జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జరిగిన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి ఈ సూచనలు చేశారు. ఈ సమావేశంలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్-2010 అమలు, ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, అనుమతుల జారీ ప్రక్రియపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ప్రక్రియను సులభతరం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రుల యాజమాన్యాలు ఇబ్బందులు పడకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రులను సంబంధిత అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అనుమతులను పరిశీలించిన అనంతరం మాత్రమే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్‌ఓసీలు) జారీ చేయాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలనలో ఎటువంటి జాప్యం జరగకుండా, ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, మూడు నెలల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఎదుర్కొనే సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సందేహాలు, సాంకేతిక సమస్యలు, అనుమతుల అంశాలపై మార్గదర్శకత్వం అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేందుకు ప్రైవేట్ వైద్య సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, యాక్ట్-2010 ప్రకారం అన్ని వైద్య సంస్థలు రిజిస్ట్రేషన్ పొందడం ద్వారా వైద్య సేవల నాణ్యత, పారదర్శకత మెరుగుపడతాయని ఆమె తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు వేగంగా పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ చిత్రా మిశ్రా వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీరామ్, జిల్లా ఫైర్ ఆఫీసర్ ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పోలీసు శాఖ ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ప్రధాన కార్యదర్శి మహేష్, కోశాధికారి నీలిమా, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జరిగిన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆమె అధ్యక్షత వహించి ఈ సూచనలు చేశారు. ఈ సమావేశంలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్-2010 అమలు, ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, అనుమతుల జారీ ప్రక్రియపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ప్రక్రియను సులభతరం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ఆసుపత్రుల యాజమాన్యాలు ఇబ్బందులు పడకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రులను సంబంధిత అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అనుమతులను పరిశీలించిన అనంతరం మాత్రమే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (ఎన్‌ఓసీలు) జారీ చేయాలని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలనలో ఎటువంటి జాప్యం జరగకుండా, ప్రతి దరఖాస్తును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, మూడు నెలల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా
అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఎదుర్కొనే సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సందేహాలు, సాంకేతిక సమస్యలు, అనుమతుల అంశాలపై మార్గదర్శకత్వం అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేందుకు ప్రైవేట్ వైద్య సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, యాక్ట్-2010 ప్రకారం అన్ని వైద్య సంస్థలు రిజిస్ట్రేషన్ పొందడం ద్వారా వైద్య
సేవల నాణ్యత, పారదర్శకత మెరుగుపడతాయని ఆమె తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు వేగంగా పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ చిత్రా మిశ్రా వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీరామ్, జిల్లా ఫైర్ ఆఫీసర్ ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పోలీసు శాఖ ప్రతినిధులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షురాలు ఆకుల శైలజ, ప్రధాన కార్యదర్శి మహేష్, కోశాధికారి నీలిమా, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
- కరీంనగర్ నగరానికి చెందిన చిట్టుమల్ల ఆధ్యా చైతన్య కేవలం 20 నెలల ప్రాయంలోనే అబ్బురపరిచే అద్భుత ప్రదర్శన కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మనుమరాలు అయిన ఆధ్యా, తన వయసుకు మించిన అసాధారణమైన గ్రహణశక్తి, అద్భుతమైన జ్ఞాపకశక్తి, ఉన్నత అభ్యసన నైపుణ్యాలను ప్రదర్శించింది. చిన్నారి తల్లిదండ్రులు చిట్టుమల్ల అచ్యుత్ చైతన్య మరియు ప్రశాంతి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఆధ్యా 20 నెలల వయసులోనే రవాణా, పక్షులు, జంతువులు, క్రియలు, హిందూ దేవతలు, పండ్లు, కూరగాయలు వంటి వివిధ విభాగాలకు చెందిన 30 ఫ్లాష్‌కార్డులను స్వయంగా గుర్తించి చెప్పడమే కాకుండా, 50కి పైగా ఫ్లాష్‌కార్డులను కచ్చితంగా గుర్తించి తన అద్భుతమైన గ్రహణశక్తిని, భావనాత్మక అవగాహనను నిరూపించిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె 10 శరీర భాగాలను గుర్తించి, 10 ముక్కల ఆకారాల పజిల్‌ను స్వయంగా పరిష్కరించింది. ఇది ఆమె బలమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు, దృశ్య మేధస్సు, సూక్ష్మ చలన సమన్వయాన్ని ప్రతిబింబిస్తుందని వారు పేర్కొన్నారు. ఇంత చిన్న వయసులో సాధించిన ఈ అరుదైన విజయాలు, ఆమెను అసాధారణమైన మేధో సామర్థ్యం గల ప్రతిభావంతురాలైన బాలికగా గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.2
- సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం, గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకులు, అలాగే రైతు సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు అన్నాడి మల్లారెడ్డి మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బాలకిషన్, వారికి తన సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులైన పాకాల, మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, అన్నాడి సత్యనారాయణ రెడ్డి, ఎలా శేఖర్ బాబు, రామ్ లింగా రెడ్డి కూడా పాల్గొన్నారు.1
- కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్రమంత్రి బండి సంజయ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆటోలో ప్రయాణించి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీయడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి 'స్వచ్ఛ పాఠశాల శుద్ధి కార్యక్రమం' చేపట్టారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించి 'టిఫిన్ బైఠక్' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రేకొండ నుంచి చిగురుమామిడి వరకు ఆటోలో ప్రయాణించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం చిగురుమామిడి మండలం రేకొండ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పాఠశాల పరిశుభ్రతపై చర్చించారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను శుభ్రం చేయాలని ఆయన కోరారు, ఎంపీ అయిన తర్వాత సమాజసేవకే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపారు. పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకోగా, విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని, ప్రాథమిక పాఠశాలకు తరగతి గదుల సమస్య ఉందని టీచర్లు, స్థానికులు వెల్లడించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం రూ. 5 లక్షలు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి రూ. 20 లక్షలు సాయం చేస్తానని ప్రకటించి, తొలి విడతగా రూ. 10 లక్షలు అందిస్తానని చెప్పారు. రేకొండ పాఠశాలలో టెన్త్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈసారి కూడా టెన్త్ విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని ప్రకటించారు. మోదీ 12 ఏళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానికులకు సూచిస్తూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు, మోదీ పాలనా విజయాల బుక్ లెట్లను పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ దిలీప్ తో కూడా మోదీ పాలనా విజయాలపై, ప్రజలకు ఇష్టమైన కార్యక్రమాలపై బండి సంజయ్ ఆరా తీశారు. 'స్వచ్ఛ పాఠశాల'లో భాగంగా శనివారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుద్ధి కార్యక్రమం చేపడుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. సద్ది తెచ్చుకుని స్థానికులతో కలిసి భోజనం చేసిన బండి సంజయ్, రేకొండ ప్రభుత్వ పాఠశాలలో రేపు శుద్ధి కార్యక్రమంలో పాల్గొననున్నారు.4
- తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (CITU) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఈ పిలుపులో భాగంగా, శుక్రవారం CITU ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన ప్రకారం ప్రతినెలా 1వ తేదీనే వేతనాలకు రూ.50 కోట్లు ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయించి, వేతనాలను చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పంచాయతీ సిబ్బందిని 2వ పిఆర్సీలో గుర్తించాలని కోరారు. జీవో నెం.51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, పాత కేటగిరీలను కొనసాగించాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల బకాయి వేతనాలు తక్షణమే చెల్లించి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, జిల్లా కార్యదర్శి అన్నల్దాస్ గణేష్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 2025లో ఆరు నెలల పాటు కార్మికులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం సేకరించిందని, ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా నియమించుకున్న కార్మికులకు పని భద్రత కల్పించాలని అన్నారు. 60 సంవత్సరాలు పైబడిన, అనారోగ్యం పాలైన, సహజ మరణం లేదా ప్రమాదంలో మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి పని కల్పించాలని, వారసులు లేని కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న కుటుంబ సభ్యుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసి వేతనాలు చెల్లించాలని కోరారు. కార్మికులపై వేధింపులు, ఇష్టానుసారంగా తొలగింపులను ప్రభుత్వం నిలుపుదల చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26,000/- అమలు చేయాలని, వేతనాలను గ్రీన్ ఛానెల్ ద్వారా నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన సిబ్బందికి రూ.20 లక్షల నష్టపరిహారం, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం, కార్మికులందరికీ రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు కనీసం రూ.30,000/- ఆర్థిక సహాయం అందించాలని, పంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని కూడా వారు డిమాండ్ చేశారు. అనంతరం AO, DPOలకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్కల అంజయ్య, లొకిని శ్రీనివాస్, కంసాని రవీందర్, సందేలా మహేష్, వరుకొలు మల్లయ్య, బత్తుల రమేష్, బెజగం శేఖర్, బాబు మర్రిగడ్డ, నాగరాజు కొత్తపెల్లి, అశోక్ కట్కూరు, రామదాస్ పోతూగల్ తో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు పునరుద్ఘాటించారు.2
- ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఓడవాడ ప్రాంతంలో బంగారు ఆభరణాలు శుభ్రం చేస్తానని నమ్మించి మహిళలను మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం, ఒక వ్యక్తి ఇంటింటికీ తిరుగుతూ ప్రత్యేక రసాయనాలతో బంగారు ఆభరణాలను శుభ్రం చేసి కొత్తవిగా మారుస్తానని చెప్పి మహిళల విశ్వాసం చూరగొన్నాడు. అతని మాటలు నమ్మి సుమారు 10 మంది మహిళలు తమ పట్టగొలుసులు, ఇతర బంగారు ఆభరణాలను ఆ వ్యక్తికి అందజేశారు. ఆభరణాలను శుభ్రం చేసే నెపంతో వాటిలో కొంత బంగారు భాగాన్ని అరగదీసిన ఆ వ్యక్తి, ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తమ ఆభరణాల బరువు తగ్గినట్లు గుర్తించిన మహిళలు తాము మోసపోయామని గ్రహించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు బంగారం, నగదు వంటి విలువైన వస్తువులు అప్పగించవద్దని వారు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా పోలీసులు కోరారు. ఈ మోసం ఓడవాడ ప్రాంతంలో ఆందోళన కలిగించింది.1
- కరీంనగర్ పట్టణంలో మధ్యాహ్నం వర్షం కురిసి ప్రజలకు ఉపశమనం కలిగించింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ మరియు ఉక్కపోతతో నగర ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో, ఈ వర్షం వారికి ఎంతో ఊరటనిచ్చింది. వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు ప్రవహించిందని కాలనీవాసులు తెలిపారు. డ్రైనేజీలు పొంగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.4
- కరీంనగర్ జిల్లాలోని రేకొండలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్ దిలీప్‌కు ప్రధానమంత్రి మోదీ సుదీర్ఘ పాలనా విజయాలపై రూపొందించిన పుస్తకాలను అందజేశారు. ఆటో డ్రైవర్ దిలీప్‌తో కలిసి కేంద్రమంత్రి కొత్తపల్లి వైపు ప్రయాణిస్తూ, రేకొండ నుండి చిగురుమామిడి వరకు ఆటోలో వెళ్లారు. ఈ ప్రయాణంలో కేంద్ర మంత్రి, మోదీ పరిపాలనపై ప్రజల అభిప్రాయాలను, ప్రభుత్వ కార్యక్రమాలలో వారికి బాగా నచ్చిన అంశాలను ఆటో డ్రైవర్‌ను అడిగి ఆరా తీశారు. కేంద్ర మంత్రి ఒక సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో వెళ్లిన ఈ చర్య స్థానికంగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ మరియు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న అతిథులకు ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మండపంలో వారికి వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి ఎల్. రమాదేవి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందించారు. ఏఈవో జి. అశోక్ కుమార్, ప్రోటోకాల్ మరియు ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు ఈ సందర్శనలో వారితో పాటు పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్ల గోడలు కూలిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మండలంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. దీని ప్రభావంతో, లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాలలో పలు ఇళ్ల గోడలు వర్షపు నీటికి తడిసి కూలిపోయాయి. అయితే, వర్షం పడుతున్న సమయంలో ఎవరూ ఇళ్లలో లేకపోవడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.1