*పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రత మరియు హెల్మెట్ వాడకంపై అవగాహన సదస్సు* *ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 15, (గళం న్యూస్)* ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్రమణ్యం ఆదేశాల మేరకు బుధవారం కొండపల్లి మున్సపాలిటీ పరిధిలో ఉన్న పలు పాఠశాలల్లో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమైనది.కొండపల్లి డి.ఏ.వి (DAV) పబ్లిక్ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో కొండపల్లి సెక్టార్ ఎస్సై చక్రధర్ విద్యార్థులకు రోడ్డు నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సెక్టర్ ఎస్సై రవి వర్మ పాల్గొని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రాణాపాయం నుండి ఎలా తప్పించుకోవచ్చో వివరించారు.చిన్న వయస్సు నుండే విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని, తమ కుటుంబ సభ్యులకు కూడా హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు కోరారు. *గళం న్యూస్ రిపోర్టర్ వేముల నాగరాజు..✍️*

- జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని, వారిని ఇబ్బందులకు గురిచేయకూడదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం కాటారం మండలం ధన్వాడలోని తన స్వగృహంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు.1
- నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.2
- పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.2
- పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌డివిజన్‌లో ఈ నెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఐదు జిల్లాల నుంచి సుమారు లక్ష మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదికల కోసం కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో కలిసి కాటారం, మహాదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు.1
- జీతం పెంచాలని కోరినందుకు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ రాంప్రసాద్పై యజమానులు అనిల్రెడ్డి, బాలరాజు దాడికి పాల్పడ్డారు. దీనిని నిరసిస్తూ తోటి డ్రైవర్లు బస్సులు నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్పై దాడిని సీపీఐ నేత గడిపే మల్లేశం ఖండించారు. కార్మికులపై ఇలాంటి దాడులు సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో హుస్నాబాద్ డిపో వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.1
- Post by Bondhu Suresh1