అక్రమ ఇసుక తవ్వకాలు పట్టా పట్టించుకొని రెవెన్యూ మరియు పోలీసు శాఖ అక్రమ ఇసుక తవ్వకాలు.. అధికారుల మౌనం ఎందుకు? మోటుపల్లి సర్వే నంబర్లు 114, 115లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చిన్నగంజాం మండలం: మోటుపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 114, 115లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇసుకను భారీ స్థాయిలో తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయా? అనుమతులు ఎవరి పేరుతో ఉన్నాయి? ఎంత మేరకు తవ్వకాలకు అనుమతి ఇచ్చారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యపై సమగ్రంగా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించి, అక్రమాలు ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయా? అనే ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సర్వే నంబర్లు 114, 115లో జరిగిన తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ ఇసుక తవ్వకాలు పట్టా పట్టించుకొని రెవెన్యూ మరియు పోలీసు శాఖ అక్రమ ఇసుక తవ్వకాలు.. అధికారుల మౌనం ఎందుకు? మోటుపల్లి సర్వే నంబర్లు 114, 115లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు చిన్నగంజాం మండలం: మోటుపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 114, 115లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇసుకను భారీ స్థాయిలో తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాల కారణంగా వ్యవసాయ భూములు
దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయా? అనుమతులు ఎవరి పేరుతో ఉన్నాయి? ఎంత మేరకు తవ్వకాలకు అనుమతి ఇచ్చారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యపై సమగ్రంగా చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన
చేసి, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించి, అక్రమాలు ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయా? అనే ప్రశ్న స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సర్వే నంబర్లు 114, 115లో జరిగిన తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
- ఏం చైర్మన్ బెజవాడ వంశికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు ఘనంగా యువ నాయకుడు అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు విడవలూరు మండలం లో ఊటుకూరు గ్రామంలో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కోవూరు ఏఎంసి చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మాకు ఎప్పుడు అండగా ఉండి యువతకు గాని మేము ఎప్పుడు యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు అలాగే యువ నాయకుడు డాక్టర్ అర్జున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు3
- ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.1
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.1
- ప్రియ దైవ స్నేహితులారా ఏసుక్రీస్తు నామము మీ అందరికీ శుభాభివందనం1
- *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1
- పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి: మాజీ ఎమ్మెల్యే పాలేరు చెరువు నీటిపై మొదటి హక్కు పాలేరు నియోజకవర్గ రైతులదేనని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వకపోయినా నిలబడి పోరాడామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.1
- వైరల్ వీడియో రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు మహిళ ఫైర్ స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ముద్రించడంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైనా రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు చూశామా అని ప్రశ్నిస్తూ, రేపు ప్రభుత్వం మారితే ఈ కార్డుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్లపైనా ఫొటోలు వేస్తారా అని ఆమె ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం 'ఎక్స్' లో వైరల్ గా మారింది.1
- గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.4
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1