కాకినాడ జిల్లాలో శాంతిభద్రతలను బలోపేతం చేయడంతో పాటు అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ఆదివారం జిల్లావ్యాప్తంగా లాడ్జిలు, అతిథి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. జూదం, వ్యభిచారం వంటి చట్టవిరుద్ధ పనులు జరుగుతున్నాయా, అనుమానాస్పద వ్యక్తులు బస చేస్తున్నారా, అలాగే విదేశీయులు సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారా అనే కోణాల్లో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. లాడ్జిల్లో బస చేసే ప్రతి అతిథి వివరాలు, గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు. కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి. నాగ దుర్గారావు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించి, అతిథుల రిజిస్టర్‌లు, గుర్తింపు పత్రాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మాట్లాడుతూ, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించి సహకరించాలని ప్రజలను కోరారు.
కాకినాడ జిల్లాలో శాంతిభద్రతలను బలోపేతం చేయడంతో పాటు అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ఆదివారం జిల్లావ్యాప్తంగా లాడ్జిలు, అతిథి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. జూదం, వ్యభిచారం వంటి చట్టవిరుద్ధ పనులు
జరుగుతున్నాయా, అనుమానాస్పద వ్యక్తులు బస చేస్తున్నారా, అలాగే విదేశీయులు సరైన పత్రాలు లేకుండా ఉంటున్నారా అనే కోణాల్లో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. లాడ్జిల్లో బస చేసే ప్రతి అతిథి వివరాలు, గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు.
కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి. నాగ దుర్గారావు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించి, అతిథుల రిజిస్టర్‌లు, గుర్తింపు పత్రాలు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్
మాట్లాడుతూ, ప్రజా భద్రతకు విఘాతం కలిగించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించి సహకరించాలని ప్రజలను కోరారు.
- 😭🙏1
- కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ ఆలయంలో ఆదివారం నాడు భక్తులు భారీ ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో సుమారుగా 32 వేల మందికి పైగా భక్తులు క్యూ లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో విశ్వనాథరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గొర్ల భాస్కర్ సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజుతో కలిసి క్యూ లైన్లలో నిలబడిన భక్తుల వద్దకు వెళ్లి ఆలయంలో కల్పించిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తుల రాకతో ఆలయానికి భారీగా ఆదాయం లభించింది. వాహన పూజలు, ప్రసాదాలు, రూములు, కేశఖండన మరియు వివిధ మార్గాల ద్వారా ఆలయానికి రూ. 12,13,758 (12 లక్షల 13 వేల 758) ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో విశ్వనాథరాజు వెల్లడించారు.1
- 🙏🙏1
- 🙏🙏1
- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలోని రహదారుల దుస్థితిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రోడ్లు ఏమాత్రం బాగోలేవని, వీటిని ఎవరూ గుర్తించడం లేదని, అసలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ దారుల గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కింద పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఎవరిలోనూ చలనం లేదని, తాము చెప్పాల్సింది చెప్పేశామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.2
- దేశ ఆర్థిక అభివృద్ధికి కృషి చేసినందుకు గాను నారా బ్రాహ్మణి గారికి ఫార్ట్యూన్ ఇండియా ప్రతిష్టాత్మక 'మోస్ట్ పవర్ఫుల్ లేడీ' జాతీయ అవార్డును అందజేసింది. ఈ నేపథ్యంలో, ఆమె రాజకీయ ప్రవేశం చేయాలని, ఆమె నాయకత్వం వర్ధిల్లాలని కోరుతూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖపట్నం అక్కయ్యపాలెం హైవే పోర్ట్ హాస్పిటల్ ఎదురుగా భారీగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం దక్షిణ కొరియా వెళ్లి పెట్టుబడులు తెచ్చిన నారా లోకేష్ నాయకత్వాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. 2029 ఎన్నికలలో పోటీ బరిలో మహిళలకు 33 శాతం టిక్కెట్లు ఇస్తామని లోకేష్ ప్రకటించడం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. లోకేష్ గారు తన భార్య బ్రాహ్మణి గారికి ఇచ్చిన తోడ్పాటు వల్లే ఆమె దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఈ అవార్డును అందుకున్నారని కొనియాడారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన సతీమణికి కూడా ఈ సందర్భంగా పాలాభిషేకం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ, తనకు వచ్చిన ఈ అవార్డును నారా బ్రాహ్మణి గారు రైతులు మరియు ఉద్యోగులకు అంకితం ఇచ్చారు. నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ రోజు హర్షం వ్యక్తంచేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ తెలిపారు.2
- భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని శ్రీమతి ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి గారు సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైయస్ జగన్ కొనియాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఆమె ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని పేర్కొన్నారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైయస్ జగన్, ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు మరియు సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.1
- 😭🙏1