కడపలో మిలాద్ - ఉన్ - నబీ భారీ ర్యాలీ భారీగా పాల్గొన్న ముస్లిం సహోదరులు వైయస్సార్ కడప జిల్లా కేంద్రమైన కడప నగరంలో బుధవారం మిలాద్ ఉన్ నబీ మహా ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సోల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మర్కజి జులూస్ కమిటీ, కడప ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పీఠాధిపతి మహమ్మద్ అలీ బాగ్దాది నాయకత్వంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ స్థానిక అల్మాస్పేట నుంచి అగాడి మీదుగా బయలుదేరి చిలకల బావి పరిసర ప్రాంతం, బహదూర్ ఖాన్ మసీదు వీధి, చెన్నూరు బస్టాండ్, ఏడు రోడ్ల సర్కిల్, మద్రాస్ రోడ్డు, క్రిస్టియన్ లేన్ మీదుగా గుంత బజారులోని స్థానిక మసీదు వద్దకు చేరుకుంది . ర్యాలీ మధ్యలో మహా మహోపకారి మహా ప్రవక్త గురించి ముస్లింలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ అల్లా కృపతో మానవ మహోపకారిగా హజ్రత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భూమి పై జన్మించారన్నారు. ప్రవక్త శ్వాస, ధ్యాస కేవలం అల్లాహ్ ఆరాధన ప్రతిరోజు ఆ ఐదు పూటలా నమాజు, పరోపకారం, త్యాగం, మానవ సేవలోనే గడిచిందన్నారు. ప్రపంచానికి ఖురాన్ వంటి గ్రంథాన్ని అల్లా ప్రవక్త ద్వారా అందించారన్నారు. అందువల్ల ప్రవక్త సూచించిన సన్మార్గంలో మానవాళి తమ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వాహకులు స్థానిక గుంత బజారు మసీదులో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చాలామంది మత గురువులు, మైనార్టీ నేతలు మహా ప్రవక్త జీవిత విశేషాలు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మయానరహంతుల్లా ఖాన్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రతినిధి రఫీ ఖాన్ , వివిధ పార్టీల మైనార్టీ నాయకులు మత గురువులు పీఠాధిపతులు తదితరులు పాల్గొన్నారు.

- బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.1
- ప్రియ దైవ స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- ఏం చైర్మన్ బెజవాడ వంశికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు ఘనంగా యువ నాయకుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలం లో ఊటుకూరు గ్రామంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కోవూరు ఏఎంసి చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాకు ఎప్పుడు అండగా ఉండి యువతకు గాని మేము ఎప్పుడు యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు అలాగే యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు3
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- పట్టణ అభివృద్ధికై స్లమ్ ఏరియాల్లో సర్వే - సెప్టెంబర్ 28 చలో ఆర్డీఓ - సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో మంగళవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం పి.చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. బద్వేలు జనాభా లక్షా 50 వేలు దాటిందని, వలసలు, ప్లైవుడ్ పరిశ్రమతో స్లమ్ ఏరియాల్లో పేదలు పెరుగుతున్నా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 28 వరకు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై సర్వే చేసి, సెప్టెంబర్ 28న "చలో ఆర్డీఓ ఆఫీస్" కార్యక్రమం చేపడతామన్నారు. వామపక్షాల పోరాటంతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రజల సామాజిక, ఆర్థిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కె.శ్రీను, సుబ్బరాయుడు, రాయప్ప తదితరులు పాల్గొన్నారు.1