logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట్ మండలంలో ఉప సర్పంచ్ ల ఫోరం నూతన కార్యవర్గ ఎన్నికలు నేడు మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 27 గ్రామాల నుండి ఉప సర్పంచులు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వెంకంపల్లి ఉప సర్పంచ్ ఆకిడి హనుమంత్ రెడ్డి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాగిరెడ్డిపేట్ ఉప సర్పంచ్ గులాం హుస్సేన్ ఉపాధ్యక్షుడిగా, బాలాజీ శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా, బాలరాజు కార్యదర్శిగా, పిక్ల నాయక్ కోఆర్డినేటర్ గా, శివకుమార్ గౌడ్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. వస్త్రం నాయక్, దుర్గవ్వ, సుకన్య, రమేష్, సంగయ్య, అభిషేక్, సుజాత, సూరయ్య, శ్యామల సలహాదారులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జలాల్‌పూర్ గ్రామ ఉప సర్పంచ్ ధారమైన సాయిబాబా, ధర్మారెడ్డి ఉప సర్పంచ్ జయరాజ్‌తో పాటు మండలంలోని పలు గ్రామాల ఉప సర్పంచులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అకిడి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, సభ్యులందరూ ప్రజల సమస్యలను నిరంతరం పరిష్కరిస్తూ ఉత్తమ ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఐక్యమత్యంగా ఉంటూ ఉప సర్పంచ్ ల హక్కుల పరిరక్షణకై కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

1 hr ago
user_BANJA NAGARAJU
BANJA NAGARAJU
నాగిరెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
1 hr ago
847afc28-f026-465b-9b00-e3633b780dcd

ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట్ మండలంలో ఉప సర్పంచ్ ల ఫోరం నూతన కార్యవర్గ ఎన్నికలు నేడు మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 27 గ్రామాల నుండి ఉప సర్పంచులు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వెంకంపల్లి ఉప సర్పంచ్ ఆకిడి హనుమంత్ రెడ్డి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాగిరెడ్డిపేట్ ఉప సర్పంచ్ గులాం హుస్సేన్ ఉపాధ్యక్షుడిగా, బాలాజీ శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా, బాలరాజు కార్యదర్శిగా, పిక్ల నాయక్ కోఆర్డినేటర్ గా, శివకుమార్ గౌడ్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. వస్త్రం నాయక్,

e67acdcd-dc45-4b29-a1da-ae8f1eb4099b

దుర్గవ్వ, సుకన్య, రమేష్, సంగయ్య, అభిషేక్, సుజాత, సూరయ్య, శ్యామల సలహాదారులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జలాల్‌పూర్ గ్రామ ఉప సర్పంచ్ ధారమైన సాయిబాబా, ధర్మారెడ్డి ఉప సర్పంచ్ జయరాజ్‌తో పాటు మండలంలోని పలు గ్రామాల ఉప సర్పంచులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అకిడి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, సభ్యులందరూ ప్రజల సమస్యలను నిరంతరం పరిష్కరిస్తూ ఉత్తమ ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఐక్యమత్యంగా ఉంటూ ఉప సర్పంచ్ ల హక్కుల పరిరక్షణకై కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.

More news from Medak and nearby areas
  • రేగోడ్ మండలం ఆర్.ఇటిక్యాల నుంచి చేవెళ్ల వెళ్లే రహదారిలో, కల్వర్టు సమీపంలో భారీగా పేరుకుపోయిన కంకర రాళ్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. గతంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం వేసిన కంకర అలాగే ఉండిపోవడంతో, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి, పేరుకుపోయిన కంకరను తొలగించి, సీసీ రోడ్డును నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్.ఇటిక్యాల ప్రజలు ఈ రహదారిని రోడ్డు అనాలా లేక కంకర మైదానం అనాలా అని ప్రశ్నిస్తున్నారు.
    1
    రేగోడ్ మండలం ఆర్.ఇటిక్యాల నుంచి చేవెళ్ల వెళ్లే రహదారిలో, కల్వర్టు సమీపంలో భారీగా పేరుకుపోయిన కంకర రాళ్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. గతంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం వేసిన కంకర అలాగే ఉండిపోవడంతో, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి, పేరుకుపోయిన కంకరను తొలగించి, సీసీ రోడ్డును నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్.ఇటిక్యాల ప్రజలు ఈ రహదారిని రోడ్డు అనాలా లేక కంకర మైదానం అనాలా అని ప్రశ్నిస్తున్నారు.
    user_ఎనగండ్ల జైపాల్
    ఎనగండ్ల జైపాల్
    Regode, Medak•
    5 hrs ago
  • అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలోని స్కూల్ మైదానం యోగా సాధకులతో కళకళలాడింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో యోగా గురువులు ప్రతాప్ రెడ్డి, సత్యం పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతిరోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగా ఆసనాలు వేశారు. సామూహిక యోగా సాధనతో మైదానం ఆరోగ్య చైతన్యానికి వేదికగా మారింది.
    1
    అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలోని స్కూల్ మైదానం యోగా సాధకులతో కళకళలాడింది. ఆదివారం నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో యోగా గురువులు ప్రతాప్ రెడ్డి, సత్యం పాల్గొని యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతిరోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని యోగా ఆసనాలు వేశారు. సామూహిక యోగా సాధనతో మైదానం ఆరోగ్య చైతన్యానికి వేదికగా మారింది.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
  • ఆదర్శ కమ్యూనిస్టు విప్లవకారుడు, కార్మిక వర్గ పోరాటయోధుడు కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతిని విజయవంతం చేయాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ పిలుపునిచ్చారు. జూన్ 21 ఆదివారం బోధన్ పట్టణంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 26న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం పక్కన గల న్యూ అంబేద్కర్ భవన్‌లో కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా స్మారక ఉపన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో 'ఆర్థిక సంక్షోభం - ప్రజలకు సవాళ్లు' అనే అంశంపై ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, 'దేశంలో పెరుగుతున్న ఫాసిజం' అనే అంశంపై సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు, అలాగే 'డీవీకే సిద్ధాంత, రాజకీయ కృషి' అనే అంశంపై రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ కేజీ రామచందర్ ఉపన్యాసాలు ఇస్తారని వివరించారు. రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ వి. ప్రభాకర్ ప్రసంగించనుండగా, కామ్రేడ్ వనమాల కృష్ణ ఈ వర్ధంతి సభకు అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ఈ వర్ధంతి సభకు పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బి. మల్లేష్ మరోసారి కోరారు. ఈ పత్రికా సమావేశంలో పడాల శంకర్, బి. శంకర్, బి. సాయిలు, జి. దేవయ్య, గంగారాం, డి. పోశెట్టి, హైమద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
    4
    ఆదర్శ కమ్యూనిస్టు విప్లవకారుడు, కార్మిక వర్గ పోరాటయోధుడు కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతిని విజయవంతం చేయాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ పిలుపునిచ్చారు. జూన్ 21 ఆదివారం బోధన్ పట్టణంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ నెల 26న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం పక్కన గల న్యూ అంబేద్కర్ భవన్‌లో కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా స్మారక ఉపన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో 'ఆర్థిక సంక్షోభం - ప్రజలకు సవాళ్లు' అనే అంశంపై ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, 'దేశంలో పెరుగుతున్న ఫాసిజం' అనే అంశంపై సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు, అలాగే 'డీవీకే సిద్ధాంత, రాజకీయ కృషి' అనే అంశంపై రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ కేజీ రామచందర్ ఉపన్యాసాలు ఇస్తారని వివరించారు. రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ వి. ప్రభాకర్ ప్రసంగించనుండగా, కామ్రేడ్ వనమాల కృష్ణ ఈ వర్ధంతి సభకు అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు.

ఈ వర్ధంతి సభకు పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బి. మల్లేష్ మరోసారి కోరారు. ఈ పత్రికా సమావేశంలో పడాల శంకర్, బి. శంకర్, బి. సాయిలు, జి. దేవయ్య, గంగారాం, డి. పోశెట్టి, హైమద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
    user_RAHUL
    RAHUL
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కోర్టు ఆవరణలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం జడ్జి తేజశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగా సాధనతో మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేసిన జడ్జి తేజశ్రీ, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా చేయాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని ఆమె పిలుపునిచ్చారు.
    1
    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కోర్టు ఆవరణలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం జడ్జి తేజశ్రీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగా సాధనతో మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేసిన జడ్జి తేజశ్రీ, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా చేయాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని ఆమె పిలుపునిచ్చారు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    14 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో, గ్రామ ప్రజలు కప్పతల్లి ఆట ఆడి గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకు జలాభిషేకాలు చేశారు. అనంతరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగి, పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో, గ్రామ ప్రజలు కప్పతల్లి ఆట ఆడి గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకు జలాభిషేకాలు చేశారు. అనంతరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగి, పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చిన్నశంకరంపేట మండల కేంద్రం సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కొత్తవారు–పాతవారు అనే భేదం లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రాంత అభివృద్ధిని సాధించడమే అందరి లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి పనిచేస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన అన్నారు. అలాగే, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ప్రతిపాదించిన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చిన్నశంకరంపేట మండల కేంద్రం సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కొత్తవారు–పాతవారు అనే భేదం లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రాంత అభివృద్ధిని సాధించడమే అందరి లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి పనిచేస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన అన్నారు. అలాగే, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ప్రతిపాదించిన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు, హారతులు ఘనంగా జరిపారు. ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి కూడా ఇచ్చారు.
    1
    మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు, హారతులు ఘనంగా జరిపారు. ఏడుపాయల శ్రీ వన దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి కూడా ఇచ్చారు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    16 hrs ago
  • చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆదివారం రైతుల మద్దతుగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చిలుక పెంటయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందని ఆరోపించారు. యూరియా యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని, అలాగే కేంద్ర ప్రభుత్వం మందు బస్తాల ధరలు పెంచి మరో విధంగా మోసం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని పెంటయ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ఒకవైపు విద్యుత్ కోతలు, మరోవైపు రైతు భరోసా ఎగవేత చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని పెంటయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు జలగం కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్, నాయకులు దుమ్ము అంజయ్య, డప్పుల అశోక్, మరాటి మల్లిక్, బత్తుల కమలాకర్, భైరబోని రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని బీఆర్ఎస్ నాయకులు పునరుద్ఘాటించారు.
    1
    చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆదివారం రైతుల మద్దతుగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చిలుక పెంటయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందని ఆరోపించారు. యూరియా యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని, అలాగే కేంద్ర ప్రభుత్వం మందు బస్తాల ధరలు పెంచి మరో విధంగా మోసం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని పెంటయ్య విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ఒకవైపు విద్యుత్ కోతలు, మరోవైపు రైతు భరోసా ఎగవేత చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు.

ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సంక్షేమంపై దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని పెంటయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు జలగం కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్, నాయకులు దుమ్ము అంజయ్య, డప్పుల అశోక్, మరాటి మల్లిక్, బత్తుల కమలాకర్, భైరబోని రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని బీఆర్ఎస్ నాయకులు పునరుద్ఘాటించారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, అప్రమత్తమైన డ్రైవర్ మరియు కండక్టర్లు వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు, దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ అగ్నిప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
    1
    కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, అప్రమత్తమైన డ్రైవర్ మరియు కండక్టర్లు వెంటనే ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు, దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ అగ్నిప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
    user_SANDEEEP K
    SANDEEEP K
    కుత్బుల్లాపూర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.