logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతున్న అక్రమార్కులు , చోద్యం చూస్తున్న అధికారులు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆవేదన* జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు. ​చింతూరు బుధవారం- 15/04/2026 ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన చట్టాల అమలులో యంత్రాంగం వైఫల్యం చెందుతోందని, తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ చేసింది. బుధవారం చింతూరు ఐటీడీఏలో నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ మరియు పీఓకు సంఘం నేతలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చింతూరు మండలం చిడుమూరు పంచాయతీలో గ్రామసభల తీర్మానాలకు వ్యతిరేకంగా అక్రమ మైనింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎర్రంపేటలో హైకోర్టు స్టే ఉన్నప్పటికీ యథేచ్ఛగా అక్రమ భూ బదలాయింపులు, భవన నిర్మాణాలు చేపడుతూ కోర్టు దిక్కరణకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎటపాక మండలం లక్ష్మీదేవిపేట రెవెన్యూ పరిధిలో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని నాన్-ట్రైబల్స్ కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ​మరోవైపు, నకిలీ గుర్తింపు కార్డులతో సబ్సిడీ పేరుతో ఎటపాక మండలం చెన్నంపేట గ్రామానికి చెందిన పూనెం వీరస్వామి వంటి అమాయక ఆదివాసీలను మోసం చేస్తున్న పండ వరలక్ష్మి , పండ పోతురాజు దొర బృందంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అలాగే సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా ఇవ్వని వీఆర్ పురం తహసీల్దార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తూ, అక్రమ కట్టడాలను తొలగించాలని, నిబంధనలకు విరుద్ధంగా నాన్-ట్రైబల్స్‌కు విద్యుత్ మీటర్లు జారీ చేయవద్దని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎల్.టి.ఆర్.పి (LTRP) సెక్షన్ 3(1), 3(5), 6A ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పూనెం వీరస్వామి, కారం వెంకటేశ్వర్లు, తెల్లం సత్యనారాయణ, సొందే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

11 hrs ago
user_Sode Prasad
Sode Prasad
Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
11 hrs ago
dbb2a12e-7e13-43f2-8932-b70087a7dc1b

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
    2
    రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, జేసీ బచ్చు స్మరణ్ రాజ్ అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. కేవలం రూ.5లకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తెచ్చారన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి
    1
    జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.  కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
మల్లు భట్టి విక్రమార్క  
ఉపముఖ్యమంత్రి
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
    2
    పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కు పైరాలసిస్ (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిందనీ విషయం తెలుసుకుని అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ బాధితుడిని పరామర్శించి మనో ధైర్యం చెప్పి రామకృష్ణ కుటుంబం  ఇబ్బందుల్లో ఉన్నట్టు గమనించి అక్షయ్ ఫౌండేషన్ చైర్మన్ ముదర సోమరాజు వారికి మన ఊరు మనందరి బాధ్యత సభ్యుల  సహాయ సహకారాలతో 26 కేజీల బియ్యం , నెలకు సరిపడ నిత్యావసర సరుకులు మరియు పండ్లను వారికి అందజేయటం జరిగింది. బాధితుడికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న  అక్షయ్ ఫౌండేషన్ అండగా ఉంటుందనీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన పీతల సత్యనారయణ, 
విఆర్ఓ పార్వతి,పీతల అశోక్, మెకానిక్ వీరబాబు సంస్థ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసబోయిన అర్జునరావు,మాకా శ్రీను,బళ్ల సురేష్, పులుగు కుమార్,నున్న వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    13 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • monthly Passive income Start Cheyandi
    1
    monthly Passive income 
Start Cheyandi
    user_Siddu
    Siddu
    Business Networking Company పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.
    1
    40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో  ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి.
నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు.
పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు.
ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.