Shuru
Apke Nagar Ki App…
ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనారిటీ నేత మదీనా దస్తగిరి. బద్వేలు, సెప్టెంబర్ 15:అల్లాహ్ కృపతో ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం, వైఎస్ఆర్ కడప జిల్లా ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మరియు వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మదీనా దస్తగిరి ఈరోజు మైదుకూరు శాసనసభ్యులు, పెద్దాయన శ్రీ శెట్టిపల్లి రఘురామిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పవిత్ర మక్కా నుంచి తీసుకువచ్చిన జంజం (జమ్‌జమ్) నీటిని ఎమ్మెల్యేకు అందించి సత్కరించారు. అల్లాహ్ ఆశీస్సులతో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గారు ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు మదీనా దస్తగిరి తెలిపారు.
జీ.మౌలాలి.
ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మైనారిటీ నేత మదీనా దస్తగిరి. బద్వేలు, సెప్టెంబర్ 15:అల్లాహ్ కృపతో ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం, వైఎస్ఆర్ కడప జిల్లా ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మరియు వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మదీనా దస్తగిరి ఈరోజు మైదుకూరు శాసనసభ్యులు, పెద్దాయన శ్రీ శెట్టిపల్లి రఘురామిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పవిత్ర మక్కా నుంచి తీసుకువచ్చిన జంజం (జమ్‌జమ్) నీటిని ఎమ్మెల్యేకు అందించి సత్కరించారు. అల్లాహ్ ఆశీస్సులతో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గారు ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు మదీనా దస్తగిరి తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నందికొట్కూరు మున్సిపాలిటీలోని విద్యానగర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ 11వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వార్డులో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టి మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.1
- నందవరం లో సర్వ రక్షక సేవ సంఘం నాయకులు గణనాధునికి ఘనంగా పూజలు నందవరం లో వినాయక చవితి సందర్భంగా గణనాధునికి ఘనంగా పూజలు చేశారు .స్తానిక బిసీ కాలని వద్ద సర్వ రక్షక సేవ సంఘం వినాయక యూత్ ఆధ్వర్యంలో కొలువు తీరిన వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు, నైవేద్యం ,పుష్పాలు, పత్రాలతో పూజలు అందుకున్నారు.మండపం వద్ద ఆధ్యాత్మిక శోభఉట్టిపడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణతో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ,విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రంగురంగుల పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించిన స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.1
- పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ? పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?1
- పత్రికా ప్రకటన నంద్యాల జిల్లా 15.09.2026 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆత్మకూరు:నంద్యాల జిల్లా. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.4
- పుల్లలచెరువులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారి దేవాలయం వద్ద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది.మహిళలు, చిన్నారులు సంయుక్తంగా చేసిన ఈ కోలాటాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. మాస్టర్ కోటయ్య ఆధ్వర్యంలో కోలాటం చేశారు.ఈ సందర్బంగా కోలాటమాడిన మహిళలకు కమిటీ సభ్యులు చీరలను బహుమతిగా అందజేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.1
- *ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం* తిరుమల, 2026 సెప్టెంబర్ 15:: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, కంకణ బట్టర్ శ్రీ వెంకట రాఘవ దీక్షితులు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మీ, తదితర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది. *ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం* తిరుమల, 2026 సెప్టెంబర్ 15:: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, కంకణ బట్టర్ శ్రీ వెంకట రాఘవ దీక్షితులు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మీ, తదితర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.4
- ఆర్టీసీ బస్టాండ్ వినాయక ఆలయంలో వైభవంగా చవితి ఉత్సవాలు. బద్వేలు, సెప్టెంబర్ 15: ఆర్టీసీ బస్టాండ్ వద్ద వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ ఆవరణంలో వినాయక చవితి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వినాయకుని ఊరేగింపు, అనంతరం శ్రీకృష్ణ కోలాటం మాస్టర్ వెంకీ బృందం ఆధ్వర్యంలో కోలాటం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.1
- 2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం జగనన్న సంతోషం కామెంట్స్ 2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం కార్యకర్తలకు మంచిగా అడ్వైజ్ చేస్తున్న జగన్ అన్న సంతోషంగా కామెంట్స్1
- పుంగనూరును పలకరించిన వర్షం: చల్లబడిన వాతావరణం, ప్రజలకు ఉపశమనం... పుంగనూరు పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతగానో ఊరటనిచ్చింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం పూర్తిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. ఈ వర్షం రాకతో స్థానిక రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వర్షం కారణంగా ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు కొంత అసౌకర్యం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వేడి నుంచి ఉపశమనం లభించడంతో పట్టణ ప్రజలు వర్షాన్ని ఆహ్వానిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.1