: శ్రీ సత్య సాయి బాబా జన్మదినోత్సవం సేవ దృక్పదమే శ్రీ సత్యసాయి ఆకాంక్ష వికారాబాద్ ): శ్రీ సత్యసాయి జ్ఞానకేంద్రం వికారాబాద్ లో అత్యంత వైభవంగా శ్రీ సత్యసాయి బాబా వారి 99వ జయంతి వేడుకలు జయంతి వేడుకలు జరిగాయి.ఉదయం నగర సంకీర్తన,స్వామివారికి పూజాభిషేకం అనంతరం కార్యక్రమంలో వికారాబాద్ గీతావాహిని బృందం భగవద్గీత పారాయణం చేశారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా శారద హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజశేఖర్ గారు మరియు హెడ్మాస్టర్ రాజశేఖర్ రిటైర్డ్ హెడ్మాస్టర్ సతీష్ చంద్ర అలాగే గీతా వాహిని బృంద సభ్యులు శ్రీదేవి,జయశ్రీ ,లావణ్య పాల్గొని ప్రసంగించారు,డాక్టర్ రాజశేఖర్ ప్రసంగిస్తూ వేదాలు,ఉపనిషత్తులు,భగవద్గీత మానవ సమాజానికి కేవలం సత్యాన్ని మాత్రమే బోధిస్తాయి,మానవజన్మ లభించడం ఎన్నో జన్మల పూర్వ కర్మల ఫలితం అని అన్నారు ఈ సృష్టిలో శాశ్వతమైంది కేవలం సత్యమేనని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు లోక కళ్యాణం కోసం అవతరించారని సనాతన హైందవ ధర్మాన్ని రక్షించడానికి అవతార పురుషులు భూమిపై అవతరిస్తారని అన్నారు. మరియు సతీష్ చంద్ర మాట్లాడుతూ సత్యసాయి బాబావారి జన్మ అవతరణ వైభవాన్ని వివరించారు,అలాగే హెడ్ మాస్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ భగవాన్ సత్యసాయిబాబా వారు మాతృమూర్తి ఈశ్వరమ్మ కోరిక మేరకు కుగ్రామమైన పుట్టపర్తిలో ప్రపంచ స్థాయి విలువలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్యం,ఉచితవిద్యకై విద్యాలయాలు,ప్రజలదాహార్తి తీర్చుటకై సత్యసాయి వాటర్ ప్రాజెక్టులు ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్,డివైసీ బసవేశ్వర్, కేరెల్లి కన్వీనర్ రామకృష్ణారెడ్డి,ప్రేమ్ కుమార్,సేవాదళ్ సభ్యులు వేణుగోపాల్,సుధీర్,శ్రీనాథ్,రవిచారి,శ్రావణ్ ,జైపాల్ తదితరులు పాల్గొన్నారు