, సుంకరి రాము, దుల్ల రాజేశ్వర్, గంగారెడ్డి, గ్రామ కార్యదర్శి వినోద్ మరియు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- దిలార్పూర్ మండల కేంద్రంలో వాతావరణ మార్పులు ఒక్కసారిగా తీవ్రమవుతున్నాయి. ఎండ తీవ్రత మధ్యలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని వర్షం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అనూహ్య మార్పులతో మొక్కజొన్న రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పండించిన పంటను కాపాడుకోవడానికి రైతులు పారీలతో కప్పుతూ అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నారు.1
- నెరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో నూతనంగా గొల్ల నారాయణ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృప్రవేశానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అర్హులందరికీ రెండవ విడతలో ఇల్లు అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరతరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- బాబుకు ఆపరేషన్ గురించి1
- జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో, దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది1
- ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ. స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- Post by Vishwamber Rao1
- బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో పీఏసీఎస్ బోథ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... రైతులకు న్యాయం జరిగేలా అధికారులు సహకరించాలని, ఎండలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వీలైనంత త్వరగా పంటలను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1