logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు... రెహానా కమల్ ప్రతి విద్యార్థి ఎమ్మెల్యేని ఆదర్శంగా తీసుకోవాలి ఘనంగా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు పట్టణంలోని జేవియర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల వార్షికోత్సవ, క్రీడా వార్షికోత్సవం వేడుకలను గురువారం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ రెహనా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత, సింగరేణి జిఎం చింతల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి,వేడుకలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలలో వంద మంది విద్యార్థులకు యూనిఫామ్ కావాలని ఎమ్మెల్యే దంపతులను కోరగా,100 మందికే కాదు కళాశాలలో ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి యూనిఫామ్ అందజేస్తానని తెలియజేశారు. స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మాట్టా రాగమయి దయానంద్ ను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకొని,భవిష్యత్తు ఉజ్వలంగా తయారు చేసుకునేందుకు బాటలు వేసుకోవాలని తెలిపారు. కళాశాలకు కావలసిన సిసి రోడ్లు టాయిలెట్స్ నిర్మాణం జరిగిందని,అలాగే ఓపెన్ ఆడిటోరియం నిర్మాణానికి పర్మిషన్ లభించిందని,వారి త్యాగం కళాశాలకు మరువలేనిదని కళాశాల ప్రిన్సిపాల్ గోపి అన్నారు. క్రీడా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో,విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిధులు వారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం,సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

5 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
5 hrs ago
77232cbd-9afd-4bf7-8bcc-3de7c07894e8

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు... రెహానా కమల్ ప్రతి విద్యార్థి ఎమ్మెల్యేని ఆదర్శంగా తీసుకోవాలి ఘనంగా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు పట్టణంలోని జేవియర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల వార్షికోత్సవ, క్రీడా వార్షికోత్సవం వేడుకలను గురువారం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ రెహనా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత, సింగరేణి జిఎం చింతల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి,వేడుకలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలలో వంద మంది విద్యార్థులకు యూనిఫామ్ కావాలని ఎమ్మెల్యే దంపతులను కోరగా,100 మందికే కాదు కళాశాలలో ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి యూనిఫామ్ అందజేస్తానని తెలియజేశారు. స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మాట్టా రాగమయి దయానంద్ ను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకొని,భవిష్యత్తు ఉజ్వలంగా తయారు చేసుకునేందుకు బాటలు వేసుకోవాలని తెలిపారు. కళాశాలకు కావలసిన సిసి రోడ్లు టాయిలెట్స్ నిర్మాణం జరిగిందని,అలాగే ఓపెన్ ఆడిటోరియం నిర్మాణానికి పర్మిషన్ లభించిందని,వారి త్యాగం కళాశాలకు మరువలేనిదని కళాశాల ప్రిన్సిపాల్ గోపి అన్నారు. క్రీడా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో,విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిధులు వారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం,సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.
    1
    అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ​ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ​ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. "ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు." ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    1
    మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
​
మహబూబాబాద్ జిల్లా 
మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
​ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
"ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు."
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.
    1
    రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం
చేసిన గుంటూరు ఎస్పీ 
గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by JADI RAJU
    1
    Post by JADI RAJU
    user_JADI RAJU
    JADI RAJU
    Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    3
    విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి
నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 day ago
  • ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు ​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: ​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. ​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. ​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. ​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ​పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ​నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
​రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు
​గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
​అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం!
​ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు:
​అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు.
​రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు.
​అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది"
​ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.
​పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
​చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
​పాల్గొన్న నాయకులు:
ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు. ర్యాలీలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వార్డు మెంబర్ గాడిపెల్లి రాజబాబు, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు.
ర్యాలీలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వార్డు మెంబర్ గాడిపెల్లి రాజబాబు, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి
    1
    జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.  కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
మల్లు భట్టి విక్రమార్క  
ఉపముఖ్యమంత్రి
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.