వెల్‌జర్లలో అంగడి బజార్ ప్రారంభించిన సర్పంచ్ ఆరు బాబు నాయక్...రైతులకు, గ్రామీణ ప్రజలకు మరింత ప్రయోజనం.! చిన్నకారు రైతులకు అండగా అంగడి బజార్. 20–30 గ్రామాల ప్రజలకు మేలు గ్రామ సర్పంచ్ రాత్లావత్ బాబు నాయక్ వెల్లడి గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, స్థానిక వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు చిన్నకారు రైతులకు అండగా నిలిచే లక్ష్యంతో ఫరూక్ నగర్ మండలం వెల్‌జర్ల గ్రామంలో అంగడి బజార్‌ను ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ ఆర్. బాబు నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కొబ్బరికాయ కొట్టి, పూజా ప్రారంభించి అంగడి బజార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్. బాబు నాయక్ మాట్లాడుతూ...చిన్నకారు రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులు పండించిన కూరగాయలు, ఇతర పంటలకు స్థానికంగానే మార్కెట్ లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతులకు మెరుగైన ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో అంగడి బజార్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతు అభివృద్ధే గ్రామ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. అంగడి బజార్ అందుబాటులోకి రావడంతో వెల్‌జర్ల గ్రామ రైతులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఒక వేదిక లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా రైతులు తాము పండించిన కూరగాయలను స్థానికంగానే విక్రయించుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. దీంతో రైతులకు రవాణా ఖర్చులు, మధ్యవర్తులపై ఆధారపడే పరిస్థితి కొంతవరకు తగ్గుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా వెల్‌జర్ల మీదుగా రాకపోకలు సాగించే దాదాపు 20 నుంచి 30 గ్రామాల ప్రజలకు కూడా ఈ అంగడి బజార్ ఎంతో మేలు చేస్తుందని సర్పంచ్ తెలిపారు. ఆయా గ్రామాల ప్రజలకు నాణ్యమైన, తాజా కూరగాయలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక మార్కెట్లను బలోపేతం చేయడం ద్వారా రైతులకు, వినియోగదారులకు పరస్పర ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో అంగడి బజార్‌ను మరింత అభివృద్ధి చేసి, ప్రతి రైతుకు, ప్రతి గ్రామస్తుడికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ ఆర్. బాబు నాయక్ తెలిపారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహిస్తూ వెల్‌జర్ల గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు.రైతు సంక్షేమమే లక్ష్యమని,గ్రామ అభివృద్ధే ధ్యేయంగా అంగడి బజార్‌ను మరింత అభివృద్ధి చేస్తామని సర్పంచ్ బాబు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ దొడోల వెంకటేష్ యాదవ్, వార్డు సభ్యులు అనితా ఆచారి, రవి నాయక్, ప్రవళిక మహేష్, దొడ్డి రవీందర్ లక్ష్మీ, తుప్పరి రమేష్, వెంకటయ్య నాయక్, కావాలి లక్ష్మయ్య, లావణ్య దేవేందర్, తుప్పరి వనజాకుమార్, చందు నాయక్‌తో పాటు గ్రామ సీనియర్ నాయకులు అనిమి బాలరాజు గౌడ్, శివరాజ్ గౌడ్, కటికెల తిరుపతి యాదవ్, కేవీఎం, కావాలి జగన్, జయరామ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, తుప్పరి శివకుమార్, తుప్పరి రమేష్, యాదయ్య, కావాలి యాదయ్య, జంగారి రవి, రాఘవేందర్, గోపాల్ గౌడ్, ప్రభాకర్, కావాలి నర్సింలు, వొట్టేల అంజయ్య, అనజనేయులు గౌడ్, లింగా చారి, కావాలి జంగయ్య, రాఘవేందర్ గౌడ్, హరీష్, తుప్పరి శంకర్, తుప్పరి అశోక్, తుప్పరి పవన్, వరప్రసాద్, నాను, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి1
- తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.1
- ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers1
- కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం. కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం.1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1
- *సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం* హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు సమాచారం.1