logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

17 మంది గిరిజనులకు పట్టాల ఉన్నవారికి భూమిని అప్పగిస్తామని ఏపీ ఎం ఐపీ దగ్గర కొనుగోలు చేసుకున్న రాధిక ఇండస్ట్రియల్ 64 ఎకరాల్లో జరుగుతున్నపనులు ఆటంకం పెట్టడం తగదని తాసిల్దార్ అజూరఫిజాన్ గిరిజనులకు సూచించారు. గురువారం కాకర్లవలస కారేడు వలస గ్రామాల్లో ఏపీ ఎమ్ఐపి వాళ్లు తీసుకొన్న భూములలో సమావేశం ఏర్పాటు చేశారు. 2019లో కోఆర్డినేషన్ ద్వారా ఫారెస్ట్ వాళ్ళు పట్టాలు ఇచ్చి ఉన్నారని, పట్టాలి ఇచ్చిన ప్రకారం భూమి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పుల్లేరు గుడ్డి వలస నెలు పర్తి పంచాయతీ సాలూరు మండలం నకు చెందిన సోడు పిల్లి వెంకట్రావు, సోడు పిల్లి జాబ్రి, మర్రి కర్ల తదితర గిరిజనులు కొండమీద భూమి చూపెడతా ఎలా అని ఎప్పటినుంచో మామిడి మొక్కలు తదిత పంటలు చేస్తున్నామని, ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నారని గిరిజనులు వాగ్వాదానికి దిగారు. రాధిక ఇండస్ట్రియల్ వారి పనులుపై ఆటంకపరిచిన గిరిజనులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్యామలరావు, రాధిక ఇండస్ట్రియల్ సీఈఓ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసరావు గిరిజనరైతులు తదితరులు పాల్గొన్నారు.

42 min ago
user_పెద్దింటి రామకృష్ణ
పెద్దింటి రామకృష్ణ
రామభద్రపురం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
42 min ago
b1443766-4b46-4889-83b6-ea6910305b0c

17 మంది గిరిజనులకు పట్టాల ఉన్నవారికి భూమిని అప్పగిస్తామని ఏపీ ఎం ఐపీ దగ్గర కొనుగోలు చేసుకున్న రాధిక ఇండస్ట్రియల్ 64 ఎకరాల్లో జరుగుతున్నపనులు ఆటంకం పెట్టడం తగదని తాసిల్దార్ అజూరఫిజాన్ గిరిజనులకు సూచించారు. గురువారం కాకర్లవలస కారేడు వలస గ్రామాల్లో ఏపీ ఎమ్ఐపి వాళ్లు తీసుకొన్న భూములలో సమావేశం ఏర్పాటు చేశారు. 2019లో కోఆర్డినేషన్ ద్వారా ఫారెస్ట్ వాళ్ళు పట్టాలు ఇచ్చి ఉన్నారని, పట్టాలి ఇచ్చిన ప్రకారం భూమి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పుల్లేరు గుడ్డి వలస నెలు పర్తి పంచాయతీ సాలూరు మండలం నకు చెందిన సోడు పిల్లి వెంకట్రావు, సోడు పిల్లి జాబ్రి, మర్రి కర్ల తదితర గిరిజనులు కొండమీద భూమి చూపెడతా ఎలా అని ఎప్పటినుంచో మామిడి మొక్కలు తదిత పంటలు చేస్తున్నామని, ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నారని గిరిజనులు వాగ్వాదానికి దిగారు. రాధిక ఇండస్ట్రియల్ వారి పనులుపై ఆటంకపరిచిన గిరిజనులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్యామలరావు, రాధిక ఇండస్ట్రియల్ సీఈఓ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసరావు గిరిజనరైతులు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బొబ్బిలి పట్టణంలోని మేదరబంద కాలువ కంపు కొడుతుంది. బజారు, చిన బజారు, యాతవీధి, రావువారివీధి, గౌడవీధి వీధుల మురుగునీరు ఇక్కడ కలిసి చెరువుకు వెళ్తుంది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు. మేదరబంద కాలువ దుర్వాసన
    1
    బొబ్బిలి పట్టణంలోని మేదరబంద కాలువ కంపు కొడుతుంది. బజారు, చిన బజారు, యాతవీధి, రావువారివీధి, గౌడవీధి వీధుల మురుగునీరు ఇక్కడ కలిసి చెరువుకు వెళ్తుంది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు.
మేదరబంద కాలువ దుర్వాసన
    user_B.RAJESH
    B.RAJESH
    Media company బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం.. విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.
    1
    విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం..
విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo  & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా  కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    59 min ago
  • నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.
    1
    నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు 
నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.
    user_Venkata Satyanarayana
    Venkata Satyanarayana
    Vizianagaram, Andhra Pradesh•
    23 hrs ago
  • శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.
    1
    శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో  ప్రధాన రహదారి, సెగిడివీధీలో  లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద  జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు  స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.
    1
    రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు 
రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.
    user_Prama latha
    Prama latha
    రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • వీధి పశువుల నియంత్రణకు కార్పొరేషన్ కమిషనర్ శ్రావణకుమార్ కఠిన చర్యలు శ్రీకాకుళం : రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా బాధ్యత లేకుండా పశువులను రోడ్లపై వదిలే పశువుల యజమానులతో ఇటీవల సమావేశం నిర్వహించామని, అయినా వారిధోరణిలో మార్పు లేదని, పశువులు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపై కనిపించే పశువులను పట్టుకొని నగరంలోని కాజీపేట ఏరియాకు కాకుండా నేరుగా సింహాచలం గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
    1
    వీధి పశువుల నియంత్రణకు కార్పొరేషన్ కమిషనర్ శ్రావణకుమార్ కఠిన చర్యలు
శ్రీకాకుళం : రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా బాధ్యత లేకుండా పశువులను రోడ్లపై వదిలే పశువుల యజమానులతో ఇటీవల సమావేశం  నిర్వహించామని, అయినా వారిధోరణిలో మార్పు లేదని, పశువులు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపై కనిపించే పశువులను పట్టుకొని నగరంలోని కాజీపేట ఏరియాకు కాకుండా  నేరుగా సింహాచలం గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు - మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు - శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
    1
    సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు
- మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు
- శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి
మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
    user_NANI
    NANI
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    32 min ago
  • కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నుండి నేరుగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి కి అందించే పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయం లోకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు.
    1
    కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ 
శ్రీకాకుళం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నుండి నేరుగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి కి అందించే పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయం లోకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.