పాఠశాలల అభివృద్ధికి బ్యాంకులు ముందుకు రావాలి - వేంపల్లెలో 140 మంది విద్యార్థులకు స్టూడెంట్ గిఫ్ట్ ప్యాక్స్ పంపిణీ మదనపల్లె: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి బ్యాంకులు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులను మరింతగా వినియోగించి ముందుకు రావాలని సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ పిలుపునిచ్చారు. శనివారం వేంపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 140 మంది విద్యార్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లె శాఖ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, పెన్నులు తదితర విద్యా సామగ్రితో కూడిన స్టూడెంట్ గిఫ్ట్ ప్యాక్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డాక్టర్ నున్నా అనూరాధ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గిఫ్ట్ ప్యాక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎస్‌ఆర్ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం యూనియన్ బ్యాంక్ సామాజిక బాధ్యతకు నిదర్శనమని కొనియాడారు. గతంలో కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర బ్యాంకులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల అవసరాల కోసం తమ సీఎస్‌ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, బ్యాంకు దత్తత గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వేంపల్లె ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ పవన్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ ఛత్రపాల్ రెడ్డి, సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి కరుణాకర్, మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు శకుంతల, మాధవి, శిరీష తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల అభివృద్ధికి బ్యాంకులు ముందుకు రావాలి - వేంపల్లెలో 140 మంది విద్యార్థులకు స్టూడెంట్ గిఫ్ట్ ప్యాక్స్ పంపిణీ మదనపల్లె: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి బ్యాంకులు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులను మరింతగా వినియోగించి ముందుకు రావాలని సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ నున్నా అనూరాధ పిలుపునిచ్చారు. శనివారం వేంపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 140 మంది విద్యార్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదనపల్లె శాఖ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, పెన్నులు తదితర విద్యా సామగ్రితో కూడిన స్టూడెంట్ గిఫ్ట్ ప్యాక్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డాక్టర్ నున్నా అనూరాధ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గిఫ్ట్ ప్యాక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎస్‌ఆర్ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం యూనియన్ బ్యాంక్
సామాజిక బాధ్యతకు నిదర్శనమని కొనియాడారు. గతంలో కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర బ్యాంకులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల అవసరాల కోసం తమ సీఎస్‌ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, బ్యాంకు దత్తత గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వేంపల్లె ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ పవన్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ ఛత్రపాల్ రెడ్డి, సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి కరుణాకర్, మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు శకుంతల, మాధవి, శిరీష తదితరులు పాల్గొన్నారు.
- ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా, పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా, పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది,2
- మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా... అన్నమయ్య జిల్లా. మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.1
- విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. పుంగనూరు బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని అంటున్నారు. వైయస్ జగన్ గారు పేదల కోసం అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే.. మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ? సీఆర్‌డీఏ చట్టాన్ని మీరు అసలు గౌరవిస్తున్నారా చంద్రబాబూ? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీలు మాత్రమే అమరావతిలో ఉండాలా? -దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు అమరావతి ప్రాంతంలో పేదలు ఉండకూడదని అంటున్నారు. వైయస్ జగన్ గారు పేదల కోసం అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే.. మీరు అధికారంలోకి రాగానే ఆ ఇళ్లను క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కాదా చంద్రబాబూ? సీఆర్‌డీఏ చట్టాన్ని మీరు అసలు గౌరవిస్తున్నారా చంద్రబాబూ? మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బినామీలు మాత్రమే అమరావతిలో ఉండాలా? -దేవినేని అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు1
- హాకింగ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏర్పాటు చేసినఓటుకు బయోమెట్రిక్ ను లింక్ చేయాలి : చిత్తూరు జిల్లా కుప్పం... ఓటుకు బయోమెట్రిక్ ను లింక్ చేయాలి : పాఠశాల కరస్పాండెంట్ హఫీజ్ హాకింగ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాఠశాల కోరిసాండెంట్ హఫీజ్.. పాఠశాలలో క్లాస్ లీడర్ ను ఎంచుకోవడానికి బయోమెట్రిక్ తో ఓటు వేసే విధానాన్ని ప్రాజెక్ట్ ద్వారా యాప్ ను ఇంప్లిమెంట్ చేశాం.. బయోమెట్రిక్ ను ఓటుకు లింక్ చేస్తే దొంగ ఓటు వేయడానికి వీలు లేదు కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి, ఓటుకు బయోమెట్రిక్ ను లింక్ చేయాలి రేషన్ కార్డుకు బయోమెట్రిక్ లింక్ చేసిన విధంగా ఓటుకు బయోమెట్రిక్ లింక్ చేయండి మీ ఓటు మీ బాధ్యతలో భాగంగా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేశాం విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి బయోమెట్రిక్ తో ఓటు వేసే విధంగా యాప్ ను రూపొందించారు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఓటుకు బయోమెట్రిక్ ను లింక్ చేయాలని కోరుకుంటున్నాం1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- కాణిపాకంలో టిడిపి వైసిపి నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఐరాల మండలం కాణిపాకంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య నినాదాలతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్య ప్రమాణ కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ నాయకులను ఉద్దేశించి నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1