logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బీర్కూరు గ్రామంలో ఆర్టీసీ బస్సు ఆపక ప్రయాణికులకు తప్పని తిప్పలు. బీర్కూర్ గ్రామంలోని బీర్కూర్ చౌరస్తా వద్ద ఆదివారం రోజున ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఆపక ప్రయాణికులకు తప్పని తిప్పలు.ఆర్టీసీ (RTC) నిబంధనల ప్రకారం, ప్రయాణికులు చేతిచూపితే బస్సు ఆపడం డ్రైవర్ బాధ్యత. సాయంత్రం బస్సు వెళితే గంట వరకు బస్సు రాదని ఆవేదన చెందుతున్న ప్రయాణికులు.బస్సు డ్రైవర్ని బస్సు ఆపమని అడగగా నేను బస్టాండ్ లో మాత్రమే బస్సు ఆపుతానని వేరే దగ్గర బస్సు ఆపమని రాష్ సమాధానం చెబుతున్నాడని ఆడవాళ్లు ఉన్నారనే కనికరం లేకుండా రాష్ గా సమాధానం చెబుతున్నాడని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.ఇప్పటికైనా ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చౌరస్తా వద్ద బస్సు ఆపే విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

1 day ago
user_Reporter Khaseem
Reporter Khaseem
బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
1 day ago
f5ccd34a-a34b-40a7-8a09-c9ffd439944e

బీర్కూరు గ్రామంలో ఆర్టీసీ బస్సు ఆపక ప్రయాణికులకు తప్పని తిప్పలు. బీర్కూర్ గ్రామంలోని బీర్కూర్ చౌరస్తా వద్ద ఆదివారం రోజున ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఆపక ప్రయాణికులకు తప్పని తిప్పలు.ఆర్టీసీ (RTC) నిబంధనల ప్రకారం, ప్రయాణికులు చేతిచూపితే బస్సు ఆపడం డ్రైవర్ బాధ్యత. సాయంత్రం బస్సు వెళితే గంట వరకు బస్సు రాదని ఆవేదన చెందుతున్న ప్రయాణికులు.బస్సు డ్రైవర్ని బస్సు ఆపమని అడగగా నేను బస్టాండ్ లో మాత్రమే బస్సు ఆపుతానని వేరే దగ్గర బస్సు ఆపమని రాష్ సమాధానం చెబుతున్నాడని ఆడవాళ్లు ఉన్నారనే కనికరం లేకుండా రాష్ గా సమాధానం చెబుతున్నాడని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.ఇప్పటికైనా ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చౌరస్తా వద్ద బస్సు ఆపే విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు
    1
    .*ప్రెస్ రిలీజ్*
మెదక్ 20 ఏప్రిల్2026
2027 -పూర్తిగా  డిజిటల్ జనగణన కలెక్టర్
ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్  శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి  
జిల్లా కలెక్టర్ ప్రతిమా  సింగ్
2027 - డిజిటల్   జనగణన   అని 
*జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు 
కౌడిపల్లి మండలంలో  జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027  నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు.   శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని  ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
  • మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.
    1
    మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు
    1
    జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    16 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో పీఏసీఎస్ బోథ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... రైతులకు న్యాయం జరిగేలా అధికారులు సహకరించాలని, ఎండలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వీలైనంత త్వరగా పంటలను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో పీఏసీఎస్ బోథ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... రైతులకు న్యాయం జరిగేలా అధికారులు సహకరించాలని, ఎండలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వీలైనంత త్వరగా పంటలను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Boath, Adilabad•
    8 hrs ago
  • పత్రికా ప్రకటన ఏప్రిల్ 20, 2026-ఆదిలాబాద్: ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రధాన మంత్రి అవార్డు లభించింది. ఇది గర్వకారణమైన ఘనత మాత్రమే కాకుండా, నార్నూర్‌కు కొత్త మార్పు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ గుర్తింపుతో నార్నూర్ నీటిని కేంద్రంగా చేసుకొని సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. ఏప్రిల్ తర్వాత వెంటనే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. మొత్తం 10 సాగునీటి చెరువులు పునరుద్ధరించబడి, 79,300 ఘన మీటర్ల మట్టిని తొలగించి, నీటి నిల్వ సామర్థ్యం 30 లక్షల ఘన మీటర్లకు పైగా పెంచబడింది. జల్ శక్తి అభియాన్ కింద పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు తాడిహత్నూర్, సోనాపూర్, నాగల్కొండ, జాండా, గుంజాల వంటి గ్రామాలలో చేపట్టబడ్డాయి. ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడి వ్యవసాయానికి బలాన్నిచ్చాయి. “మన బడి – మన నీరు” కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో వర్షపు నీటి సంగ్రహణ గుంతలు నిర్మించబడ్డాయి. నీటి లభ్యత మెరుగుపడడంతో తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. నాందీ వాటర్స్ సహకారంతో నార్నూర్, ఖంపూర్, నాగల్కొండలో RO ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. CHC నార్నూర్‌లో కూడా RO ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో సురక్షిత నీటి అందుబాటు పెరిగింది. ఆర్థికాభివృద్ధి దిశగా మహువా లడ్డూ యూనిట్, బాంబూ ప్రాసెసింగ్ యూనిట్, దాల్ మిల్ వంటి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. మార్కెట్ లింకేజ్లు, రివాల్వింగ్ ఫండ్ మద్దతు ద్వారా రైతులకు మంచి ధరలు లభించాయి. 3700 చెట్లపై లాక్ సాగు చేపట్టి 370 గిరిజన కుటుంబాలకు స్థిర ఆదాయం కల్పించబడింది. వ్యవసాయంలో వాడి మూడు స్థాయిల సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, ఆయిల్ పామ్ సాగు వంటి పద్ధతులు అమలు చేయబడ్డాయి. సాయిల్ హెల్త్ కార్డులతో శాస్త్రీయ వ్యవసాయం ప్రోత్సహించబడింది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద గృహ నిర్మాణం (హౌసింగ్), PM JANMAN ద్వారా గిరిజన అభివృద్ధి చేపట్టబడింది. ఆరోగ్యరంగంలో టెలీమెడిసిన్ సేవలు, ధర్మ సేవ వెల్నెస్ ప్రోగ్రామ్, మెన్స్ట్రుయల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయబడి, పోషణ మేళాలు నిర్వహించబడ్డాయి. రెండు సబ్‌సెంటర్లు NQAS సర్టిఫికేషన్ పొందాయి. విద్యలో డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ద్వారా 48.6% మెరుగుదల నమోదైంది. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం AI ఆధారిత బోధన పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి. గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు ట్రైబల్ మ్యూజియం స్థాపించబడింది. యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యంగ్ లీడర్స్ క్లబ్బులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సమగ్ర చర్యల ఫలితంగా నార్నూర్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించబడింది. దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ క్వార్టర్‌లో దక్షిణ ప్రాంతంలో డెల్టా ర్యాంకింగ్‌లో 1వ స్థానం సాధించబడింది. NITI Aayog స్టేట్ యూజ్ కేస్ ఛాలెంజ్‌లో విద్య విభాగంలో 3వ స్థానం కూడా లభించింది. నార్నూర్ ప్రయాణం నీటి ఆధారిత, సమగ్ర అభివృద్ధి మోడల్‌గా నిలిచింది. ప్రధాన మంత్రి అవార్డు ద్వారా ప్రారంభమైన ఈ మార్పు, ఇప్పుడు స్థిరమైన అభివృద్ధి దిశగా కొనసాగుతోంది.
    1
    పత్రికా ప్రకటన 
ఏప్రిల్ 20, 2026-ఆదిలాబాద్:
ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రధాన మంత్రి అవార్డు లభించింది. ఇది గర్వకారణమైన ఘనత మాత్రమే కాకుండా, నార్నూర్‌కు కొత్త మార్పు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది.
ఈ గుర్తింపుతో నార్నూర్ నీటిని కేంద్రంగా చేసుకొని సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. ఏప్రిల్ తర్వాత వెంటనే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. మొత్తం 10 సాగునీటి చెరువులు పునరుద్ధరించబడి, 79,300 ఘన మీటర్ల మట్టిని తొలగించి, నీటి నిల్వ సామర్థ్యం 30 లక్షల ఘన మీటర్లకు పైగా పెంచబడింది.
జల్ శక్తి అభియాన్ కింద పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు తాడిహత్నూర్, సోనాపూర్, నాగల్కొండ, జాండా, గుంజాల వంటి గ్రామాలలో చేపట్టబడ్డాయి. ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడి వ్యవసాయానికి బలాన్నిచ్చాయి.
“మన బడి – మన నీరు” కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో వర్షపు నీటి సంగ్రహణ గుంతలు నిర్మించబడ్డాయి.
నీటి లభ్యత మెరుగుపడడంతో తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. నాందీ వాటర్స్ సహకారంతో నార్నూర్, ఖంపూర్, నాగల్కొండలో RO ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. CHC నార్నూర్‌లో కూడా RO ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో సురక్షిత నీటి అందుబాటు పెరిగింది.
ఆర్థికాభివృద్ధి దిశగా మహువా లడ్డూ యూనిట్, బాంబూ ప్రాసెసింగ్ యూనిట్, దాల్ మిల్ వంటి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. మార్కెట్ లింకేజ్లు, రివాల్వింగ్ ఫండ్ మద్దతు ద్వారా రైతులకు మంచి ధరలు లభించాయి.
3700 చెట్లపై లాక్ సాగు చేపట్టి 370 గిరిజన కుటుంబాలకు స్థిర ఆదాయం కల్పించబడింది.
వ్యవసాయంలో వాడి మూడు స్థాయిల సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, ఆయిల్ పామ్ సాగు వంటి పద్ధతులు అమలు చేయబడ్డాయి. సాయిల్ హెల్త్ కార్డులతో శాస్త్రీయ వ్యవసాయం ప్రోత్సహించబడింది.
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద గృహ నిర్మాణం (హౌసింగ్), PM JANMAN ద్వారా గిరిజన అభివృద్ధి చేపట్టబడింది.
ఆరోగ్యరంగంలో టెలీమెడిసిన్ సేవలు, ధర్మ సేవ వెల్నెస్ ప్రోగ్రామ్, మెన్స్ట్రుయల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయబడి, పోషణ మేళాలు నిర్వహించబడ్డాయి. రెండు సబ్‌సెంటర్లు NQAS సర్టిఫికేషన్ పొందాయి.
విద్యలో డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ద్వారా 48.6% మెరుగుదల నమోదైంది. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం AI ఆధారిత బోధన పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి.
గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు ట్రైబల్ మ్యూజియం స్థాపించబడింది. యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యంగ్ లీడర్స్ క్లబ్బులు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ సమగ్ర చర్యల ఫలితంగా నార్నూర్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించబడింది.
దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ క్వార్టర్‌లో దక్షిణ ప్రాంతంలో డెల్టా ర్యాంకింగ్‌లో 1వ స్థానం సాధించబడింది. NITI Aayog స్టేట్ యూజ్ కేస్ ఛాలెంజ్‌లో విద్య విభాగంలో 3వ స్థానం కూడా లభించింది.
నార్నూర్ ప్రయాణం నీటి ఆధారిత, సమగ్ర అభివృద్ధి మోడల్‌గా నిలిచింది. ప్రధాన మంత్రి అవార్డు ద్వారా ప్రారంభమైన ఈ మార్పు, ఇప్పుడు స్థిరమైన అభివృద్ధి దిశగా కొనసాగుతోంది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    ఇచ్చోడ, ఆదిలాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.