క్రమశిక్షణ కలిగిన విద్యుతో మెరుగైన సమాజం బిషప్ రాయరాల విజయ్ కుమార్ భావితరాలకు బాటలు వేసే మెరుగైన సమాజం కోసం క్రమశిక్షణ కలిగిన విద్యఅవసరమని శ్రీకాకుళం నేత్రాసనం బిషప్ రాయరాల విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్సిఎం చర్చి ప్రాంగణంలో లోడ్ మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బిషప్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు భవిష్యత్తుకు అవసరమైన పాఠ్యాంశాలను ఇంగ్లీష్ మీడియం ద్వారా అందజేసేందుకు తమ పాఠశాలల ద్వారా కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సహకారం అందించాలని తద్వారా మంచి విద్యను అందజేసేందుకు మార్గం సులభతరమవుతుందన్నారు.దశాబ్దాల కాలంగా వేలాదిమందిని విజయవంతులుగా తీర్చిదిద్ది ఉన్నత సమాజం కోసం కృషి చేసిన ఘనత ఆర్.సి.యం పాఠశాలలకు దక్కుతుందన్నారు. అనంతరం ప్రముఖులు మాట్లాడుతూ విద్య సమాజానికి ఎంత అవసరమో అలాగే క్రమశిక్షణ తో జీవితం ఎంత మెరుగుపడుతుందో తెలియజేశారు. అనంతరం బిషప్ రాయరాల విజయ్ కుమార్ కు దుస్సాలువతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ టి డొమినిక్, దూసి దేవరాజ్,పి సుందరరావు ,స్లీవరాజ్, అల్ఫోన్స్ అతిధులుగా వచ్చారు.

- Post by APPARAO KONCHADA1
- చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.1
- సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.4
- పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.1
- కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.1
- జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.1
- Post by APPARAO KONCHADA1