జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి... లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం తప్పదు: టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ జర్నలిస్టుల సంక్షేమం, ముఖ్యంగా ఇళ్ల స్థలాల సాధన కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-H143) ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్ ఆసీఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో జిల్లా సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్, కోడంగల్, పరిగి, తాండూర్ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును ప్రభుత్వం అత్యవసరంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం విచారకరమని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.అనంతరం జరిగిన సమావేశంలో టీయూడబ్ల్యూజే సంస్థ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, జిల్లా వ్యాప్తంగా మండల మరియు డివిజన్ స్థాయి కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి యేగానంద్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు తిరుపతి నాయక్, జిల్లా నాయకులు రవీందర్, ఆసీఫ్ హుస్సేన్, ప్రహ్లాదాచారి, శ్రీనివాస్, నర్సిములు, ఆనంద్, జావీద్, రాజు, బస్వరాజ్, సంతోష్, మల్కయ్య గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. .......వికారాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే నూతన అడహాక్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. ఈ సమావేశంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-H143) వికారాబాద్ జిల్లా నూతన అడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్‌గా ఎం. రవీందర్,కో-కన్వీనర్లుగా ప్రహ్లాదాచారి, శ్రీనివాస్, నర్సిములు, ఆనంద్, జావీద్, రాజు, బస్వరాజ్, సంతోష్, మల్కయ్య గౌడ్, కృష్ణ, రాజేందర్ గౌడ్లను జిల్లా జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా టీయూడబ్ల్యూజేను మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సభ్యత్వ విస్తరణ, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేయాలని సమావేశం నిర్ణయించింది.

- మానవ వనరులు,మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం: కలెక్టర్ దీపక్ తివారి. వికారాబాద్ : మానవ వనరులను, మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ముత్యాల మండలం, హకీంపేట్ ఎడ్యుకేషన్ Mhnun కల్చర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మక చేపడుతున్న ఎడ్యుకేషన్ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులను వేగవతం చేయాలని ఎడ్యుకేషన్ హాఫ్ లో చేపట్టే ప్రతి పని వద్ద ఇంచార్జిగా పర్యవేక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం లో చేపడుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చారని అధికారులకు సూచించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్ పారామెడికల్ ఫిజియోథెరపీ కళాశాల ఇన్ ఇండియా ఇండికేటర్ స్కూల్ నర్సింగ్ వెటర్నరీ కళాశాల సంబంధించిన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.1
- దౌల్తాబాద్: వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.......... దౌల్తాబాద్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు వాగులు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్ల దగ్గరకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ టీయూ లోగో ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.1
- అన్నారం ప్రకృతి వనం వెళ్లే కాలనీ రహదారి బురద మా రోడ్డు మరమ్మతులు చేపట్టండి గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారం వార్డులోని ప్రకృతి వనం కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు, బురదతో ప్రమాదకరంగా మారింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల క్రితం ప్రారంభించిన రోడ్డు పనులు నిలిచిపోయాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు. వెంటనే రహదారి పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.1
- ఏ సంపాదన లేకపోయినా ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని ప్రేమను ఆస్తిగా మలుచుకున్న పెద్ది సుదర్శన్ అన్న నిజమైన ధనవంతుడు!1
- *అధ్వానంగా రత్నాపూర్ రోడ్డు పరిస్థితి * న్యాల్కల్ మండలం రత్నాపూర్ గ్రామ ప్రధాన రహదారి భారీ వర్షాలతో గుంతలమాయమై ప్రజలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు రైతులు వాహనదారులకు రాకపోకల కష్టంగా మారాయి రహదారి దుస్థితితో ప్రమాదాల ముప్పు పెరిగిందని విజయ్ కుమార్ తెలిపారు అధికారులు వెంటనే స్పoదిoచి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు1
- ఆసుపత్రిలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ.. రోగులతో నేరుగా ముచ్చట తూప్రాన్ 50 పడకల సామాజిక ఆసుపత్రిని ఆర్డీఓ బావయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది సేవలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగితో మానవీయంగా వ్యవహరించి వారికి మనోధైర్యం కల్పించాలని వైద్యులు, సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.1
- వర్షంలో కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర వర్షంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.1