logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి వాల్మీకి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం రూ. 36,22,690/- విలువ గల 68 చెక్కులను ఆయన బాధిత కుటుంబాలకు అందజేశారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన సాగిస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనారోగ్యం, అత్యవసర వైద్య చికిత్సల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ప్రజల కష్టాలను గుర్తించి అండగా నిలిచే చేతల ప్రభుత్వమని కొనియాడారు. అర్హులైన బాధిత కుటుంబాలకు ఈ సహాయం అందేలా ప్రతి దరఖాస్తును ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తూ నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. ఆదోని ప్రజల కష్టాల్లో తోడుండడం తన బాధ్యత అని, ఏ సమస్య వచ్చినా తన క్యాంపు కార్యాలయ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. తమకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేక చొరవ చూపినందుకు గాను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి వాల్మీకికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

4 hrs ago
user_RAJU
RAJU
ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
ae18678e-11a5-464b-9870-30325ca37777

ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి వాల్మీకి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం రూ. 36,22,690/- విలువ గల 68 చెక్కులను ఆయన బాధిత కుటుంబాలకు అందజేశారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా

75339f78-2a9f-40ca-b4b3-7dfd7be45c15

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలన సాగిస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనారోగ్యం, అత్యవసర వైద్య చికిత్సల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని,

9d5e0194-4af5-4a04-b73d-adccd8ebe33d

ప్రజల కష్టాలను గుర్తించి అండగా నిలిచే చేతల ప్రభుత్వమని కొనియాడారు. అర్హులైన బాధిత కుటుంబాలకు ఈ సహాయం అందేలా ప్రతి దరఖాస్తును ప్రత్యేక శ్రద్ధతో పరిశీలిస్తూ నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. ఆదోని ప్రజల కష్టాల్లో తోడుండడం తన బాధ్యత అని, ఏ సమస్య వచ్చినా తన క్యాంపు కార్యాలయ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. తమకు

94bd6025-f8f2-4751-a7ce-8ec5badfef41

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా ప్రత్యేక చొరవ చూపినందుకు గాను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి వాల్మీకికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిలో విస్తరించి ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతం ప్రస్తుతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ రహదారి వెంట పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులవుతున్న పర్యాటకులు, అటవీ ప్రాంతంలోని అందమైన దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తూ సందడి చేస్తున్నారు.
    1
    నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిలో విస్తరించి ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతం ప్రస్తుతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ రహదారి వెంట పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి.

ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులవుతున్న పర్యాటకులు, అటవీ ప్రాంతంలోని అందమైన దృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తూ సందడి చేస్తున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి పరిధిలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ బాలాజీ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వారం వారం భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాగనూలు గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు భజనలు నిర్వహించారు. వీరికి నిబంధనల ప్రకారం అల్పాహారంతో పాటు ₹2,000 పారితోషికంగా అందజేశారు. ఈ వారం కార్యక్రమానికి స్థానిక శివాలయం పూజారి శ్రీ కె.వి చక్రపాణి దాతగా వ్యవహరించారు. తన తండ్రి కీర్తిశేషులు కె.వి నరసింహారావు స్మారకార్థం ఆయన ఈ విరాళాన్ని సమర్పించారు. భజన కార్యక్రమం నిర్వహించిన నాగనూలు భజన మండలి సభ్యులకు, దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.
    1
    నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి పరిధిలోని పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ బాలాజీ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వారం వారం భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాగనూలు గ్రామానికి చెందిన భజన మండలి సభ్యులు భజనలు నిర్వహించారు. వీరికి నిబంధనల ప్రకారం అల్పాహారంతో పాటు ₹2,000 పారితోషికంగా అందజేశారు.

ఈ వారం కార్యక్రమానికి స్థానిక శివాలయం పూజారి శ్రీ కె.వి చక్రపాణి దాతగా వ్యవహరించారు. తన తండ్రి కీర్తిశేషులు కె.వి నరసింహారావు స్మారకార్థం ఆయన ఈ విరాళాన్ని సమర్పించారు. భజన కార్యక్రమం నిర్వహించిన నాగనూలు భజన మండలి సభ్యులకు, దాతకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    2 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ఈ భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం మరియు సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈ ఏడాది నిర్దేశించిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం", "పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జననాల మధ్య సరైన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం మరియు లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డిపిహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్, అలాగే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ఈ భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం మరియు సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈ ఏడాది నిర్దేశించిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం", "పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జననాల మధ్య సరైన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం మరియు లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డిపిహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్, అలాగే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • తమ ఉనికిని చాటుకోవాల్సిన దుస్థితిలో నాయక్ పోడ్ జాతి ఉందని, వారిపై సమాజం చూపిస్తున్న చిన్నచూపును ఇది స్పష్టం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో కూడా తమ కులాన్ని చేర్చడం లేదని నాయక్ పోడ్ వర్గీయులు వాపోతున్నారని ఆమె పేర్కొన్నారు. నాయక్ పోడ్ వర్గీయులను కొందరు గొండు అని, మరికొందరు కోయ నాయక్ పోడ్ అని తప్పుగా నమోదు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. ఏ జాతి వారికైనా తమ అస్తిత్వం, గౌరవం ఉంటాయని, ఈ విషయంలో వారిని మనుషులుగా గుర్తించరా? అంటూ ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
    1
    తమ ఉనికిని చాటుకోవాల్సిన దుస్థితిలో నాయక్ పోడ్ జాతి ఉందని, వారిపై సమాజం చూపిస్తున్న చిన్నచూపును ఇది స్పష్టం చేస్తోందని టీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా లెక్కల్లో కూడా తమ కులాన్ని చేర్చడం లేదని నాయక్ పోడ్ వర్గీయులు వాపోతున్నారని ఆమె పేర్కొన్నారు.

నాయక్ పోడ్ వర్గీయులను కొందరు గొండు అని, మరికొందరు కోయ నాయక్ పోడ్ అని తప్పుగా నమోదు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత తప్పుబట్టారు. ఏ జాతి వారికైనా తమ అస్తిత్వం, గౌరవం ఉంటాయని, ఈ విషయంలో వారిని మనుషులుగా గుర్తించరా? అంటూ ఆమె తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    15 hrs ago
  • వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ నూతన టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా డీసీసీబీ ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డికి సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన వర్గీయులు, అనుచరులు బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో బాణాసంచా పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా రితేశ్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు మంచూరి సూర్యనారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ఆయన అనుచరులు బద్వేలులో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
    1
    వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ నూతన టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా డీసీసీబీ ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డికి సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన వర్గీయులు, అనుచరులు బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో బాణాసంచా పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

గతంలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా రితేశ్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు మంచూరి సూర్యనారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ఆయన అనుచరులు బద్వేలులో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా ఎస్.పి. నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇతర ప్రతినిధులతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మండలం మానిక్‌గూడ, వాంకిడి మండలం కోమటిగూడ గ్రామాల్లో రూ. 20 లక్షల చొప్పున నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ భవనాలు ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తాయని, పంచాయతీలు పారదర్శక సేవలకు కేంద్రాలుగా మారాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని ప్రారంభించిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే, నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఇదే సమయంలో కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి చెందిన పోడు రైతులు తమ భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, సాగులోకి వెళ్లకుండా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, 2005 సంవత్సరానికి ముందు నుంచి సాగు చేస్తున్న పాత పోడు భూముల విషయంలో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని అధికారులను ఆదేశించారు. అయితే కొత్తగా అటవీ భూములను ఆక్రమించవద్దని స్పష్టం చేస్తూ, ఈ భూ సమస్యపై జిల్లా, అటవీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి చట్టపరమైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. భూములు, ఆస్తుల కంటే పిల్లల చదువే నిజమైన ఆస్తి అని, వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం తల్లిదండ్రుల బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
    1
    ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా ఎస్.పి. నితికా పంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఇతర ప్రతినిధులతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మండలం మానిక్‌గూడ, వాంకిడి మండలం కోమటిగూడ గ్రామాల్లో రూ. 20 లక్షల చొప్పున నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ భవనాలు ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తాయని, పంచాయతీలు పారదర్శక సేవలకు కేంద్రాలుగా మారాలని అధికారులను ఆదేశించారు.

మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని ప్రారంభించిన ఆయన, మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ, సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే, నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

ఇదే సమయంలో కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి చెందిన పోడు రైతులు తమ భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, సాగులోకి వెళ్లకుండా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, 2005 సంవత్సరానికి ముందు నుంచి సాగు చేస్తున్న పాత పోడు భూముల విషయంలో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టవద్దని అధికారులను ఆదేశించారు. అయితే కొత్తగా అటవీ భూములను ఆక్రమించవద్దని స్పష్టం చేస్తూ, ఈ భూ సమస్యపై జిల్లా, అటవీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి చట్టపరమైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. భూములు, ఆస్తుల కంటే పిల్లల చదువే నిజమైన ఆస్తి అని, వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం తల్లిదండ్రుల బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
    user_NAVADEEP
    NAVADEEP
    Nagarkurnool, Telangana•
    5 hrs ago
  • తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరియు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో వారు ఆసుపత్రిలోని వివిధ బ్లాక్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. అనంతరం, వారు ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ బ్లాక్‌ను కూడా ప్రత్యేకంగా పరిశీలించారు.
    1
    తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరియు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో వారు ఆసుపత్రిలోని వివిధ బ్లాక్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. అనంతరం, వారు ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ బ్లాక్‌ను కూడా ప్రత్యేకంగా పరిశీలించారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    16 hrs ago
  • రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని ఏఆర్‌కే బంకెట్ సమీపంలో పూర్తిగా ఎండిపోయిన ఒక చెట్టు అత్యంత ప్రమాదకరంగా నిలిచింది. ఈ రహదారి గుండా నిత్యం భారీగా రాకపోకలు సాగుతుండటంతో, బలమైన గాలులు వీచే సమయంలో ఈ చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు, బాటసారులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా ఆ ఎండిన చెట్టును తొలగించాలని స్థానికులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని ఏఆర్‌కే బంకెట్ సమీపంలో పూర్తిగా ఎండిపోయిన ఒక చెట్టు అత్యంత ప్రమాదకరంగా నిలిచింది. ఈ రహదారి గుండా నిత్యం భారీగా రాకపోకలు సాగుతుండటంతో, బలమైన గాలులు వీచే సమయంలో ఈ చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు, బాటసారులు, వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా ఆ ఎండిన చెట్టును తొలగించాలని స్థానికులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_S M S R R
    S M S R R
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులోని ఐదుకల్లు రోడ్డులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో చిరుతపులి ఆవుపై దాడి చేసి చంపివేసింది. ఈ ఘటనపై బాధిత రైతు రమేష్ వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుత దాడిలో మృతి చెందిన ఆవును పరిశీలించారు. అనంతరం ఆవు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చిరుత ఆచూకీ కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులోని ఐదుకల్లు రోడ్డులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో చిరుతపులి ఆవుపై దాడి చేసి చంపివేసింది. ఈ ఘటనపై బాధిత రైతు రమేష్ వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుత దాడిలో మృతి చెందిన ఆవును పరిశీలించారు. అనంతరం ఆవు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చిరుత ఆచూకీ కోసం ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.