Shuru
Apke Nagar Ki App…
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తహసీల్దార్ శివరామ సుబ్బయ్య హెచ్చరిక ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ప్రవేశించినా, ఆక్రమణలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వరదయ్యపాలెం తహసీల్దార్ శివరామ సుబ్బయ్య హెచ్చరించారు. స్థానిక రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 361లో ఉన్న భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఆ స్థలంలో ఎలాంటి అక్రమ ప్రవేశాలు, నిర్మాణాలు చేపట్టరాదని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో కిరణ్, తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
R Munish
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తహసీల్దార్ శివరామ సుబ్బయ్య హెచ్చరిక ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ప్రవేశించినా, ఆక్రమణలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వరదయ్యపాలెం తహసీల్దార్ శివరామ సుబ్బయ్య హెచ్చరించారు. స్థానిక రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 361లో ఉన్న భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఆ స్థలంలో ఎలాంటి అక్రమ ప్రవేశాలు, నిర్మాణాలు చేపట్టరాదని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో కిరణ్, తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *పోలీస్ ఖాకీ జులుం* నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు1
- నెల్లూరు నగరంలో మీలాడినవి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్టా నుండి గాంధీ బొమ్మ వరకు భారీ బహిరంగ ర్యాలీ ముస్లిం సోదరులు అందరు కూడా కలిసి ముస్లిం సోదరులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రశాంత ర్యాలీ కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మద్దతు తెలియజేశారు అదే క్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా తమ మత ప్రవక్త జయంతి సందర్భంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు అంతా కూడా పాల్గొని విజయవంతంగా కొనసాగించారు, ఈ ర్యాలీ దాదాపు కోటమిట్ట గాంధీ బొమ్మ జెండా వీధి పరిసర ప్రాంతాలలో సాయంత్రం 8 నుండి 9:30 వరకు కొనసాగించారు, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు, ఇటువంటి ఆటంకాలు జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైనటువంటి చర్యలను ఏర్పాటు చేశారు, పండు వాతావరణం తలపించే విధంగా కోలాహలంగా ఈ ర్యాలీని ప్రశాంతంగా కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా మద్దతుగా క్రిస్టియన్ మతానికి సంబంధించిన సోదరులందరూ భారతీయ జెండాను చేపట్టి సంఘీభావం తెలిపారు.1
- అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!2
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.1
- నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్. దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు.అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా ,అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది.దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!! నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్. దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు.అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా ,అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది.దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!1