మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యురాలు లొంగుబాటు... అజ్ఞాతంలో మిగిలింది ముగ్గురు తెలంగాణ నేతలే నిజామాబాద్ సీపీ ఎదుట నక్కా సుశీల రాణి లొంగుబాటు తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: పోలీసుల వెల్లడి నిజామాబాద్, సెప్టెంబర్ 15 తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యురాలు నక్కా సుశీల రాణి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోయారు. సుశీల రాణి లొంగుబాటుతో రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడిందని పోలీసు అధికారులు వెల్లడించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB), గ్రేహౌండ్స్, జిల్లా పోలీసుల సమన్వయంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యల ఫలితంగా 2026లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 266 మంది అజ్ఞాత మావోయిస్టులు హింసామార్గాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 25 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు/సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 94 మంది ఏరియా కమిటీ సభ్యులు, 131 మంది సాధారణ మావోయిస్టులు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. అగ్రస్థాయి నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు పెద్ద సంఖ్యలో లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ నెట్‌వర్క్ తెలంగాణలో గణనీయంగా బలహీనపడిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు (గణపతి), జడె రత్నబాయి (సుజాత), వార్త శేఖర్ (మంగు) మాత్రమే ఇతర రాష్ట్రాల్లో అజ్ఞాతంలో పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. సుశీల రాణి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ మరింత బలహీనపడిందని పేర్కొంటూ, అజ్ఞాతంలో ఉన్న మిగిలిన నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకుని సాధారణ జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.1
- బేగంబజార్‌లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం! హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్‌ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.1
- శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలో లలిత స్తోత్రం కార్యక్రమం శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద బుధవారం లలిత స్తోత్ర కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, లలిత స్తోత్ర పారాయణం నిర్వహించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు పలువురు పాల్గొన్నారు.1
- రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో మూడవరోజు స్వామి వారి దర్శనం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- సువర్ణ శివలింగ దర్శనంతో రమణేశ్వరంలో భక్తిశోభ రమణేశ్వరం సువర్ణ శివలింగం వద్ద పెరిగిన భక్తుల రద్దీ1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- _మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, ఇన్స్పెక్టర్ రవికుమార్. గజ్వేల్: ప్రజా తెలంగాణ న్యూస్/ గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు కోరారు. మంగళవారం గజ్వేల్‌లోని కోల అభిరామ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “శాంతి సమావేశం” కార్యక్రమంలో ఆమె పాల్గొని గణేష్ మండపాల నిర్వాహకులు, యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్ని మండపాల్లో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో మహిళలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటే యువతలో బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటే మద్యం సేవించి రావడం వంటి ఆలోచనలకు దూరంగా ఉంటారని, అందువల్ల ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా నిమజ్జనాల్లో పాల్గొని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ తరఫున నిమజ్జనాల సందర్భంగా చేపట్టాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని చైర్ పర్సన్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎవరూ అనవసరంగా కేసుల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, శాంతియుతంగా నిర్వహించి గజ్వేల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ గారు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ గారు, విద్యుత్ శాఖ ఏఈ మారుతి గారు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్కర్ పద్మబాయి నర్సింగ్ గారు, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సానిటేషన్ ఇన్‌చార్జి సుధాకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని గణేష్ మండపాల యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.4