అహుడ అభివృద్ధికి కలిసికట్టుగా అడుగులు – జిల్లా కలెక్టర్ ఆనంద్ హామీ, చైర్మన్ టి.సి.వరుణ్ సేవలకు ప్రశంసలు ఏప్రిల్ 16 అధ్యక్ష న్యూస్ అనంతపూర్: అహుడ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాలు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు పిలుపునిచ్చారు. నగరంలో ప్రజా సౌకర్యాలను మెరుగుపరచేందుకు పింక్ టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అహుడా చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు పట్టణ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. నగరంలో మౌలిక సదుపాయాల విస్తరణ, మహిళలకు అనుకూలమైన పింక్ టాయిలెట్స్ ఏర్పాటు, యువతకు ప్రోత్సాహకరంగా స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణం వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. చైర్మన్ టి.సి.వరుణ్ గారి సేవలను జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు ప్రత్యేకంగా అభినందించారు. అహుడ అభివృద్ధికి ఎప్పుడూ తమ పూర్తి సహకారం ఉంటుందని, అవసరమైన అనుమతులు తక్షణమే మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ ఆనంద్ గారిని శాలువాతో సత్కరించి, స్మారక చిహ్నం అందజేసిన అహుడా చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు. అహుడను ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఈ సమావేశం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.

- ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు1
- బుట్టా ఫౌండేషన్ నుంచి తాగునీటి సహాయం – సోగునూరు, టీఎస్ కూలూరు గ్రామాలకు ట్యాంకర్ పంపిణీ1
- వైయస్‌ఆర్‌సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.....1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- ✒️- ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్‌కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది1
- అనంవసరంగా అనంతపురంలో రాత్రి పూట తిరుగుతున్నారా? జాగ్రత్త .. తిప్పలు తప్పవు1