logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

11వ డివిజన్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎస్‌ఐఆర్‌లో భాగంగా వార్డు సభ.. కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న కరీంనగర్: కరీంనగర్ నగరంలోని 11వ డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా గురువారం వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కట్ట రాంపూర్ న్యూ శ్రీనగర్ కాలనీ పార్కులో జరిగిన ఈ సభలో ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రజలకు చదివి వినిపించారు. జాబితాలో తొలగించిన ఓటర్లు, ఆచూకీ లేని వారు, వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. పేరు లేదా ఇతర వివరాల్లో అభ్యంతరాలు, సవరణలు ఉంటే సంబంధిత నోటీసులతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను నిర్ణీత గడువులోగా కళాభారతి వద్ద సమర్పించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనంతరం డివిజన్‌లోని లబ్ధిదారులకు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించాలనే ఉద్దేశంతో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరూ తమకు అందిన స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కార్పొరేటర్ కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ BLA లు pacs సింగిల్ విండో చైర్మన్ k.శ్రీకాంత్ రెడ్డి మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

57 min ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
57 min ago
f223dc46-6479-4f4e-81ff-d176070a54b8

11వ డివిజన్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎస్‌ఐఆర్‌లో భాగంగా వార్డు సభ.. కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న కరీంనగర్: కరీంనగర్ నగరంలోని 11వ డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా గురువారం వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కట్ట రాంపూర్ న్యూ శ్రీనగర్ కాలనీ పార్కులో జరిగిన

33ce0108-6ddf-444a-b830-2e8ec9dbe00a

ఈ సభలో ఓటర్ల ముసాయిదా జాబితాలను ప్రజలకు చదివి వినిపించారు. జాబితాలో తొలగించిన ఓటర్లు, ఆచూకీ లేని వారు, వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. పేరు లేదా ఇతర వివరాల్లో అభ్యంతరాలు, సవరణలు ఉంటే సంబంధిత నోటీసులతో

18143aaa-8557-4f32-972c-0c27b82db861

పాటు అవసరమైన ధ్రువపత్రాలను నిర్ణీత గడువులోగా కళాభారతి వద్ద సమర్పించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనంతరం డివిజన్‌లోని లబ్ధిదారులకు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించాలనే ఉద్దేశంతో

018daebc-703d-48e7-97b5-51594b596548

స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరూ తమకు అందిన స్మార్ట్ రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, తప్పుల్లేకుండా రూపొందించేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కార్పొరేటర్ కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ BLA లు pacs సింగిల్ విండో చైర్మన్ k.శ్రీకాంత్ రెడ్డి మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

More news from Telangana and nearby areas
  • హలో విద్యార్థి చలో హైదరాబాద్ అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది.. సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది.. అధ్యక్షులుగా గుడిసె సందీప్ అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..
    1
    హలో విద్యార్థి చలో హైదరాబాద్ 
అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ 
MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది..
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది..
సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది..
అధ్యక్షులుగా గుడిసె సందీప్ 
అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా 
కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు. సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    1
    మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం
కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు.
సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    20 hrs ago
  • గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.
    1
    గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష..
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    Tour operator గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రసాభస...కాంగ్రెస్ బిజేపి కార్యకర్తలు మద్య తోపులాట ఉద్రిక్తత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ బిజెపి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి రసాభాసగా మారింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేదని బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నిలదీశారు. దీంతో బిజెపి పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బిజేపి నాయకుల్ని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల నాయకుల తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
    4
    రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రసాభస...కాంగ్రెస్ బిజేపి కార్యకర్తలు మద్య తోపులాట ఉద్రిక్తత
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ బిజెపి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి రసాభాసగా మారింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేదని బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నిలదీశారు.  దీంతో బిజెపి పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బిజేపి నాయకుల్ని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల నాయకుల తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
    2
    ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన
రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    1 day ago
  • గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు 26 వేల రూపాయలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , హెల్త్ కార్డులు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ చేయాలని , 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు CITU - తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ లు మాట్లాడుతూ గ్రామాలను పచ్చదనం , పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఎండనక , వాననక , చలనక అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో కూడా స్థానిక అధికారులు , పాలకవర్గాలు కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని బడ్జెట్ లేదని సాకుతో కొన్ని గ్రామాలలో నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని స్థానిక సమస్యలపై జిల్లా అధికారులను కలిసిన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు , జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరూ నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్ , యూనియన్ జిల్లా కార్యదర్శి మల్యాల నర్సయ్య యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్ , కంసాని రవీందర్ , నారపురం నర్సయ్య , మహేష్ , శేఖర్ , అనిల్ , కాంతయ్య , లక్ష్మి , పద్మ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు
    3
    గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్
గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు 26 వేల రూపాయలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , హెల్త్ కార్డులు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , ముఖ్యమంత్రి  ప్రకటించిన విధంగా ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ చేయాలని , 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు CITU - తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ లు మాట్లాడుతూ గ్రామాలను పచ్చదనం , పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఎండనక , వాననక , చలనక అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
జిల్లాలో కూడా స్థానిక అధికారులు , పాలకవర్గాలు కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని బడ్జెట్ లేదని సాకుతో కొన్ని గ్రామాలలో నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని స్థానిక సమస్యలపై జిల్లా అధికారులను కలిసిన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు , జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని  లేకుంటే కార్మికులందరూ నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్ , యూనియన్ జిల్లా కార్యదర్శి మల్యాల నర్సయ్య యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్ , కంసాని రవీందర్ , నారపురం నర్సయ్య , మహేష్ , శేఖర్ , అనిల్ , కాంతయ్య , లక్ష్మి , పద్మ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    19 hrs ago
  • మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్‌ వర్మ నాయకత్వంలో ముందడుగు మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్‌ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్‌ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్‌ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
    1
    మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్‌ వర్మ నాయకత్వంలో ముందడుగు
మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్‌ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్‌ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్‌ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Mancherial, Telangana•
    6 hrs ago
  • 22ఏ నిషేధిత భూముల నుంచి పట్టా భూములను తొలగించాలి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని 22ఏ సెక్షన్‌ ఉద్దేశించబడిందన్నారు. అయితే ఆ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 22ఏ(2) నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో భూములను చేర్చే ప్రక్రియను చట్టబద్ధంగా చేపట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం తహసీల్దార్‌, ఆర్డీవో లేదా జిల్లా కలెక్టర్‌ స్థాయిలోనే సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం సాధ్యం కాదని, ప్రభుత్వ స్థాయిలో నిర్దేశిత ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని అన్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో భూ యజమానులకు న్యాయం జరిగేలా సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చే విషయంలో చట్టపరమైన ప్రక్రియను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 22ఏ సెక్షన్‌ను రాజకీయ ప్రయోజనాలు, అవినీతికి వేదికగా మార్చిందని ఆయన ఆరోపించారు. పట్టాదారులకు సరైన నోటీసులు ఇవ్వకుండా, నిర్దేశిత ప్రక్రియను పాటించకుండా వేలాది ఎకరాల భూములు, వేలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. ఊర్లకు ఊర్లే నిషేధిత జాబితాలో... కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్‌, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టా భూములు 22ఏ జాబితాలోకి వెళ్లాయని గంగుల కమలాకర్‌ తెలిపారు. రేకుర్తి, విద్యానగర్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో 22ఏ కారణంగా వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వచ్చిన నివేదికలు కూడా పేర్కొంటున్నాయన్నారు గ్రామపంచాయతీ, మున్సిపల్‌ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారు, ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న పట్టాదారులు సైతం ఇప్పుడు వాటిని విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్య, వైద్యం, వివాహాలు, కుటుంబ అవసరాల కోసం భూములను విక్రయించుకోవాల్సిన సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భూముల రికార్డుల విషయంలో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు సమగ్రంగా పరిశీలించి స్పష్టత తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఒకవైపు అర్హత కలిగిన పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ప్రభుత్వ ప్రయోజనాల కోసం సేకరించిన భూముల రికార్డులు సరిచేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సెక్షన్‌ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్‌, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గంగులతో పాటు.. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టిఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. ప్రజా ప్రతినిధులు.. భూ బాధితులు.. బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    22ఏ నిషేధిత భూముల నుంచి పట్టా భూములను తొలగించాలి  మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల 
రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని 22ఏ సెక్షన్‌ ఉద్దేశించబడిందన్నారు. అయితే ఆ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
22ఏ(2) నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో భూములను చేర్చే ప్రక్రియను చట్టబద్ధంగా చేపట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం తహసీల్దార్‌, ఆర్డీవో లేదా జిల్లా కలెక్టర్‌ స్థాయిలోనే సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం సాధ్యం కాదని, ప్రభుత్వ స్థాయిలో నిర్దేశిత ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని అన్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో భూ యజమానులకు న్యాయం జరిగేలా సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చే విషయంలో చట్టపరమైన ప్రక్రియను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. 
అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 22ఏ సెక్షన్‌ను రాజకీయ ప్రయోజనాలు, అవినీతికి వేదికగా మార్చిందని ఆయన ఆరోపించారు. పట్టాదారులకు సరైన నోటీసులు ఇవ్వకుండా, నిర్దేశిత ప్రక్రియను పాటించకుండా వేలాది ఎకరాల భూములు, వేలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు.
ఊర్లకు ఊర్లే నిషేధిత జాబితాలో...
కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్‌, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టా భూములు 22ఏ జాబితాలోకి వెళ్లాయని గంగుల కమలాకర్‌ తెలిపారు. రేకుర్తి, విద్యానగర్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో 22ఏ కారణంగా వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వచ్చిన నివేదికలు కూడా పేర్కొంటున్నాయన్నారు 
గ్రామపంచాయతీ, మున్సిపల్‌ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారు, ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న పట్టాదారులు సైతం ఇప్పుడు వాటిని విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్య, వైద్యం, వివాహాలు, కుటుంబ అవసరాల కోసం భూములను విక్రయించుకోవాల్సిన సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
భూముల రికార్డుల విషయంలో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు సమగ్రంగా పరిశీలించి స్పష్టత తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఒకవైపు అర్హత కలిగిన పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ప్రభుత్వ ప్రయోజనాల కోసం సేకరించిన భూముల రికార్డులు సరిచేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.
రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సెక్షన్‌ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. 
కరీంనగర్‌ నియోజకవర్గంలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్‌, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గంగులతో పాటు.. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టిఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. ప్రజా ప్రతినిధులు.. భూ బాధితులు.. బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.