logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిర్మాణ కార్మికుల భద్రతే లక్ష్యం: సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, భద్రత మరియు భీమాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సీపీ డాక్టర్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో కొల్లూరు, నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాలకు చెందిన నిర్మాణ కార్మికుల ప్రతినిధి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేబర్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రావిడెంట్ ఫండ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, కార్మికుల చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాలు మరియు ఇన్సూరెన్స్ ప్రయోజనాలపై సమగ్రంగా వివరించారు. పని ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా ప్రాణహానిని అరికట్టవచ్చని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ... మహిళలు, చిన్నారుల విషయంలో లేదా ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తింపులో ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. లేబర్ క్యాంపుల్లో స్పష్టమైన నిబంధనలు, భద్రత చర్యలు కచ్చితంగా అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాలు కార్మికులకు అందేలా సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై లేబర్ క్యాంపుల్లో తరచూ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు లేదా కేసులు జరిగినప్పుడు బాధితులతో సానుభూతితో వ్యవహరించాలని, దూర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులకు కనీస వసతి సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, ప్రమాద బీమా, ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహించి వారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. శేరిలింగంపల్లి డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... కార్మికుల సంక్షేమం, భద్రత మరియు చట్టపరమైన నిబంధనల అమలుపై పలు కీలక సూచనలు చేశారు. కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించడం, ఆరోగ్య మరియు భద్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించడం అత్యవసరమని పేర్కొన్నారు. కార్మికుల జీతాలు సమయానికి చెల్లించడం, కనీస వేతనాలు అమలు చేయడం, ఇన్సూరెన్స్ సదుపాయాలు అందుబాటులో ఉంచడం ద్వారా ప్రమాదాల సమయంలో వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్మిక చట్టాలను పూర్తిగా అమలు చేసి, ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలాగే పరిశ్రమలు, లేబర్ క్యాంపుల్లో సీసీ కెమెరాలు, యాక్సెస్ కంట్రోల్ వంటి భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, కార్మికులకు సేఫ్టీ ట్రైనింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. అదనంగా, లేబర్ క్యాంపుల్లో తగిన లైటింగ్ ఏర్పాటు చేయడం, ప్రతి కార్మికుడి పూర్తి వివరాలను నమోదు చేసి భద్రపరచడం అవసరమని పేర్కొన్నారు. కార్మికులు పనికి వెళ్లే సమయంలో వారి పిల్లల కోసం స్టడీ సౌకర్యాలు కల్పించి, అవసరమైన మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. లేబర్ క్యాంపుల్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు బాధ్యతాయుతంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పిఎఫ్ ప్రాంతీయ కమిషనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ... ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం EPF & MP చట్టం అమలు ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ చట్టం నిర్దిష్ట సంఖ్యకు పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు వర్తిస్తుందని, ఒకసారి అమల్లోకి వచ్చిన తరువాత ఉద్యోగుల సంఖ్య తగ్గినా కూడా కొనసాగుతుందని వివరించారు. నిర్దిష్ట వేతన పరిమితి వరకు ఉన్న ఉద్యోగులకు పీఎఫ్ సభ్యత్వం తప్పనిసరి అని, ఉద్యోగి అంటే సంస్థలో వేతనం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ చట్టం కింద ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ పథకాల ద్వారా ఉద్యోగులకు భవిష్యత్‌లో ఆర్థిక భద్రత కల్పించబడుతుందని చెప్పారు. అలాగే ప్రత్యేక పథకాల ద్వారా గతంలో నమోదు కాని ఉద్యోగులను స్వచ్ఛందంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రోత్సాహకాలు అందించే పథకాలు కూడా అమల్లో ఉన్నాయని, వాటి ద్వారా ఉద్యోగులకు ఆర్థిక సహాయం లభిస్తుందని పేర్కొన్నారు. సంస్థలు ఉద్యోగుల వివరాలను సక్రమంగా నమోదు చేసి, సమయానికి చెల్లింపులు చేయడంతో పాటు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ పనిచేసే ప్రదేశాల్లో కార్మికుల హక్కులు, వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పూర్తి వివరాలు సేకరించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్మికులకు కనీస వేతనాలు తప్పనిసరిగా చెల్లించడంతో పాటు, అదనపు పని చేస్తే ఓవర్‌టైం వేతనం ఇవ్వాలని చెప్పారు. ప్రతి కార్మికుడి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేసి, ప్రమాదాలు జరిగినప్పుడు వారికి సహాయం అందేలా చూడాలని తెలిపారు. అలాగే అన్ని కార్మికుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, రెగ్యులర్ మరియు తాత్కాలిక కార్మికుల వివరాలు కూడా తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. ఈ నియమాలు పాటించని యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు వెంటనే సహాయం అందేలా బాధ్యతగా వ్యవహరించాలని ఆయన తెలిపారు. సిఎంసి డిప్యూటీ కమిషనర్ జ్యోతి మాట్లాడుతూ... నిబంధనలు పాటించని నిర్మాణ సైట్లపై జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని సూచించారు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడాలని, లేకపోతే కార్మికులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్, శేర్లింగంపల్లి డీసీపీ సిహెచ్ శ్రీనివాస్, శేర్లింగంపల్లి అడిషనల్ డీసీపీ ఎం. ఉదయ్ రెడ్డి, ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ దుర్గాప్రసాద్, పీఎఫ్ కమిషనర్ మనోజ్ కుమార్, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిఎంసి డిప్యూటీ కమిషనర్లు కృష్ణమోహన్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

6 hrs ago
user_దినేష్ కుమార్
దినేష్ కుమార్
సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
6 hrs ago
3956fdc2-c517-480e-9e58-3a4e7d556c50

నిర్మాణ కార్మికుల భద్రతే లక్ష్యం: సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, భద్రత మరియు భీమాపై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సీపీ డాక్టర్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో కొల్లూరు, నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాలకు చెందిన నిర్మాణ కార్మికుల ప్రతినిధి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేబర్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, ప్రావిడెంట్ ఫండ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, కార్మికుల చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాలు మరియు ఇన్సూరెన్స్ ప్రయోజనాలపై సమగ్రంగా వివరించారు. పని ప్రదేశాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా ప్రాణహానిని అరికట్టవచ్చని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ... మహిళలు, చిన్నారుల విషయంలో లేదా ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తింపులో ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. లేబర్ క్యాంపుల్లో స్పష్టమైన నిబంధనలు, భద్రత చర్యలు కచ్చితంగా అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాలు కార్మికులకు అందేలా సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై లేబర్ క్యాంపుల్లో తరచూ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాలు లేదా కేసులు జరిగినప్పుడు బాధితులతో సానుభూతితో వ్యవహరించాలని, దూర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులకు కనీస

3453ca44-d335-45c1-822e-77431fd24882

వసతి సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, ప్రమాద బీమా, ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహించి వారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. శేరిలింగంపల్లి డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... కార్మికుల సంక్షేమం, భద్రత మరియు చట్టపరమైన నిబంధనల అమలుపై పలు కీలక సూచనలు చేశారు. కార్మికులకు తగిన సౌకర్యాలు కల్పించడం, ఆరోగ్య మరియు భద్రత ప్రమాణాలు కచ్చితంగా పాటించడం అత్యవసరమని పేర్కొన్నారు. కార్మికుల జీతాలు సమయానికి చెల్లించడం, కనీస వేతనాలు అమలు చేయడం, ఇన్సూరెన్స్ సదుపాయాలు అందుబాటులో ఉంచడం ద్వారా ప్రమాదాల సమయంలో వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్మిక చట్టాలను పూర్తిగా అమలు చేసి, ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలాగే పరిశ్రమలు, లేబర్ క్యాంపుల్లో సీసీ కెమెరాలు, యాక్సెస్ కంట్రోల్ వంటి భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, కార్మికులకు సేఫ్టీ ట్రైనింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. అదనంగా, లేబర్ క్యాంపుల్లో తగిన లైటింగ్ ఏర్పాటు చేయడం, ప్రతి కార్మికుడి పూర్తి వివరాలను నమోదు చేసి భద్రపరచడం అవసరమని పేర్కొన్నారు. కార్మికులు పనికి వెళ్లే సమయంలో వారి పిల్లల కోసం స్టడీ సౌకర్యాలు కల్పించి, అవసరమైన మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. లేబర్ క్యాంపుల్లో ఏవైనా అనుకోని

1495c2c1-d97c-444d-bed0-0c331e73b87f

సంఘటనలు జరిగినప్పుడు బాధ్యతాయుతంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పిఎఫ్ ప్రాంతీయ కమిషనర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ... ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం EPF & MP చట్టం అమలు ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ చట్టం నిర్దిష్ట సంఖ్యకు పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు వర్తిస్తుందని, ఒకసారి అమల్లోకి వచ్చిన తరువాత ఉద్యోగుల సంఖ్య తగ్గినా కూడా కొనసాగుతుందని వివరించారు. నిర్దిష్ట వేతన పరిమితి వరకు ఉన్న ఉద్యోగులకు పీఎఫ్ సభ్యత్వం తప్పనిసరి అని, ఉద్యోగి అంటే సంస్థలో వేతనం కోసం పనిచేసే ప్రతి వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ చట్టం కింద ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ పథకాల ద్వారా ఉద్యోగులకు భవిష్యత్‌లో ఆర్థిక భద్రత కల్పించబడుతుందని చెప్పారు. అలాగే ప్రత్యేక పథకాల ద్వారా గతంలో నమోదు కాని ఉద్యోగులను స్వచ్ఛందంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రోత్సాహకాలు అందించే పథకాలు కూడా అమల్లో ఉన్నాయని, వాటి ద్వారా ఉద్యోగులకు ఆర్థిక సహాయం లభిస్తుందని పేర్కొన్నారు. సంస్థలు ఉద్యోగుల వివరాలను సక్రమంగా నమోదు చేసి, సమయానికి చెల్లింపులు చేయడంతో పాటు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ పనిచేసే ప్రదేశాల్లో కార్మికుల హక్కులు, వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పూర్తి వివరాలు సేకరించి వారికి అవసరమైన

406c90cd-4aaf-4f16-b066-abced5e99eac

సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్మికులకు కనీస వేతనాలు తప్పనిసరిగా చెల్లించడంతో పాటు, అదనపు పని చేస్తే ఓవర్‌టైం వేతనం ఇవ్వాలని చెప్పారు. ప్రతి కార్మికుడి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేసి, ప్రమాదాలు జరిగినప్పుడు వారికి సహాయం అందేలా చూడాలని తెలిపారు. అలాగే అన్ని కార్మికుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, రెగ్యులర్ మరియు తాత్కాలిక కార్మికుల వివరాలు కూడా తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. ఈ నియమాలు పాటించని యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులకు వెంటనే సహాయం అందేలా బాధ్యతగా వ్యవహరించాలని ఆయన తెలిపారు. సిఎంసి డిప్యూటీ కమిషనర్ జ్యోతి మాట్లాడుతూ... నిబంధనలు పాటించని నిర్మాణ సైట్లపై జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. కార్మికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని సూచించారు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడాలని, లేకపోతే కార్మికులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్, శేర్లింగంపల్లి డీసీపీ సిహెచ్ శ్రీనివాస్, శేర్లింగంపల్లి అడిషనల్ డీసీపీ ఎం. ఉదయ్ రెడ్డి, ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ దుర్గాప్రసాద్, పీఎఫ్ కమిషనర్ మనోజ్ కుమార్, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శ్యామ్ సుందర్ రెడ్డి, సిఎంసి డిప్యూటీ కమిషనర్లు కృష్ణమోహన్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలో రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లుగా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మార్జిన్ రూ.16 కు తగ్గించారని దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తంచేశారు.కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు రేపటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.
    2
    తెలంగాణలో రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లుగా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మార్జిన్ రూ.16 కు తగ్గించారని దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తంచేశారు.కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు రేపటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • full night open this hotel purani Haveli request to Hyderabad City Police take action
    1
    full night open this hotel purani Haveli 
request to Hyderabad City Police take action
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 31 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతులు వారి కుమారుడు సిద్ది నవీన్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు పెద్దలు సిద్ధి బిక్షపతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, సిద్ది రామచంద్రం,సిద్ది నవీన్,నేతి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్,గందే యాదగిరి,సిరిపురం సత్యనారాయణ,కాశీనాథ్,శ్రీహరి,రమేష్ , గందే సంతోష్,తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 31 ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా గజ్వేల్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి లక్ష్మీ నరసమ్మ దంపతులు వారి కుమారుడు సిద్ది నవీన్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఇటిక్యాల మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ, హనుమాన్ ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు పెద్దలు సిద్ధి బిక్షపతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ చేయడం జరిగిందని వారికి వారి కుటుంబానికి దేవదేవతల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల భద్రయ్య, సిద్ది రామచంద్రం,సిద్ది నవీన్,నేతి శ్రీనివాస్, కైలాస ప్రశాంత్,గందే యాదగిరి,సిరిపురం సత్యనారాయణ,కాశీనాథ్,శ్రీహరి,రమేష్ , గందే సంతోష్,తదితరులు పాల్గొన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మార్చి 31. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇందుప్రియల్ గ్రామంలో శ్రీ సీతారామ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ఐదు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి మరియు గ్రామస్తులు అంత భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామ ఆలయంలో పూజలు నిర్వహించారు. PACS చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. మరియు గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మాట్లాడుతూ ఐదు రోజులుగా గ్రామంలో ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ ఉత్సవం విజయవంతంగా జరిపించినందుకు గ్రామస్తులకు మరియు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ వెంకట్ రెడ్డి గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మార్చి 31.
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇందుప్రియల్ గ్రామంలో శ్రీ సీతారామ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 
ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ ఐదు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి మరియు గ్రామస్తులు అంత భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామ ఆలయంలో పూజలు నిర్వహించారు. PACS చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. మరియు గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి  మాట్లాడుతూ ఐదు రోజులుగా గ్రామంలో ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ  ఉత్సవం విజయవంతంగా జరిపించినందుకు గ్రామస్తులకు మరియు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ వెంకట్ రెడ్డి గ్రామ సర్పంచ్ స్వాతి స్వామి మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • వికారాబాద్, కొడంగల్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమేరా ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత దేశానికి వినయం కానీ అటువంటి శివశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎవరు కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని సరఫరా గురించి తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అరేయ్ అరేయ్ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని వివరిస్తూ ప్రతిరోజు ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి క్షేమంగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్మణ్ తెలిపారు.
    1
    వికారాబాద్, కొడంగల్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమేరా ముఖ్య అతిథిగా హాజరై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత దేశానికి వినయం కానీ అటువంటి శివశక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఎవరు కూడా మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని సరఫరా గురించి తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అరేయ్ అరేయ్ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని వివరిస్తూ ప్రతిరోజు ఉపాధి కోసం బయటకు వెళ్లే వ్యక్తులు తిరిగి క్షేమంగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్మణ్ తెలిపారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    10 hrs ago
  • ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...
    1
    ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని  లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు...
తాగి వాహనాలు నడిపి  తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని....
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! 
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి...
మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి...
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ...
*నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..*
ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    10 hrs ago
  • కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్లోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా వీసీ ద్వారా యూరియా యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. ఏఈవో సౌమ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ.. దళారీల ప్రమేయం లేకుండా, ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకే ఈ యాప్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులు నేరుగా యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు.
    1
    కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్లోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా వీసీ ద్వారా యూరియా యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. ఏఈవో సౌమ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ.. దళారీల ప్రమేయం లేకుండా, ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకే ఈ యాప్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులు నేరుగా యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.