*ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్.* *-బకాయిలు చెల్లించని మిల్లర్లపై ఉక్కుపాదం.. *-మహబూబాబాద్ జిల్లాలో రూ.98 కోట్ల మేర బకాయిలు. సూర్యాపేట సిటీ::: ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. ఇప్పటికే బకాయిలు చెల్లించని మిల్లర్లపై ఉక్కుపాదం మోపనుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో రూ.98 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గడువు లోగా చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కేస సముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్ పర్సన్ ను అరెస్టు చేసి మహాదేవ రైస్ ఇండస్ట్రీలో విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన చేపట్టారు. ఈ మిల్లు 2022-23 రబీ, యాసంగిలో ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వని మిల్లల జాబితాలోకి అధికారులు చేర్చారు. 2024లో కూడా ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడంతో తనిఖీలను చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. తనిఖీల లో ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
*ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్.* *-బకాయిలు చెల్లించని మిల్లర్లపై ఉక్కుపాదం.. *-మహబూబాబాద్ జిల్లాలో రూ.98 కోట్ల మేర బకాయిలు. సూర్యాపేట సిటీ::: ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. ఇప్పటికే బకాయిలు చెల్లించని మిల్లర్లపై ఉక్కుపాదం మోపనుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో రూ.98 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. గడువు లోగా చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కేస సముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్ పర్సన్ ను అరెస్టు చేసి మహాదేవ రైస్ ఇండస్ట్రీలో విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు చేపట్టిన చేపట్టారు. ఈ మిల్లు 2022-23 రబీ, యాసంగిలో ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వని మిల్లల జాబితాలోకి అధికారులు చేర్చారు. 2024లో కూడా ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడంతో తనిఖీలను చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. తనిఖీల లో ధాన్యం లేకపోవడంతో కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
- **విద్యార్థులలో విద్య సామర్థ్యాలను పెంపొందించాలి*** *- ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలి.. *- నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. *- నల్గొండ జిల్లా కేంద్రంలోని కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. *- విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన కలెక్టర్. విద్యార్థులలో కనీస విద్య సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, కంచనపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ వేశారు. అనంతరం విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం ,రాయడంతో పాటు, తెలుగు ,ఇంగ్లీష్ లలో పదాలకు అర్థాలు తెలిసే విధంగా నేర్పించాలని, ప్రాథమిక స్థాయిలో కనీస విద్యా సామర్ధ్యాలు పెంపొందినప్పుడే పై తరగతులకు వెళ్లిన సందర్భంలో విషయం సులభంగా అర్థమవుతుందని, ఈ విషయంపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. అలాగే కొత్త పదాలకు అర్థాలతో పాటు, చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ యూనిఫామ్స్ గురించి అడిగారు. అందరికీ యూనిఫామ్ అందించడం జరుగుతుందని, యూనిఫాం వచ్చినవారు సరైన విధంగా ఉన్నది సరిచూసుకోవాలని, అవసరమైతే పాఠశాలలోనే ఆల్టరేషన్ చేయించేందుకు టైలర్లను పాఠశాలకు పిలిపించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మహేశ్వరి తో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాల పెంపుదలకు స తరచు పాఠశాలను సందర్శించి వారి విద్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.2
- పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి: మాజీ ఎమ్మెల్యే పాలేరు చెరువు నీటిపై మొదటి హక్కు పాలేరు నియోజకవర్గ రైతులదేనని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వకపోయినా నిలబడి పోరాడామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.1
- నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.1
- పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.1
- నేలకొండపల్లి BRS పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు,BLA లతో సమావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి BRS పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు,BLA లతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.తాను ఎమ్మెల్యే గా ఉన్న ఐదేళ్ల కాలంలో పాలేరు నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని ఆయన చెప్పారు. రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించేది లేదు. పాలేరు రిజర్వాయర్ నీళ్లు పాలేరు ప్రాంత రైతులకి విడుదల చేయాలని కోరారు వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని అన్నారు.తాను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ప్రజల వెంటే ఉంటున్నా అని ఆయన తెలిపారు.ఓటరు జాబితాలోని సవరణలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా BRS నాయకులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు.ప్రతి గ్రామంలో గత BRS ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి, ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న తేడాపై ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు.నాయకులు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం శ్రమిస్తూ, పార్టీ విజయానికి మరింత కష్టపడాలని ఆయన దిశానిర్దేశం చేశారు.1
- కురవి మండలం నేరెడ శివారులో అనుమానాస్పదంగా ఉరివేసుకొని రైతు మృతి.. అనుమానాస్పదంగా రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారులో చోటు చేసుకుంది.. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నేరెడ గ్రామానికి చెందిన మొగిలి రామ చంద్రయ్య (65) కి తన పొలం పక్కన మరో రైతు తో పొలం బాట విషయం లో పంచాయితీ జరుగుతుంది.. ఈ నేపథ్యంలో లో ఈ తెల్లవారు జామున రామ చంద్రయ్య తన పొలం వద్ద చెట్టుకు ఊరువేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యానా.. ఆత్మహత్య నా అనే కోణం లో దర్యాప్తు ప్రారంభించారు3