తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి – హలో బీసీ.. చలో భువనగిరి” మహాసభ పోస్టర్‌ను సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదం రజనీకుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షుడు దండు వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జరగనున్న ఈ మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొడూరి శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆరుకల రమేష్, మహిళా పట్టణ అధ్యక్షురాలు బిట్ల జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి నరేందర్, మండల అధ్యక్షుడు మొగిళ్ల బాబు, కొంకటి శ్రీధర్, చెన్నోజి విద్యాసాగర్, దూడం సత్యం, గాంధీబాబు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి – హలో బీసీ.. చలో భువనగిరి” మహాసభ పోస్టర్‌ను సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదం రజనీకుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షుడు దండు వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ
సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జరగనున్న ఈ మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని
వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొడూరి శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆరుకల రమేష్, మహిళా పట్టణ అధ్యక్షురాలు బిట్ల జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి నరేందర్, మండల అధ్యక్షుడు మొగిళ్ల బాబు, కొంకటి శ్రీధర్, చెన్నోజి విద్యాసాగర్, దూడం సత్యం, గాంధీబాబు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
- కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ నివాసి, ఆటో డ్రైవర్ భూక్యా లాలు కుమార్తె వెన్నెల వివాహం ఈ నెల 25న జరగనున్న సందర్భంగా, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరదాసు వసంతరావు నేడు వారికి రూ. 5016 ఆర్థిక సహాయం అందించారు. గత నెలలో ఆటో యూనియన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆటో కార్మికుల ఆడపిల్లల వివాహాలకు రూ. 5000 ఆర్థిక సహాయం అందిస్తానని వసంతరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, కోతిరాంపూర్ కు చెందిన భూక్యా సత్తమ్మ, లాలు దంపతుల కుమార్తె వివాహం నిశ్చయమైనట్లు తెలుసుకున్న వసంతరావు, వారి ఇంటికి వెళ్లి మేనమామగా ఈ మొత్తాన్ని అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. కరీంనగర్ నగరానికి చెందిన ఏ ఆటో కార్మికుల కుమార్తె వివాహం చేసినా, తనను సంప్రదించి రూ. 5016 ఆర్థిక సహాయాన్ని పొందవచ్చని వసంతరావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నరదాసు వసంతరావు చేసిన ఈ సహాయానికి కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరదాసు వసంతరావుతో పాటు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఆటో యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అఫ్రోజ్ ఖాన్, ఆరే రవి, ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, ఉపాధ్యక్షులు ఇరవేని కుమార్, కుక్కట్ల సంపత్, కోశాధికారి చిట్టిమల్ల నాగభూషణం, ఈసీ మెంబర్స్ కూర్మచలం వేణుమాధవ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.1
- రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రైతన్నలకు సన్న రకం వరి ధాన్యం సాగు చేసి, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం బోనస్‌ను పొందాలని సూచించారు. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ రైతువేదికలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి విత్తన మేళాను ప్రారంభించిన మంత్రి, ధర్మారం విత్తన మేళాను కూడా పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. రైతులు అధికారులు సూచించే ఏడు రకాల విత్తనాలను సాగు చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు. దొడ్డు రకం ధాన్యం సాగు చేస్తే కేంద్రం కొర్రీలు పెట్టి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. పంట పండించి నష్టపోవడం కంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేసి ఆర్థికంగా లాభం పొందాలని అన్నదాతలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని, రెండు లక్షల రుణమాఫీ చేయడంతో పాటు పెట్టుబడి సహాయం రైతు భరోసా అందిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ భరోసా ఇచ్చారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సహాయం ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో 70 లక్షల రూపాయలతో ప్రమాదకరంగా ఉన్న కరెంట్ వైర్లను తొలగించినట్లు మంత్రి వివరించారు. గ్రామంలో ఐకేపీ సెంటర్ తో పాటు గ్రౌండ్ ప్రతిపాదనలు వచ్చాయని, మిగిలిన సీసీ రోడ్లు, సంఘ భవనాలను కూడా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.1
- రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ‘యూరియా యాప్’ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్‌తో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. యూరియా సరఫరా చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని, తన నిరంకుశ విధానాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం అత్యంత అవివేకమని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎంతమాత్రం నిలువరించలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణమే ‘యూరియా యాప్’ను రద్దు చేయాలని, పాత విధానంలోనే రైతులకు అవసరమైనంత యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. రాబోయే రోజుల్లో అన్నదాతల ఆగ్రహం ఉప్పెనగా మారి ఈ నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది.1
- కరీంనగర్ జిల్లాలోని అల్గనూర్ వద్ద నిన్న జరిగిన బస్సు దగ్ధం ప్రమాదంలో, కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోకు చెందిన బస్సు డ్రైవర్ బోయిని ప్రశాంత్ తన ధైర్య సాహసాలను ప్రదర్శించి 40 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమవుతున్న సమయంలో, ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును ఆపి, ప్రయాణికులందరినీ కిందకు దించడంతో దాదాపు 40 మంది ప్రాణాలు దక్కాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో డ్రైవర్ బోయిని ప్రశాంత్‌ను సన్మానించి అభినందించారు. వారు మాట్లాడుతూ, ప్రశాంత్ సమయస్ఫూర్తితో స్పందించడం వల్లే ఇంతమంది ప్రాణాలు కాపాడుకోగలిగామని అన్నారు. ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులు బయలుదేరే ముందు అన్ని విధాలా తనిఖీలు చేసిన తర్వాతే బయటికి పంపాలని, బస్సు కాలిపోవడానికి గల కారణాలను విచారించి ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదాలకు దారితీసిన కారణాలపై ప్రభుత్వం విచారణ జరిపి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించాలని, ఆర్టీసీ బస్సు ప్రమాదాలను అరికట్టాలని తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వాన్ని కోరుతోందని గుంజపడుగు హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ విభాగం అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, జంగ అపర్ణ సాగర్, బాసావేణి రజేందర్, నూతి చరణ్, యండి హుస్సేన్, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డిలో సమాజ సేవనే లక్ష్యంగా పనిచేస్తున్న శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ, జూన్ 22న తన "నెలకు ఒక మంచి పని – నెలకు ₹100" నారాయణ సేవ కార్యక్రమంలో భాగంగా మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. తల్లిదండ్రులను కోల్పోయి నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి సహస్ర విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించి, ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పించింది. కామారెడ్డి పట్టణంలోని ప్రియా టాకీస్ రోడ్ ప్రాంతానికి చెందిన సహస్రను శ్లోక ఇన్నోవేటివ్ స్కూల్‌లో 5వ తరగతిలో చేర్పించి, ఆమె ఏడాది విద్యా ఖర్చులను భరించాలని సంస్థ నిర్ణయించింది. ఈ సందర్భంగా స్కూల్ ఫౌండర్ జాలిగామ శ్రీకాంత్ 50 శాతం ఫీజు మాఫీ చేసి చిన్నారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీకాంత్ దత్త మాట్లాడుతూ, విద్య ద్వారా సహస్ర జీవితంలో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతోనే ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యం అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. శ్లోక ఇన్నోవేటివ్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ కూడా మాట్లాడుతూ, నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. సహస్ర విద్యలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేలా తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. చిన్నారికి పుస్తకాలు అందించిన మచ్చ నాగరాజు కుటుంబ సభ్యులకు, శ్లోక స్కూల్ యాజమాన్యానికి, నారాయణ సేవ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీకాంత్ దత్త హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కే. సాయిరాం, ABN న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్, సిద్ధంశెట్టి వేణుగోపాల్, కే. శిరీష, కామారెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నంశెట్టి శ్రీనివాస్, కొడిప్యాక సాయిరాం తదితరులు పాల్గొని చిన్నారిని పాఠశాలలో చేర్పించారు. ఈ సేవా కార్యక్రమం 'నెలకొక మంచి పని నారాయణ సేవ', 'మానవసేవే మాధవసేవ' అనే నినాదాలకు అనుగుణంగా చిన్నారి సహస్రకు విద్యాదానం చేసింది.2
- జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన బిల్డర్ దాసరి రాజేంద్రప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసు, దర్యాప్తులో పథకం ప్రకారం జరిగిన హత్యగా తేలింది. బంగారు చైన్ కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించి, నిందితుడు గౌతమ్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మృతుడి బంగారు చైన్, హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రక్తపు మరకలున్న దుస్తులు, సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను పోలీసులు మంగళవారం మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆదర్శనగర్‌కు చెందిన బిల్డర్ దాసరి రాజేంద్రప్రసాద్ హనుమాన్‌నగర్‌లో నిర్మిస్తున్న ఇంటిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌతమ్ కుమార్ టైల్స్, పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. కూలీ డబ్బులు సరిపోవడం లేదని భావించిన గౌతమ్, రాజేంద్రప్రసాద్ మెడలో ఉన్న బంగారు చైన్‌ను దోచుకోవాలని పథకం వేశాడు. అంతేకాకుండా, పని విషయంలో రాజేంద్రప్రసాద్ తరచూ మందలిస్తుండటంతో అతనిపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఈ నెల 20వ తేదీ రాత్రి నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ముందుగానే సిద్ధం చేసుకున్న గొడ్డలితో గౌతమ్, రాజేంద్రప్రసాద్ తలపై బలంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతుడి మెడలో ఉన్న సుమారు 7.25 గ్రాముల బంగారు చైన్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అనుమానం రాకుండా ఉండేందుకు, నిందితుడు గౌతమ్ హత్య తర్వాత మృతుడి ఇంటికి వెళ్లి "ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు" అంటూ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తిరిగి సంఘటనా స్థలానికి వచ్చి, హత్యకు ఉపయోగించిన గొడ్డలిని పెయింట్ బకెట్‌లో దాచిపెట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు, సంఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్ల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు తన నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ ఏ. రాములు పర్యవేక్షణలో, సీఐ బి. సురేష్‌బాబు నేతృత్వంలో ఎస్ఐలు పి. కిరణ్‌కుమార్, జి. నవీన్‌కుమార్, ఏ. అనిల్‌కుమార్ తదితరులతో కూడిన దర్యాప్తు బృందం ఈ కేసును సమర్థవంతంగా ఛేదించింది. దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గుర్తుతెలియని దుండగులు రైతులకు భారీ నష్టం కలిగించారు. అర్ధరాత్రి వేళ గంభీరావుపేట మండల కేంద్రంలోని సింగసముద్రం పెద్ద కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న పంట పొలాల నుండి ఏకకాలంలో 11 బోరు మోటార్ల కేబుళ్లను దొంగిలించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నారు పోసి సాగు పనులు ప్రారంభించిన కీలక సమయంలో ఈ కేబుళ్ల చోరీ జరగడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్, పోలీసు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు కేబుల్ వైర్లను లాక్కెళ్లిన ఆనవాళ్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత రైతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.1
- రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన 'స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్', తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా కరీంనగర్‌లోని సుభాష్ నగర్‌లో ఏర్పాటు చేసిన 'ఆరోగ్య సేవ కేంద్రం (ASK) ప్లస్' క్లినిక్‌ను ఈరోజు అత్యంత వైభవంగా అధికారికంగా ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సంప్రదింపులు, డయాగ్నోస్టిక్ సేవలు, మందులను అందిస్తోంది. కరీంనగర్ 'ఆరోగ్య సేవ కేంద్రం ప్లస్' క్లినిక్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 172 పనిదినాల్లో 3,600 మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత వైద్య సేవలు అందించింది. ఇక్కడ సగటున రోజుకు 50కి పైగా రోగులు ఉచిత చికిత్స పొందుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా స్టార్ హెల్త్ సంస్థ ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్‌లలో మొత్తం నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇవన్నీ కలిపి ఇప్పటివరకు సుమారు 10,190 మందికి పైగా రోగుల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచాయి. పిరమల్ స్వాస్థ్య భాగస్వామ్యంతో ఈ క్లినిక్ ఎంబీబీఎస్ డాక్టర్ల సేవలు, ల్యాబ్ పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ఆరోగ్య సేవ కేంద్రాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బిజినెస్ హెడ్ కేబీబీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ కుమార్ గోపు, రీజినల్ మేనేజర్ జీ సురేష్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు, వారితో పాటు బ్రాంచ్ మేనేజర్లు, ఏజెంట్లు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజినెస్ హెడ్ కేబీబీ శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశంలో హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల భారం వేగంగా పెరుగుతోందని, ముందస్తు స్క్రీనింగ్, నివారణా వైద్య సేవలు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ప్రజల అవసరాలే కేంద్రంగా రూపొందించిన ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ASK క్లినిక్‌లో అనుభవజ్ఞులైన ఎంబీబీఎస్ డాక్టర్ల ద్వారా వ్యక్తిగత కన్సల్టేషన్, నిరంతర ఫాలో-అప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక హేమటాలజీ ఎనలైజర్, బయోకెమిస్ట్రీ ఎనలైజర్, సెంట్రిఫ్యూజ్, ఈసీజీ వసతులతో కూడిన ఈ కేంద్రంలో సీబీపీ, సీఆర్‌పీ, బ్లడ్ షుగర్, హీమోగ్లోబిన్, ఆర్‌డీటీ పరీక్షలు పూర్తిగా ఉచితం. సాధారణ జ్వరాలతో పాటు డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉచితంగా మందులు పంపిణీ చేయబడుతున్నాయి. అర్హులైన లబ్ధిదారులకు ఉచిత అడల్ట్ ప్న్యూమోకాకల్ వ్యాక్సిన్ సరఫరా, నోటి ఆరోగ్య స్క్రీనింగ్, నిపుణులతో హెల్త్ కౌన్సెలింగ్ అవగాహన సదస్సులు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. రోగుల సంరక్షణ కోసం ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం నిరంతర సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ కేంద్రానికి వస్తున్న కేసులలో మధుమేహం (డయాబెటిస్), వైరల్ జ్వరాలకు సంబంధించిన కేసులే అత్యధికంగా ఉన్నట్లు ల్యాబ్ నివేదికలు తెలియజేస్తున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక ప్రాథమిక ఆరోగ్య మౌలిక వసతులను నిర్మించే వ్యూహంతో స్టార్ హెల్త్ ఈ మోడల్‌ను రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మరియు పశ్చిమ బెంగాల్‌తో సహా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో 32 ఆరోగ్య సేవ కేంద్రాలను స్టార్ హెల్త్ విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ పిరమల్ ఫౌండేషన్ స్వాస్థ్య సంస్థ భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. కరీంనగర్‌లోని సుభాష్ నగర్, రోహన్ హాస్పిటల్ పక్కన, మొదటి అంతస్తులో ఉన్న ఈ స్టార్ ఆరోగ్య సేవ కేంద్రం సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:00 వరకు (రెండవ శనివారం, ఆదివారాలు సెలవు) పనిచేస్తుంది. తక్షణ సమాచారం, అపాయింట్‌మెంట్ల కోసం 9247573114 నంబర్‌లో సంప్రదించవచ్చు. భారతదేశ వైద్య బీమా రంగంలో అత్యధిక మంది పాలసీదారుల నమ్మకాన్ని గెలుచుకుని, ఒక కోటికి పైగా క్లైమ్స్ సెటిల్ చేసిన ఏకైక అగ్రగామి సంస్థ అయిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, వ్యాపారంలోనే కాకుండా సామాజిక సేవలోనూ తమకు సాటిలేరని నిరూపించుకుంది. 900+ కార్యాలయాలు, 8 లక్షలకు పైగా ఏజెంట్లు, 15,000+ నెట్‌వర్క్ ఆసుపత్రులతో దేశంలోనే అగ్రగామిగా ఉన్న స్టార్ హెల్త్ సంస్థ కరీంనగర్ సుభాష్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చిన ఈ అద్భుత ఉచిత వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది.3
- విద్యారంగ సమస్యల పరిష్కారం, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడిని అరికట్టడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే డిమాండ్లతో ఏబీవీపీ (అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్) పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాఠశాలల బంద్ సంపూర్ణంగా కొనసాగింది. ఏబీవీపీ పిలుపునకు మద్దతుగా ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించగా, ఏబీవీపీ కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించారు. కరీంనగర్ నగరంలో ఏబీవీపీ కార్యకర్తలు తిరుగుతూ పాఠశాలల బందును పర్యవేక్షించారు; ప్రభుత్వ పాఠశాలల్లో బెల్ కొట్టి విద్యార్థులను బయటకు పంపించారు. ఈ బందుకు సహకరించాలని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను కూడా వారు కోరారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు పూర్తయినా ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం పుస్తకాలు, యూనిఫారాలు కూడా అందించలేని దుస్థితి నెలకొందని ఏబీవీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేతగాని పరిస్థితిలో ఉందని ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ విష్ణు ఆరోపించారు. రేషనలైజేషన్ పేరుతో 27 వేల పాఠశాలలను 4 వేలకు కుదించడాన్ని, బాలికలకు మరుగుదొడ్లు లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కార్పొరేట్ సంస్థల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని ఏబీవీపీ నాయకుడు విష్ణు హెచ్చరించారు.4