Shuru
Apke Nagar Ki App…
వేంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల దరఖాస్తులు ఆహ్వానం వేంపల్లి వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వేంపల్లిలో గ్రంథాలయ శాస్త్ర విభాగంలో ఒక అతిథి అధ్యాపకుల పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. ఉష శ్రీ తెలిపారు. ఎంఎల్ఐఎస్సీ, బిఎల్ఐఎస్సీ అర్హతతో కనీసం 55 శాతం మార్కులు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 3, సాయంత్రం 5 గంటలలోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
LAKKU SIVA SANKAR reddy
వేంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల దరఖాస్తులు ఆహ్వానం వేంపల్లి వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వేంపల్లిలో గ్రంథాలయ శాస్త్ర విభాగంలో ఒక అతిథి అధ్యాపకుల పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. ఉష శ్రీ తెలిపారు. ఎంఎల్ఐఎస్సీ, బిఎల్ఐఎస్సీ అర్హతతో కనీసం 55 శాతం మార్కులు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 3, సాయంత్రం 5 గంటలలోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం ప్రోగ్రాం ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లి పెన్నా హైస్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భావన, కరస్పాండెంట్ రామయ్య, ప్రిన్సిపల్ దాక్షాయణి అధ్వర్యంలొ "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు" పురస్కరించుకొని సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు కీటక జనిత వ్యాధుల గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారు మాట్లాడుతు ప్రతి ఒక కుటుంబము చెక్,క్లీన్,కవర్ పాటించాలని తెలియపరిచారు. అలాగనే ప్రతిఒక్కరు దోమతెరలలోనే నిద్రించాలని తెలియపరిచారు.డాక్టర్ భావన గారు మాట్లాడుతు14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అమ్మాయిలందరు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు.సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు ఆగస్టు 3నుండి 8 వరకు జరగబోవు డిపిటి,టిడి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 5,10,16 సంవత్సరాల పిల్లలు వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలియ జేశారు.అనంతరం మంటపంపల్లి గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము,MLHP చంద్రిక,స్త్రీ ఆరోగ్య కార్యకర్త సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం ప్రోగ్రాం ఒంటిమిట్ట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మంటపంపల్లి పెన్నా హైస్కూల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ భావన, కరస్పాండెంట్ రామయ్య, ప్రిన్సిపల్ దాక్షాయణి అధ్వర్యంలొ "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు" పురస్కరించుకొని సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు కీటక జనిత వ్యాధుల గురించి విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.ఈ సందర్భంగా సుబ్బరాయుడు గారు మాట్లాడుతు ప్రతి ఒక కుటుంబము చెక్,క్లీన్,కవర్ పాటించాలని తెలియపరిచారు. అలాగనే ప్రతిఒక్కరు దోమతెరలలోనే నిద్రించాలని తెలియపరిచారు.డాక్టర్ భావన గారు మాట్లాడుతు14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అమ్మాయిలందరు HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు.సూపర్వైజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతు ఆగస్టు 3నుండి 8 వరకు జరగబోవు డిపిటి,టిడి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా 5,10,16 సంవత్సరాల పిల్లలు వ్యాక్సిన్ వేపించుకోవాలని తెలియ జేశారు.అనంతరం మంటపంపల్లి గ్రామంలో డ్రైడే,ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందము,MLHP చంద్రిక,స్త్రీ ఆరోగ్య కార్యకర్త సరోజ ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న స్తంభాలు తొలగించాలి నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.1
- అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.1
- పుంగనూరు లో దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము. కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు. నమస్కారములతో.... పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం. పుంగనూరు......2
- వైయస్ ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.1
- పుంగనూరు లో ర్యాలీ చేసిన దస్తావేజు లేఖరులు,స్టాంప్ వెండర్లు,డిటిపి ఆపరేటర్లు, సహాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్న విషయం విధితమే! చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం సభ్యులు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.3
- భవిష్యవాణి పేరుతో మా ఊరి ప్రజలను మోసం చేస్తున్నారు: గ్రామస్తులు భవిష్య వాణి పేరుతో తమ గ్రామంలో ఓ వ్యక్తి ప్రజల నుంచి రూ 5 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నాడని యాదమరి మండలం, జంగాలపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆరోపించారు. 'దేవుడి పేరుతో మాయ మాటలు చెప్పి నగదు తీసుకుంటున్నాడు. ప్రజలు ఇలాంటి మాయమాటలకు మోసపోకూడదని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే నా వద్ద లక్ష మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు, మీపైనే నెగిటివ్ ప్రచారం చేస్తా అని బెదిరించినట్లు తమ దృష్టికి వచ్చింది' అని స్థానికులు తెలియజేశారు.1
- సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ బస్సును నిర్లక్ష్యముగా నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్. అన్నమయ్య జిల్లా: మదనపల్లి నుండి చిత్తూరు వెళుతున్న బస్సులో సెల్ ఫోన్లో నిమగ్నమైన డ్రైవర్ ఒక చేతితో ఫోన్ చూస్తూ, మరొక్క చేతితో బస్సును నడుపుతున్నాడు. ఈ నిర్లక్ష్యము వలన ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు భాద్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి భాద్యత లేని డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరగక మునుపే సంబందిత అధికారులు స్పందిచి మరలా ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను ప్రయాణికుడు తన ఫోన్ లో చిత్రీకరించడంతో వెలుగులోకి వచ్చింది. ఆ బస్సు పలమనేరు డిపోకు చెందిన బస్సు గా గుర్తింపు.1