ఉప్పల్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు _ రూ.37.10 కోట్ల నిధుల మంజూరుతో సీఎం రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందుముల పరమేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు. ఉప్పల్, కుషాయిగూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల అప్‌గ్రేడేషన్ కోసం రూ.37.10 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిన సందర్భంగా సోమవారం ఉప్పల్, ఈసీఐఎల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం ప్రత్యేక చొరవతోనే ఈ నిధులు సాధ్యమయ్యాయని తెలిపారు.నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని, స్థానిక సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా తనను లేదా పార్టీ డివిజన్ అధ్యక్షులను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి ధన్‌పాల్ రెడ్డి, పావని రెడ్డి, స్వర్ణరాజ్ శివమణి, కాంగ్రెస్ నాయకులు కొత్త అంజి రెడ్డి, సీతారామ్ రెడ్డి, రాజేందర్ తదితరులతో పాటు కాప్రా, చెర్లపల్లి, మల్లాపూర్, ఏఎస్ రావు నగర్, మీర్పేట్ హెచ్‌బీ కాలనీ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- మొక్కజొన్నలు తెచ్చి రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు అకాల వర్షాలకు మొలకలు వస్తున్నాయి ఏ రాత్రి ఏం జరుగుతుందో అని ఇక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి అత్తా కోడళ్ళు వెంటనే రావాలి అంటూ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో1
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను, బీజేపీ కార్యకర్తలను కోరారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మోడీ బహిరంగ సభలో ఆయన అన్నారు. తాను సామాన్య కార్యకర్తగా ఎదిగానని, తండ్రుల పేర్లతో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- తెలంగాణలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసన చేపట్టారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రం మద్యం తాగకున్నా 56 పైగా రీడింగ్ చూపిస్తుండటంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆర్టీసీ సేవలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1