logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొత్తగూడెంలో వైభవంగా మహంకాళి అమ్మవారి రథోత్సవం.. ఆషాఢ మాస బోనాల సమర్పణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...... స్లగ్: కొత్తగూడెంలో వైభవంగా మహంకాళి అమ్మవారి రథోత్సవం.. యాంకర్ వాయిస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు, డోలు కళాబృందాలు, స్థానిక శివసత్తుల పూనకాలు, కళాకారుల విచిత్ర వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆషాఢ మాస బోనాల జాతర సందర్భంగా బూడిదగడ్డ బస్తీలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని రథంపై ప్రతిష్ఠించి ఘనంగా రథోత్సవాన్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు, డోలు మేళాలు, స్థానిక శివసత్తుల పూనకాలు, కళాకారుల విన్యాసాలు, విచిత్ర వేషధారణలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. ఆలయ ప్రాంగణంలో కళాకారులు తమ సాంప్రదాయ కళా ప్రదర్శనలతో భక్తులను అలరించారు. అనంతరం అమ్మవారి రథోత్సవం పట్టణ ప్రధాన వీధుల గుండా అట్టహాసంగా సాగింది. డప్పు, డోలు వాయిద్యాల నాదం, శివసత్తుల విన్యాసాలు, కళాబృందాల ప్రదర్శనల మధ్య సాగిన ఈ రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగస్టు 2వ తేదీన చండీ హోమం నిర్వహిస్తారు.

16 hrs ago
user_Shekar Thaduri
Shekar Thaduri
ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
16 hrs ago

కొత్తగూడెంలో వైభవంగా మహంకాళి అమ్మవారి రథోత్సవం.. ఆషాఢ మాస బోనాల సమర్పణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...... స్లగ్: కొత్తగూడెంలో వైభవంగా మహంకాళి అమ్మవారి రథోత్సవం.. యాంకర్ వాయిస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆషాఢ మాస బోనాల జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు, డోలు కళాబృందాలు, స్థానిక శివసత్తుల పూనకాలు, కళాకారుల విచిత్ర వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆషాఢ మాస బోనాల జాతర సందర్భంగా బూడిదగడ్డ బస్తీలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని రథంపై ప్రతిష్ఠించి ఘనంగా రథోత్సవాన్ని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డప్పు, డోలు మేళాలు, స్థానిక శివసత్తుల పూనకాలు, కళాకారుల విన్యాసాలు, విచిత్ర వేషధారణలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. ఆలయ ప్రాంగణంలో కళాకారులు తమ సాంప్రదాయ కళా ప్రదర్శనలతో భక్తులను అలరించారు. అనంతరం అమ్మవారి రథోత్సవం పట్టణ ప్రధాన వీధుల గుండా అట్టహాసంగా సాగింది. డప్పు, డోలు వాయిద్యాల నాదం, శివసత్తుల విన్యాసాలు, కళాబృందాల ప్రదర్శనల మధ్య సాగిన ఈ రథోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగస్టు 2వ తేదీన చండీ హోమం నిర్వహిస్తారు.

More news from తెలంగాణ and nearby areas
  • *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯 మూడు ప్రధాన పార్టీలకు మూడు షేర్ల నీళ్ళు తాగించింది అప్పుడే మర్చిపోయారా..??? ఒకవేళ మర్చిపోయి ఉంటే...ఈ సారి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి సిద్ధంగా ఉండండి🌊🌊🌊 WGL- NLG-KMM గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వార్ వన్ సైడ్...అది తీన్మార్ మల్లన్న సైడ్🔥
    1
    *వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯
*వరంగల్ - నల్గొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్స్* గడ్డ తీన్మార్ మల్లన్న అడ్డరా బై💯
మూడు ప్రధాన పార్టీలకు మూడు షేర్ల నీళ్ళు తాగించింది అప్పుడే మర్చిపోయారా..???
ఒకవేళ మర్చిపోయి ఉంటే...ఈ సారి మూడు చెరువుల నీళ్ళు తాగడానికి సిద్ధంగా ఉండండి🌊🌊🌊
WGL- NLG-KMM గ్రాడ్యుయేట్స్ ఎన్నికల వార్ వన్ సైడ్...అది తీన్మార్ మల్లన్న సైడ్🔥
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన.. మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.
    1
    మహబూబాబాద్ లోని 22వ వార్డ్ లో రోడ్లు వేయాలని సిపిఐ వినూత్న నిరసన..
మహబూబాబాద్‌లోని 22వ వార్డులో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో కాలనీలో వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని సీపీఐ శ్రేణులు కోరారు.
    user_మానుకోట వార్తలు
    మానుకోట వార్తలు
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
    1
    ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    1
    భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    20 min ago
  • రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం.... రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపిన కారేపల్లి సిఐ సాగర్.. రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారం తీరున కనిపించేలా తయారు చేస్తారు అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలలో తాకట్టు పెట్టి రుణాలు పొందుతారు ఈ విధంగా ప్రవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడంలో ఈ ముఠా రూటే సపరేటు.. సిఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం... రామ్ చందర్ అనే వ్యక్తి తన ఏజెంట్ అయిన సునీల్ ను ఇల్లందులోని ఒక ముత్తూట్ ఫైనాన్సులో 52 గ్రాముల బంగారం పెట్టించి (390000) ఋణం తీసుకున్నారు దానిని విడిపించేందుకు మరో ప్లాన్ చేశారు... ఈసారి ఏకంగా ఈ నకిలీ బంగారం విడిపించేందుకు హైదరాబాదుకు చెందిన మరో కంపెనీని మోసం చేసే ఎత్తుగడ వేశారు.. అందులో భాగంగా హైదరాబాదులోని మన గోల్డ్ కంపెనీని సంప్రదించి వారి యొక్క ప్రతినిధి ద్వారా 5 లక్షల 80 వేల రూపాయలు సునీల్ తీసుకొని కారేపల్లి మండల సమీపంలో అతని నమ్మించి మోసం చేసి పారిపోయాడు.. దీనితో ఆ సంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా కారేపల్లి పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్టు చేయడoతో ఈ నకిలీ బంగారం విషయాలు వెలుగులోకి వచ్చాయి.. కారేపల్లి మండలం భాగ్యనగర్ కు చెందిన గుగులోతు సునీల్ కుమార్ ను ఇప్పటికే రిమాండ్ చేయగా మరొకరు రామ్ చందర్ ను విలేకరుల సమావేశంలో చూపించారు.. పరారీలో ఉన్న సూర్య తండా కు చెందిన రాకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని కారేపల్లి పోలీసులు తెలిపారు.. నిందితులు అంత సులువుగా నకిలీ బంగారం తనకా పెడుతున్నరూ అంటే దీని వెనుక ఫైనాన్సర్ సంస్థలలో ఉన్న కొందరి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టేముందు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత బంగారు ఆభరణాల స్వచ్ఛతను కచ్చితంగా పరీక్షించుకోవాలని అనుమానాధస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల సమాచారం ఉంటే తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
    1
    రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు....
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం....
రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపిన కారేపల్లి సిఐ సాగర్..
రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారం తీరున కనిపించేలా తయారు చేస్తారు అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలలో తాకట్టు పెట్టి రుణాలు పొందుతారు ఈ విధంగా ప్రవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడంలో ఈ ముఠా రూటే సపరేటు..
సిఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం... రామ్ చందర్ అనే వ్యక్తి తన ఏజెంట్ అయిన సునీల్ ను ఇల్లందులోని ఒక ముత్తూట్ ఫైనాన్సులో 52 గ్రాముల బంగారం పెట్టించి  (390000) ఋణం తీసుకున్నారు దానిని విడిపించేందుకు మరో ప్లాన్ చేశారు... ఈసారి ఏకంగా ఈ నకిలీ బంగారం విడిపించేందుకు హైదరాబాదుకు చెందిన మరో కంపెనీని మోసం చేసే ఎత్తుగడ వేశారు.. అందులో భాగంగా హైదరాబాదులోని మన గోల్డ్ కంపెనీని సంప్రదించి వారి యొక్క ప్రతినిధి ద్వారా 5 లక్షల 80 వేల రూపాయలు సునీల్ తీసుకొని కారేపల్లి మండల సమీపంలో అతని నమ్మించి మోసం చేసి పారిపోయాడు.. దీనితో ఆ సంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా కారేపల్లి పోలీసులు పక్కా ప్రణాళికతో  నిందితులను అరెస్టు చేయడoతో ఈ నకిలీ బంగారం విషయాలు వెలుగులోకి వచ్చాయి..  కారేపల్లి మండలం భాగ్యనగర్ కు చెందిన గుగులోతు సునీల్ కుమార్ ను ఇప్పటికే రిమాండ్ చేయగా మరొకరు రామ్ చందర్ ను విలేకరుల సమావేశంలో చూపించారు.. పరారీలో ఉన్న  సూర్య తండా కు చెందిన రాకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని కారేపల్లి పోలీసులు తెలిపారు..
నిందితులు అంత సులువుగా నకిలీ బంగారం తనకా పెడుతున్నరూ అంటే దీని వెనుక  ఫైనాన్సర్ సంస్థలలో ఉన్న కొందరి  ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.
బంగారం తాకట్టు పెట్టేముందు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత బంగారు ఆభరణాల స్వచ్ఛతను కచ్చితంగా పరీక్షించుకోవాలని అనుమానాధస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల సమాచారం ఉంటే తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    12 hrs ago
  • ముల్కలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షల నగదు సహా విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. జిల్లా:భద్రాద్రికొత్తగూడెం సెంటర్:అశ్వారావుపేట స్లగ్: షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం.. లక్షల ఆస్థి నష్టం యాంకర్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షల నగదు సహా విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. మూకమామిడి గ్రామానికి చెందిన ఊకె రాజులు పూరిల్లు తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడగా, ఇల్లు పూర్తిగా కాలిపోయింది. రూ.2 లక్షల నగదు, రెండు క్వింటాళ్ల బియ్యం, టీవీ, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న సర్పంచ్ ఆదిలక్ష్మి, గ్రామ యువత బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    ముల్కలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షల నగదు సహా విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది.

జిల్లా:భద్రాద్రికొత్తగూడెం 
సెంటర్:అశ్వారావుపేట 
స్లగ్: షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం.. లక్షల ఆస్థి నష్టం 
యాంకర్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షల నగదు సహా విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది.
మూకమామిడి గ్రామానికి చెందిన ఊకె రాజులు పూరిల్లు తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడగా, ఇల్లు పూర్తిగా కాలిపోయింది. రూ.2 లక్షల నగదు, రెండు క్వింటాళ్ల బియ్యం, టీవీ, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న సర్పంచ్ ఆదిలక్ష్మి, గ్రామ యువత బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.