అంబేద్కర్ జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ✅ అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. ✅ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్‌బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ✅ “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించిన నాయకుడు అంబేద్కర్ గారు. మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ✅ మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని మొదట ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తే దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని చెబుతున్నారు. ✅ ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలను పెంచుతుంది. దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయి. ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారు” అని ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు. ✅ “మహిళా రిజర్వేషన్ల పెంపుపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్పిన మాటపై నిలబడే ప్రభుత్వం మాది. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. కులగణన చేస్తామని చెప్పాం. చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ✅ మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే మన సీట్లను సాధించుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం మాట్లాడగలం. మేధావులు ఆలోచన చేయాలి” అని కోరారు. ✅ దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించవచ్చని మార్గదర్శకం చేసిన మహానాయకుడు అంబేద్కర్ . విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని, సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని బలంగా విశ్వసించారు. అంబేద్కర్ గారి ఆలోచనే ప్రజాపాలన విధానం. ✅ రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మగాంధీ గారు ప్రపంచ దేశాలకు చాటిచెబితే, ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించిన వారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు. ✅ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే ముందు భాగంలో నిలిచి పోరాటం చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న, మారుమూల పల్లెల్లో జయ జయహే తెలంగాణను మారుమోగించిన అందెశ్రీ గార్లను” ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ✅ దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రిపదవులు, ఇతర పదవులు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభుత్వాలకు, ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చుకోవాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలోనే అత్యధిక ప్రాధాన్యత దక్కిందని అనేక ఉదాహరణలు చెప్పారు. ✅ కులాల మధ్యన విభజన జరుగుతుందని, సమాజంలో మరింతగా అంతరాలు పెరుగుతున్నాయని ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ✅ “రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో అత్యధికంగా దళితులకు ఇచ్చాం. 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉద్యోగాలొచ్చాయి. సివిల్ సర్వీసెస్ లో ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ అభయహస్తం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ✅ ఒకవైపు అప్పులు, తప్పులను సవరిస్తూనే రాష్ట్రంలో పరిపాలనను చక్కబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ ప్రభుత్వం మనది. ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలనను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది” అని ముఖ్యమంత్రి గారు కోరారు. ✅ ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , ధనసరి అనసూయ సీతక్క అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
అంబేద్కర్ జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ✅ అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. ✅ భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్‌బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ✅ “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించిన నాయకుడు అంబేద్కర్ గారు. మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ✅ మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని మొదట ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తే దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని చెబుతున్నారు. ✅ ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలను పెంచుతుంది. దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయి. ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారు” అని ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు. ✅
“మహిళా రిజర్వేషన్ల పెంపుపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్పిన మాటపై నిలబడే ప్రభుత్వం మాది. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. కులగణన చేస్తామని చెప్పాం. చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ✅ మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే మన సీట్లను సాధించుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం మాట్లాడగలం. మేధావులు ఆలోచన చేయాలి” అని కోరారు. ✅ దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించవచ్చని మార్గదర్శకం చేసిన మహానాయకుడు అంబేద్కర్ . విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని, సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని బలంగా విశ్వసించారు. అంబేద్కర్ గారి ఆలోచనే ప్రజాపాలన విధానం. ✅ రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మగాంధీ గారు ప్రపంచ దేశాలకు చాటిచెబితే, ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించిన వారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు. ఈ దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు. ✅ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే ముందు భాగంలో నిలిచి పోరాటం చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న, మారుమూల పల్లెల్లో జయ జయహే తెలంగాణను మారుమోగించిన అందెశ్రీ గార్లను” ఈ
సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ✅ దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రిపదవులు, ఇతర పదవులు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభుత్వాలకు, ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చుకోవాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలోనే అత్యధిక ప్రాధాన్యత దక్కిందని అనేక ఉదాహరణలు చెప్పారు. ✅ కులాల మధ్యన విభజన జరుగుతుందని, సమాజంలో మరింతగా అంతరాలు పెరుగుతున్నాయని ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ✅ “రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో అత్యధికంగా దళితులకు ఇచ్చాం. 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉద్యోగాలొచ్చాయి. సివిల్ సర్వీసెస్ లో ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ అభయహస్తం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ✅ ఒకవైపు అప్పులు, తప్పులను సవరిస్తూనే రాష్ట్రంలో పరిపాలనను చక్కబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ ప్రభుత్వం మనది. ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలనను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది” అని ముఖ్యమంత్రి గారు కోరారు. ✅ ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , ధనసరి అనసూయ సీతక్క అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
- Rajuఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణrauj2 hrs ago
- గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.1
- జగిత్యాల : జగిత్యాల నుండే కెసిఆర్ జైత్ర యాత్ర మొదలుకానుంది, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి.. కెసిఆర్ పాలనే బాగుండే అనే భావన ప్రజల్లోనుండి వచ్చిందనీ, కేసీఆర్ తో ప్రయాణం కొత్త అనుభూతి అన్నారు. జగిత్యాల పట్టణంలోని జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ హరిచరన్ రావు స్వగృహం విద్యానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి...మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కే. రవీందర్, స్థానిక నాయకులు వి. పురుషోతం రావు, వెంకట రావు, ధర్మాజిపేట్ వెంకటేశ్వర్ రావు, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తదితర బీ ఆర్ ఎస్ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ లోకి రావడం అదృష్టమనీ, మనస్పూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నామన్నారు. నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు, నిబద్ధతగల నాయకులు జీవన్ రెడ్డి కి అందరం సహకరిస్తాంమనీ,..పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు తోడుంటామన్నారు.. జీవన్ రెడ్డి రాకతో బీ ఆర్ ఎస్ కు కొండంత అండగా దొరికింది. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయం అనీ..అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో ముందుకు సాగుదాం అన్నారు. కేసీఆర్ తో అనుబంధం ఈనాటిది కాదు.. తెలంగాణ ఉద్యమ సారధిగా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం కెసిఆర్ దశాబ్దకాలం కృషిచేశారు. రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలని దిగువన మేడిగడ్డ వద్ద 300 టీ ఎం సి ల నీటి లభ్యత ఉంటుందని బ్యారేజీల నిర్మాణం చేపట్టారు.నీటి వనరులతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్, హర్యానాతో పోటీ పడుతున్నాం. ఎస్ ఎల్ బి సి నిర్మాణ దశలో కుంగి పోయి కార్మికులు మృతి చెందినా, వారిశవాలుసైతం వెలికి తీయకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారు....కానీ, మేడిగడ్డ పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నంలో భాగంగా బ్యారేజ్ ల మరమతులు చేపట్ట లేదని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవడం సంతోషం.. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల్లో వచ్చిన ఆలోచన.. కెసిఆర్ ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ 50 వేల నుండి లక్షకు పెంచారు. కేసీఆర్ 10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు. కాంగ్రెస్ 15 వేలు అని చెప్పి అసలుకే మోసం వచ్చింది. కరువు వస్తె రేవంత్ రెడ్డి బాధ్యులు అవుతారు. బోర్నపల్లి వంతెన కు కేసీఆర్ 70 కోట్లు మంజూరు చేశారు.కేసీఆర్ కు రుణపడి ఉంటా..2
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.1
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1
- నెరడిగొండ మండల కేంద్రంలో రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బోరును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు. భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు.1
- గన్నేరువరం: ఈనెల 23వ తేదీన గన్నేరువరంలో జరుగు హిందూ సమ్మేళన సభలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో జై హనుమాన్ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఖండ గన్నేరువరం ఉప మండలంలో జరుగు హిందూ సమ్మేళనానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి గన్నేరువరం సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందువులు కులాలకతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ఈనెల 23వ తేదీన గన్నేరువరం లో జరుగు హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ముత్యాల జగన్ రెడ్డి, తిప్పర్తి నికేష్, విలాసాగరం రామచంద్రం, కాంతాల అంజిరెడ్డి సర్పంచ్ రంగన్న వేణి లచ్చినరుసు ఉప సర్పంచ్ రామంచ స్వామి అధిక సంఖ్యలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా… జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ హైవేపై మంచినీళ్ల బావి వద్ద వంతెన నిర్మాణ పనులు జరుగుతున ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించరు. పనుల సమయంలో వాహన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు , ట్రాఫిక్ సజావుగా నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ముఖ్య రహదారిపై ఉండటంతో రోజువారీ వాహన రాకపోకలు అధికంగా ఉంటాయి కావున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు తెలిపిన ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు, వాహన దారులు అనుసరించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తాత్కాలిక మార్పులు ఉండటంతో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతున ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రాత్రి సమయంలో రిఫ్లెక్టివ్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.1