డబ్ల్యూ జే ఐ ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జర్నలిస్టులకు రాఖీలు కట్టిన మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ జే ఐ) ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి పాల్గొన్నారు ఈ సందర్భంగా రూరల్ సీఐ అంజలి జర్నలిస్టులందరికీ తన చేతుల మీదుగా రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సిఐ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమించే జర్నలిస్టు సోదరులకు రక్షణగా ఈ రక్షాబంధన్ వేడుకను నిర్వహించడం సంతోషకరమని ఆమె అన్నారు అనంతరం డబ్ల్యు జే ఐ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా సోదరభావానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను జర్నలిస్టులందరి సమక్షంలో సీఐ చేతుల మీదుగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో (డబ్ల్యూ జే ఐ) వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు హనుమాండ్ల రామకృష్ణారెడ్డి జిల్లా కార్యదర్శి అంబాల కుమార్ జిల్లా కోశాధికారి రాసగొల్ల సత్యనారాయణ జిల్లా కో కన్వీనర్లు పల్లె శ్రీనివాస్ గౌడ్ దొంత పురుషోత్తం తక్కలపల్లి శ్రీనివాస్ ఇరుకుల్ల శివరామకృష్ణ కొండి సాయి కిరణ్ హెచ్ ప్రవీణ్ అంగోత్ లక్ష్మణ్ ఆలకుంట్ల శ్రీనివాస్ ఈనాడు విలేఖరి రామనర్సయ్య,ఎస్ఐలు అరుణ్ కుమార్ సూరయ్య వర్కింగ్ జర్నలిస్టులు పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
డబ్ల్యూ జే ఐ ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జర్నలిస్టులకు రాఖీలు కట్టిన మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ జే ఐ) ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి పాల్గొన్నారు ఈ సందర్భంగా రూరల్ సీఐ అంజలి జర్నలిస్టులందరికీ తన చేతుల మీదుగా
రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సిఐ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమించే జర్నలిస్టు సోదరులకు రక్షణగా ఈ రక్షాబంధన్ వేడుకను నిర్వహించడం సంతోషకరమని ఆమె అన్నారు అనంతరం డబ్ల్యు జే ఐ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా సోదరభావానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను జర్నలిస్టులందరి సమక్షంలో సీఐ చేతుల మీదుగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో (డబ్ల్యూ జే ఐ) వర్కింగ్
జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు హనుమాండ్ల రామకృష్ణారెడ్డి జిల్లా కార్యదర్శి అంబాల కుమార్ జిల్లా కోశాధికారి రాసగొల్ల సత్యనారాయణ జిల్లా కో కన్వీనర్లు పల్లె శ్రీనివాస్ గౌడ్ దొంత పురుషోత్తం తక్కలపల్లి శ్రీనివాస్ ఇరుకుల్ల శివరామకృష్ణ కొండి సాయి కిరణ్ హెచ్ ప్రవీణ్ అంగోత్ లక్ష్మణ్ ఆలకుంట్ల శ్రీనివాస్ ఈనాడు విలేఖరి రామనర్సయ్య,ఎస్ఐలు అరుణ్ కుమార్ సూరయ్య వర్కింగ్ జర్నలిస్టులు పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
- భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు1
- భక్తి బావంతో ఘనంగా బోనం ఎత్తి మొక్కులు సమర్పించిన మరిపెడ మహిళలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భక్తి బావంతో మహిళలు ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు.. పసుపు, కుంకుమ, బియ్యం లతో బోనాన్ని వండి మహిళలు తలపై మోస్తూ ముత్యాలమ్మ తల్లి కి సమర్పించేందుకు బయలు దేరి ఆటపాటలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు..2
- మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ప్రైమరీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.1
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన... కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు.. అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది.. మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..1