దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్లు పంపిణీ _ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలి – జిల్లా కలెక్టర్ మను చౌదరి మేడ్చల్–మల్కాజ్గిరి, దివ్యాంగులు ప్రభుత్వం అందించే పథకాలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఆర్థికంగా ఎదగాలని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. వారికి అవసరమైన మార్గనిర్దేశం, సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.సోమవారం అల్వాల్‌లోని సఖీ సెంటర్‌లో జిల్లా మహిళా, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మను చౌదరి 56 ట్రైసైకిళ్లు, 14 వీల్ ఛైర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శారీరకంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దివ్యాంగులు మానసిక ధైర్యంతో ముందుకు సాగి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. మానసిక ధైర్యం ఉంటే అవకలనం అడ్డంకి కాదని, అన్ని రంగాల్లో దివ్యాంగులు రాణించాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే రేపు మెరుగైన స్థాయికి చేరుకోవాలనే సంకల్పంతో ప్రయత్నిస్తే ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని తెలిపారు.దివ్యాంగులు సొంతంగా వ్యాపారం, స్టార్టప్‌లు లేదా చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే వారి పిల్లల విద్య, కెరీర్ నిర్మాణానికి అవసరమైన కౌన్సెలింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు వంటి అంశాలలో కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.ఈసారి వీల్ ఛైర్లు, ట్రైసైకిళ్లు అందని అర్హులైన వారికి తదుపరి దశలో తప్పకుండా అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్‌తో కలిసి దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్లను పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ సఖీ సెంటర్‌ను పరిశీలించి అక్కడి సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, ఆర్డీఓ ఓం ప్రకాష్, అల్వాల్ తహసీల్దార్ రాములు, డీడబ్ల్యూఓ శారద తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్లు పంపిణీ _ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలి – జిల్లా కలెక్టర్ మను చౌదరి మేడ్చల్–మల్కాజ్గిరి, దివ్యాంగులు ప్రభుత్వం అందించే పథకాలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఆర్థికంగా ఎదగాలని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. వారికి అవసరమైన మార్గనిర్దేశం, సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.సోమవారం అల్వాల్‌లోని సఖీ సెంటర్‌లో జిల్లా మహిళా, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మను చౌదరి 56
ట్రైసైకిళ్లు, 14 వీల్ ఛైర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శారీరకంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దివ్యాంగులు మానసిక ధైర్యంతో ముందుకు సాగి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. మానసిక ధైర్యం ఉంటే అవకలనం అడ్డంకి కాదని, అన్ని రంగాల్లో దివ్యాంగులు రాణించాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే రేపు మెరుగైన స్థాయికి చేరుకోవాలనే సంకల్పంతో ప్రయత్నిస్తే ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని తెలిపారు.దివ్యాంగులు సొంతంగా వ్యాపారం, స్టార్టప్‌లు లేదా చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే వారి పిల్లల విద్య, కెరీర్
నిర్మాణానికి అవసరమైన కౌన్సెలింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు వంటి అంశాలలో కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.ఈసారి వీల్ ఛైర్లు, ట్రైసైకిళ్లు అందని అర్హులైన వారికి తదుపరి దశలో తప్పకుండా అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్‌తో కలిసి దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ ఛైర్లను పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ సఖీ సెంటర్‌ను పరిశీలించి అక్కడి సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, ఆర్డీఓ ఓం ప్రకాష్, అల్వాల్ తహసీల్దార్ రాములు, డీడబ్ల్యూఓ శారద తదితరులు పాల్గొన్నారు.
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. వర్ధన్నపేట అవగాహన సదస్సులో ఏసీపీ పిలుపు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కదలాలి, పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన.: ఏసీపీ నర్సయ్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం మరియు పిల్లల భద్రతపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏసీపీ అంబటి నర్సయ్య మాట్లాడుతూ, నేటి యువత దేశానికి వెన్నెముక అని, అలవాటుగా మారే డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, తహసిల్దార్ విజయసాగర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Termites existence, not to be ignored, love your home.1
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి! వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొగరాయి ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో, సదరు వాహనదారుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తొగరాయి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.2