Shuru
Apke Nagar Ki App…
నేత్రపర్వంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం దండేపల్లి మండలంలోని మేదరీపేట గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ, అన్నపూర్ణ కాశి విశ్వేశ్వర భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారాయణ స్వామి మూల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, దేవాలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
P.G. Murthy
నేత్రపర్వంగా శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం దండేపల్లి మండలంలోని మేదరీపేట గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ, అన్నపూర్ణ కాశి విశ్వేశ్వర భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం దేవాలయంలో శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారాయణ స్వామి మూల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, దేవాలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- Attapur Police arrested four youths for performing dangerous bike stunts and rash driving near Aramghar Road on March 27, 2026. A case has been registered under relevant BNS and MV Act sections. The accused were produced before the court and remanded to judicial custody on March 31, 2026.1
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ న్యూ కాలనీలో మట్టి రోడ్డు దయనీయ స్థితికి చేరింది. ఇటీవల కురిసిన వర్షంతో రోడ్డు బురదగా మారి రాకపోకలు కష్టంగా మారాయి. వృద్ధులు, చిన్నపిల్లలు, అత్యవసర సేవలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని సమాచారం. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.2
- bellampallii akenapalli bhuchiyapalli lo rein videyo2
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- చండీయాగాన్నికీ భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి హోమం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యగలరని పిలుపునిస్తున్న చండీ యాగం నిర్వాహకులు శ్రీ కృష్ణ స్వామి గారు... పాత ఉట్నూర్ 16వ వార్డు సభ్యులు టెకం.రేఖ2
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- హైదరాబాద్‌లోని NTR మార్గ్‌లో ట్రాఫిక్ పోలీసులు మంగళవారం తనిఖీలు చేస్తుండగా ఓ బైకర్ ఆగకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అతన్ని ఆపలేకపోయిన ఒక పోలీస్ కానిస్టేబుల్, వెనుక కూర్చున్న యువతి చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో, కొందరు పోలీసుల చర్యను సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.1
- పెద్దపల్లి జిల్లా రైతాంగానికి నిన్నటి రాత్రి ఒక పీడకలలా మారింది. ఒక్కసారిగా మారిన వాతావరణం అకాల వర్షం ఈదురుగాలలతో మామిడి కాయలు నేల రాలడంతో అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నేలపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 18 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. రూ.93,52,748/- నగదు రూపం లో ఆదాయంగా వచ్చినట్లు, అదే విధంగా, మిశ్రమ బంగారం – 60 గ్రాములు,100 మిల్లి గ్రాములు మిశ్రమ వెండి – 2 కిలోల 900 గ్రాములు వచ్చినట్లుగా తెలిపారు.ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి , శ్రీ రాజమౌళి (కరీంనగర్ ఏసీఆఫీస్) , పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సహాయ కార్య నిర్వహణాధికారులు, అధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి పాల్గొన్నారు.1