Shuru
Apke Nagar Ki App…
ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు: శ్రీ చైతన్య యాజమాన్యానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరిక హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ చైతన్య కళాశాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. పత్రికల్లో ర్యాంకుల పేరుతో ప్రకటనలు ప్రచురిస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నేరుగా కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Jeetender
ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు: శ్రీ చైతన్య యాజమాన్యానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరిక హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ చైతన్య కళాశాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. పత్రికల్లో ర్యాంకుల పేరుతో ప్రకటనలు ప్రచురిస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నేరుగా కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- *అరుదైన గుండె లోపాలతో బాధపడుతున్న 8 నెలల ఆఫ్రికా చిన్నారికి అత్యాధునిక గుండె శస్త్రచికిత్స ద్వారా పునర్జన్మ అందించిన మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైద్యులు*1
- UPI చెల్లింపులకు నో ఛార్జీ కేంద్రం క్లారిటీ... ₹3వేలు దాటిన UPI చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(MDR) వసూలు చేస్తారనే ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. డిజిటల్ చెల్లింపులు ఫ్రీగానే కొనసాగుతాయని తెలిపింది. BHIM-UPI, UPI క్యూఆర్, రూపే డెబిట్ కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జ్ ఉండదని స్పష్టం చేసింది. అయితే వాలెట్ల ద్వారా UPIతో జరిపే ₹2వేల పైన వ్యాపార లావాదేవీలకు 1.1% ఛార్జ్ ఉంటుంది. రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులకూ MDR వర్తిస్తుంది.1
- పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు రోడ్డు విస్తరణ పనులు... దుమ్ములేస్తూ వాహనదాలకు ఇక్కట్లు ఇస్నాపూర్‌లో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనుల కారణంగా నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా భారీ వాహనాలు వెళ్లే సమయంలో ఎగిసిపడుతున్న దుమ్ము, దూళితో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి దుమ్ము నివారణకు నీరు చల్లాలని స్థానికులు కోరుతున్నారు.2
- ఆర్డీవో ఆకస్మిక తనిఖీ.. ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలని ఆదేశం రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం మెదక్ ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన ఆమె ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పనులను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పిస్తూ, ఎలాంటి పొరపాట్లు లేదా ఫిర్యాదులకు తావులేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- కమలానగర్‌లో మ్యాన్‌హోల్ పొంగిపొర్లి రోడ్డుపై మురుగునీరు డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్ ప్రాంతంలో మ్యాన్‌హోల్ నుంచి మురుగునీరు పొంగిపొర్లి రోడ్డుపై పారుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై మురుగునీరు నిలిచి ఉండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి కారణంగా ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతుండడంతో నివాసితులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మ్యాన్‌హోల్ సమస్యను పరిష్కరించి, మురుగునీరు రోడ్డుపై పారకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.1
- దసరా కానుకగా 2BHK ఇళ్లు...... దసరా నాటికి పేదలకు 2BHK ఇళ్ల పంపిణీ లక్ష్యంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. HYD, RR, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నిలిచిపోయిన 21,323 గృహాల నిర్మాణాలను SEP15లోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం హామీ ఇవ్వగా, లబ్ధిదారులకు ఉపాధికి భంగం కలగకుండా నివాస ప్రాంతానికి 5KM పరిధిలోనే ఇళ్ల కేటాయింపునకు చర్యలు చేపట్టింది.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- ప్రభుత్వ సంస్థలకు ఒకే వర్గం పేర్లు సరికావు : తీన్మార్ మల్లన్న తెలంగాణలో ప్రభుత్వ సంస్థలు, ప్రాజెక్టులకు ఒకే వర్గానికి చెందిన నాయకుల పేర్లు పెట్టడం సరికాదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. సనత్‌నగర్‌లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు మర్రి చెన్నారెడ్డి పేరు కాకుండా తెలంగాణ వీరుడు పండుగ సాయన్న లేదా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి సేవలందించిన మహనీయుల పేర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో బీసీలకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని, బీసీల పట్ల వివక్ష కొనసాగితే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.1