*గుంటూరు పశ్చిమలో వేడుకగా గృహప్రవేశాల కార్యక్రమం* *గుంటూరు శివరామ్ నగర్ లో పీఎంఏవై కింద నిర్మించిన ఇంటి గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి* ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉగాది కల్లా గృహప్రవేశాలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మార్చి 30 నాటికే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్లలో ఆనందాన్ని నింపుతున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి తెలిపారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 24వ డివిజన్ శివరామ్ నగర్‌లో PMJAY పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కప్పల నాగ శ్రీమణి నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యారు. *అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ...* సొంత ఇల్లు ప్రతి సామాన్యుడి కల అని, అది ఆత్మగౌరవం, భరోసా, స్వేచ్ఛకు ప్రతీక అని, 2016లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ హౌసింగ్ పథకం కింద టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టిని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తుచేశారు. ప్రతి సామాన్యుడికి సొంత ఇల్లు కల్పించి, మెరుగైన అర్బన్ జీవన ప్రమాణాలు అందించాలనే లక్ష్యంతో ఈ పథకం తీసుకువచ్చారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వ వైఫల్యాల వల్ల టిడ్కో ఇళ్ల పంపిణీ ఆలస్యమైందని, దాదాపు 90% పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వాటి మరమ్మతుల కోసం సుమారు ₹200 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని, బ్యాంకు రుణాల భారం, పన్నుల రూపంలో లబ్ధిదారులపై ₹3000 కోట్ల భారం పడిందని పేర్కొన్నారు. అదనంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ₹4000 కోట్ల వరకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ పథకాన్ని వైసిపి ఉపయోగించుకుని, లబ్ధిదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా గందరగోళం సృష్టించారని విమర్శించారు. కొంతమంది లబ్ధిదారులు తమకు ఇచ్చిన ఇళ్ల వివరాలు కూడా తెలియక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, న్యాయబద్ధంగా పిఎంఏవై పథకం కింద లబ్ధిదారుల పేర్లతో ఇళ్లను అందజేస్తోందని, ఇది నిజమైన సుపరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వెంగలాయపాలెం ఫేజ్-2 కింద 832 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని, అర్బన్ ప్రాంతాల్లో ఇల్లు లేని ప్రజల సమస్యలను పరిష్కరించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రోడ్ల పక్కన, డ్రైన్ల వద్ద, ప్రభుత్వ భూముల్లో భయాందోళనలతో నివసించే ప్రజలకు ఈ ఇళ్లు శాశ్వత భరోసా కల్పిస్తాయని చెప్పారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూడటం ఎంతో సంతోషంగా ఉందని, వారి సంక్షేమం, అభివృద్ధి, సాధికారత కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.
*గుంటూరు పశ్చిమలో వేడుకగా గృహప్రవేశాల కార్యక్రమం* *గుంటూరు శివరామ్ నగర్ లో పీఎంఏవై కింద నిర్మించిన ఇంటి గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి* ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉగాది కల్లా గృహప్రవేశాలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మార్చి 30 నాటికే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఇళ్లలో ఆనందాన్ని నింపుతున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి తెలిపారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 24వ డివిజన్ శివరామ్ నగర్‌లో PMJAY పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కప్పల నాగ శ్రీమణి నిర్మించిన ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యారు. *అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ...* సొంత ఇల్లు ప్రతి సామాన్యుడి కల అని, అది ఆత్మగౌరవం, భరోసా, స్వేచ్ఛకు ప్రతీక అని, 2016లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ హౌసింగ్ పథకం కింద టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టిని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుర్తుచేశారు. ప్రతి సామాన్యుడికి సొంత ఇల్లు కల్పించి, మెరుగైన అర్బన్ జీవన ప్రమాణాలు అందించాలనే లక్ష్యంతో ఈ పథకం తీసుకువచ్చారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వ వైఫల్యాల వల్ల టిడ్కో ఇళ్ల పంపిణీ ఆలస్యమైందని, దాదాపు 90% పూర్తయిన ఇళ్లను కూడా
లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వాటి మరమ్మతుల కోసం సుమారు ₹200 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని, బ్యాంకు రుణాల భారం, పన్నుల రూపంలో లబ్ధిదారులపై ₹3000 కోట్ల భారం పడిందని పేర్కొన్నారు. అదనంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ₹4000 కోట్ల వరకు రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ పథకాన్ని వైసిపి ఉపయోగించుకుని, లబ్ధిదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా గందరగోళం సృష్టించారని విమర్శించారు. కొంతమంది లబ్ధిదారులు తమకు ఇచ్చిన ఇళ్ల వివరాలు కూడా తెలియక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, న్యాయబద్ధంగా పిఎంఏవై పథకం కింద లబ్ధిదారుల పేర్లతో ఇళ్లను అందజేస్తోందని, ఇది నిజమైన సుపరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వెంగలాయపాలెం ఫేజ్-2 కింద 832 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని, అర్బన్ ప్రాంతాల్లో ఇల్లు లేని ప్రజల సమస్యలను పరిష్కరించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రోడ్ల పక్కన, డ్రైన్ల వద్ద, ప్రభుత్వ భూముల్లో భయాందోళనలతో నివసించే ప్రజలకు ఈ ఇళ్లు శాశ్వత భరోసా కల్పిస్తాయని చెప్పారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూడటం ఎంతో సంతోషంగా ఉందని, వారి సంక్షేమం, అభివృద్ధి, సాధికారత కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.
- దారుణం.. కుటుంబమంతా ఆత్మహత్య నరసరావుపేటలో ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భోపాల్ ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తున్న సాతులూరుకు చెందిన గోపి, తన కుటుంబంతో సహా నరసరావుపేటలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి 3 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లు నిన్న మృతి చెందగా, గోపి నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.1
- Post by Syyed taher1
- . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.3
- సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.2
- నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.1
- శాసనమండలి శాసనసభ సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా హైదరాబాదులో జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ నా అభినయంతో ఆటపాటలతో ఆకట్టుకున్నారు ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు పాటకు శోభన్ బాబును అనుకరిస్తూ అదిరిపోయే స్టెప్పులు వేశారు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎమ్మెల్యే స్టెప్పులను చూసిన ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు1
- Post by Ramprasad islavath1