పట్టణ అభివృద్ధిలో హైదరాబాదు నగరం దేశానికే ఒక నమూనాగా నిలుస్తుంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (CURE)ను కాలుష్యరహిత గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి, సుస్థిర పట్టణాభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఒక నమూనాగా నిలబెడతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని, రాబోయే ఐదేళ్లలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లో కాలుష్య కారక పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన “ముంబై క్లైమెట్ వీక్” సదస్సులో నీతి ఆయోగ్ (NITI Aayog) వైస్ చైర్మన్‌గా శ్రీ సుమన్ బేరీ గారు, ఇతర అతిథులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై ముఖ్యమంత్రి తెలంగాణ దృక్పథాన్ని వివరించారు. గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని, తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుండి 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయని చెప్పారు. రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను CURE, PURE, RARE జోన్‌లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్ చుట్టూ 160 కి.మీ. పొడవున్న ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)గా, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE) జోన్‌గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ప్యూర్ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి “చైనా +1” ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ తయారీ వృద్ధి గ్రీన్ ఎనర్జీ ఆధారంగా సాగుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా, 360 కిలోమీటర్ల పొడవున్న రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కొనసాగుతోందని, రీజినల్ రింగ్ రైల్వే ప్రణాళికలు అమలులో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ విద్యుత్ వినియోగంపై మాట్లాడుతూ, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో గరిష్ట డిమాండ్ 34,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఇందులో గ్రీన్ ఎనర్జీ వాటా 25 శాతంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ముఖ్యంగా డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, శక్తి, ఉపాధి, వ్యవస్థాపకత (Entrepreneurship) మధ్య సమతుల్యతను సాధిస్తూ, గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను మొత్తం దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

- ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు ను ఈ నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అం శంపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఓయూలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. మారుతున్న సాంకేతిక యుగంలో ఉన్నత విద్యా విదానాల రూపకల్పనపై చర్చ ఉంటుందన్నారు. ఈ చర్చల్లో వచ్చి ప్రధాన అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.1
- మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి ప్రయత్నం చేయగా బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు అరెస్ట్ అయినా బీఆర్ఎస్వి నేతలు జీడీ అనిల్, జంగయ్య, నాగారం ప్రశాంత్, రామ కృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, దీరజ్,శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- every day traffic jam in mir alam mandi road Request to sho mir chowk look into1
- హైదరాబాద్ :-వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో దారుణం ఓ మహిళను ఇంట్లో రెండూ కత్తులతో, పెట్రోల్ డబ్బాతో వచ్చి దారుణంగా హత్య చేసిన మహేష్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేసిన మహేష్ అనే వ్యక్తి పోలీసుల అదుపులో మహేష్ అనే వ్యక్తి తనకి మహిళా తో గతంలో పెళ్లి జరిగింది అని తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం4
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో మహమ్మద్ అలీ జిన్నా వారసులు MiM కాసిమ్ రజ్వీ రజాకార్ వారసుల తో జాగ్రత్తగా ఉండండి హిందువులారా1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 18 ప్రజా తెలంగాణ న్యూస్ ఈరోజు ప్రజా నాయకుడు, మనసున్న మహానేత,మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర్ రావు గారి 72వ జన్మదినం సందర్బంగా వేడుకలు గజ్వెల్ పట్టణంలో mlc వంటేరి యాదవరెడ్డి,గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో brs మండల అధ్యక్షుడు బెండే మధు మరియు బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ గారికి నిండు ఆయురారోగ్యాలతో పాటు మరింత ప్రజా సేవలో ముందుకు వెళ్లేలా ఆశీర్వధించాలని ప్రార్థించారు. అనంతరం అక్కడే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. తదననంతరం గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవి, వైస్ ఛైర్మన్ కల్యాణ్ కార్ నర్సింగరావు మురియు పాలక వర్గం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గజ్వేల్ మండలం బంగ్లా వెంకటపూర్ గ్రామానికి చెందిన సల్లూరీ మహేష్ S%రామయ్య నిరుపేద కుటుంబానికి చెంది వారు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భంగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు రాఆకాంక్షించారు72000 రూపాయల ఆర్థిక సహాయం బంగ్లా వెంకటాపూర్ లోని ఇంటికి వెళ్లి ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నేతృత్వంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డిల చేతుల మీదుగా అందజేశారు.ఆ తర్వాత స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తాలో గజ్వేల్ మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ గారు తిరుగులేని ప్రజా నాయకునిగా తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన మనసున్న మానవతావాది కేసీఆర్ గారు అని వారు నిండు నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రారస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పోరాట వీరునిగా, పదేళ్ళ పాలనలో మంచి పరిపాలనా దక్షునిగా, నేడు రాష్ట్ర ప్రజలందరూ జాతిపిత గా పిలుస్తున్న నేతగా నిజాయితీకి, నిరాడంబరతకు, నిలువెత్తు రూపం కెసిఆర్ అన్నారు. గజ్వెల్ నియోజకవర్గ అభివృద్ధిలో రాష్టానికి మార్గదర్శనం చేసి రోల్ మొడల్గా నిలిపిన అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారని గుర్తు చేశారు. వారు ఇచ్చిన స్ఫూర్తి తోనే తాము కూడా ప్రజా సేవలో కొనసాగుతూ సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆ భగవంతుని ఆశీర్వాదం తెలంగాణ ప్రజల దీవెనలతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో పురోగమించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ జడ్పీటీసీ పంగ మల్లేశం, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి,అరుణ,జఖి ఉద్దీన్, చంద్రమోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, కప్ప మమత, గోలి మమత, మురళి, బొగ్గుల స్వప్న, బాపురావు, భవాని, భాగ్యలక్ష్మీ, శ్రీధర్, అత్తెల్లి శ్రీను, ఆయా గ్రామాల సర్పంచ్ లు, రమేష్, నాగలక్ష్మి, శ్రీనివాస్, నాగరాజు, జ్యోతి స్వామి, బ్యాగారి ప్రభాకర్, నాయకులు బలమని, మద్ది రాజిరెడ్డి,కృష్ణా రెడ్డి, రగుపతి రెడ్డి, రమేష్ గౌడ్, శివ,స్వామి, మల్లేశం, బిమప్ప, అహ్మద్,దశరథ, బాపిరెడ్డి, ఉమర్, కనక గౌడ్, భాను, చందు, బూరన్, శ్రీనివాస్ రెడ్డి,మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.2
- కాకునూరు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల ప్రభను ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ప్రభను ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున వరకు అగ్నిగుండాల వద్ద ప్రత్యేక పూజలు కొనసాగనున్నది.అనంతరం నిప్పుకణుకలపై నడుస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, హారతులు, నాదస్వరాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.1
- భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి కార్యక్రమాని ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ (AMSA ) ఓయూ అధ్యక్షులు నామ సైదులు ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నామ సైదులు మాట్లాడుతూ భాగ్యరెడ్డివర్మ దక్కన్ పీఠభూమిలో భాగ్యనగరం నడిబొడ్డున ధ్రువతార అని, సామాజిక ఉద్యమకారులకు తొలి గురువు అన్నారు. సాధారణ దళిత మాల కుటుంబానికి చెందిన మాదిరి వెంకటయ్య, రంగమాంబ దంపతులకు హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో భాగ్యరెడ్డి వర్మ. యుక్త వయసులో సుల్తాన్ బజార్ లో ఆర్య సమాజంలో కొంతకాలం పని చేశాడని, ఆర్య సమాజం నిర్వహకులు కిషన్ రావు ఆయన సేవలను గుర్తిం చి వర్మ అనే బిరుదు ఇచ్చారని తెలిపారు. భాగ్యరెడ్డి వర్మ ఆ రోజుల్లో రెడ్డి కులానికి ఇచ్చే గౌరవాన్ని చూసి రెడ్డి అంటే పరిపాలదక్షుడిగా గౌరవం ఉంటుందని వారి కన్నా తమ జాతులు తక్కువ కాదని ఆయన పేరులో రెడ్డి చేర్చుకున్నాడని తెలిపారు. హిందూ సమాజంలో అస్పశ్యత వ్యక్తుల మధ్య వ్యత్యాసం గమనించిన భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి దళిత బాలికలకోసం 26పాఠశాలలో నెలకొల్పాడని గుర్తు చేశారు. బస్తీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఒకవైపు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తూనే సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. జగన్ మిత్రమండలి, ఆది హిందూ సోషల్ లీగ్ లీగ్ లీగ్ సంస్థలు ఏర్పాటు చేశారని చెప్పారు.అన్నగారిన వర్గాల ఆత్మస్థైర్యం కోసం నిరంతరం పోరాడుతున్న హైదరాబాద్లో ఎన్నో సంఘసేవ కార్యక్రమాలు నిర్వహించారు దృష్టిలో పెట్టుకొని బౌద్ధమతం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ కంటే ముందు బుద్ధ పూర్ణిమ రోజు 1915లో బౌద్ధమతం స్వీకరించారు ఆయన క్షయ వ్యాధితో బాధపడుతూ 18 ఫిబ్రవరి 1939లో 51 సంవత్సరాల వయసులోనే తుది శ్వాస విడిచారు, భాగ్యరెడ్డి వర్మ సేవలు గుర్తించి తెలంగాణ ప్రభుత్వం జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడం స్వాగతిస్తున్నాం అన్నారు. భాగ్యరెడ్డివర్మ ఆశలను కొనసాగిస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వలిగొండ నరసింహ, కొమ్మనబోయిన సైదులు యాదవ్, సుధాకర్, బొల్లెపల్లి స్వామి గౌడ్, వేణు, చేరాల వంశీ, లింగయ్య యాదవ్, రవి గౌడ్, కొమ్ము శేఖర్, రవి, ఎడవెల్లి అజయ్, రాము తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.1