logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పంటల మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానంతోనే రైతులకు లాభాలు : ప్రత్తిపాటి పంటల మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానంతోనే రైతులకు లాభాలు : ప్రత్తిపాటి • జగన్ ఐదేళ్లలో రైతులకు మొండిచెయ్యి చూపిస్తే, చంద్రబాబు వారికి అండగా నిలిచారు : ప్రత్తిపాటి. • పల్నాడు జిల్లాలో మూడు విడతల్లో 2.40 లక్షల రైతులకు రూ.455.43 కోట్ల సాయం అందించారు: ప్రత్తిపాటి. • కూటమి ప్రభుత్వ సాయం రైతుల సాగుఖర్చులకు ఉపయోగపడుతుంది. : ప్రత్తిపాటి • జగన్ రైతులకు మొండిచెయ్యి చూపిస్తే, చంద్రబాబు ఆపన్నహస్తం అందిస్తున్నారు : ప్రత్తిపాటి • ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్కరూపాయి రైతులకివ్వలేదు.. ఒక్క పనిముట్టు అందించలేదు : ప్రత్తిపాటి • వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కోలుకోలేని విధంగా జగన్ నష్టపరిచారు : ప్రత్తిపాటి • సబ్సిడీలు, రాయితీలతో పాటు, ఆర్థిక సాయం, యాంత్రీకరణ పరికరాలు, నాణ్యమైన విద్యుత్, గిట్టుబాటు ధర అందిస్తోంది : ప్రత్తిపాటి • రైతులు పంటమార్పిడితో అధికలాభాలు పొందవచ్చు. పచ్చిమిర్చి, మొక్కజొన్న, బొప్పాయితో లాభాలు పొందామని పలువురు రైతులు చెప్పారు : ప్రత్తిపాటి. • ఎంపీ లావు, జిల్లా కలెక్టర్ కృతికాశుక్లాతో కలిసి అన్నదాత సుఖీభవ సాయం అందచేసిన ప్రత్తిపాటి • వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించి, రైతలతో మాట్లాడిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ • గ్రీన్ హౌస్ లలో ఉద్యాన పంటలు సాగుచేస్తే అధిక లాభాలు వస్తాయి : ఎంపీ లావు • దేశంలో ఎప్పుడు విపత్తులు, సంక్షోభాలు వచ్చినా, ఎప్పుడూ ఆహార కొరత ఏర్పడకపోవడానికి రైతుల కష్టమే కారణం : ఎంపీ లావు • రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు అందించింది : లావు • పరిమితికి మించి రసాయనఎరువులు, హానికార పురుగుమందుల వాడకమే వాణిజ్య పంటల ఉత్పత్తులకు ధర లేకుండా చేస్తోంది : లావు • జిల్లా రైతాంగం గ్రీన్ హౌస్ లో ఉద్యాన పంటలు సాగుచేస్తే ఎక్కువ దిగుబడి.. లాభాలు అర్జించవచ్చు : లావు. • ఉద్యాన పంటల రైతులకే ఎక్కువ లాభాలు వస్తున్నాయి : కలెక్టర్ కృతికా శుక్లా • అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ సాయం అందిస్తాం : కృతికా శుక్లా ఖరీఫ్ సాగుఖర్చులకు ప్రభుత్వం అందించిన అన్నదాత సుఖీభవ సాయం ఉపయోగపడుతుందని, దుక్కిదున్ని భూమిని సాగుకు సిద్ధం చేసే రైతులకు ప్రభుత్వసాయం మేలు చేస్తుందని, ఐదేళ్లు జగన్ రైతులకు మొండిచెయ్యి చూపిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వారికి అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లాతో కలిసి రైతులకు అన్నదాత సుఖీభవ సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్లు రైతులతో మాట్లాడి, సాగువిధానాల గురించి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలపై రైతాంగానికి అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన రైతాంగాన్ని ఉద్దేశించి వారు ప్రసంగించారు *చంద్రబాబు నాయకత్వం..రైతులకు రక్షణ కవచం : ప్రత్తిపాటి* కూటమిప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని, చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర రైతులకు నిజంగా గొప్ప రక్షణ కవచమని ప్రత్తిపాటి తెలిపారు. జగన్ ఐదేళ్లపాటు రైతుల్ని నిలువునా మోసగించాడని, ఇస్తామన్నరూపాయి ఇవ్వకపోగా, కష్టపడి రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధర అందించలేకపోయాడని ప్రత్తిపాటి తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ తొలివిడత సాయం అందించారన్నారు. మూడు విడతల్లో కలిపి పల్నాడు జిల్లాలో 2.40 లక్షల రైతులకు రూ.455.43 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందచేసిందన్నారు. నేడు మూడోవిడత కింద రూ.135.48 కోట్లు అందించామన్నారు. *పంటమార్పిడితోనే రైతులకు లాభాలు..* పంటమార్పిడితో పాటు.. సాంకేతిక పరిజ్ఞానంతో సాగు వ్యయాన్ని రైతాంగం తగ్గించవచ్చని, అదనంగా లాభాలు పొందవచ్చని ప్రత్తిపాటి సూచించారు. పలువురు రైతులతో తాము మాట్లాడితే వారు వివిధ రకాల కొత్త పంటలతో లాభాలు పొందినట్టు చెప్పారన్నారు. పచ్చిమిర్చి, బొప్పాయి, మొక్కజొన్నతో ఈ ఏడాది బాగా లాభాలు వచ్చాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ముమ్మాటికీ రైతు పక్షపాత ప్రభుత్వమేనన్నారు. *రైతులు వ్యాపారుల్లానే ఆలోచించాలి..* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీలతో రైతులు తమ సాగు భారాన్ని తగ్గించుకోవాలని, కొత్త సాగు విధానాలతో అధిక దిగుబడులు సాధించాలని ప్రత్తిపాటి సూచించారు. కష్టంతో పాటు.. పంట ఉత్పత్తుల విక్రయంలో రైతులు కూడా వ్యాపారుల్లానే ఆలోచించాలని, పెట్టేపెట్టుబడికి తగినట్టుగా లాభాలు పొందడంపై దృష్టి సారించాలని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. *చమురు..గ్యాస్ సమస్యను కేంద్రం సమర్థంగా ఎదుర్కొంటోంది..* పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తాత్కాలికమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రధాని మోదీ సమర్థ నాయకత్వం, ముందుచూపుతో సమస్యల్ని అధిగమిస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమస్యపై మాట్లాడిన ఆయన.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కొంతమేర ఉందని, దాన్నికూడా కేంద్రప్రభుత్వం అధిగమిస్తోందన్నారు. సామాన్యుడిపై కొంతమేర భారం పడినప్పటికీ, ప్రభుత్వాలు సమస్యను పరిష్కరిస్తాయన్నారు. *2 లక్షల మంది రైతులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు : ఎంపీ లావు* రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు అందించి ఎప్పటినుంచో ఉన్న సమస్యను పరిష్కరించిందని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని రైతులు సాగుకు మాత్రమే వినియోగించాలని ఆయన సూచించారు. దేశంలో ఎలాంటి విపత్తులు, సంక్షోభాలు తలెత్తినా.. ప్రజలకు ఆహారం అందించడంలో రైతుల సాయం మాత్రం ఎప్పటికీ మరువలేనిదని లావు కొనియాడారు. రైతుల కష్టమే మనందరి కడుపు నింపుతోందనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. అలాంటి రైతులకు కొంత చేదోడుగా ఉండాలనే కేంద్రసాయానికి, రాష్ట్రసాయం కలిపి మొత్తంగా ఏటా ప్రతి రైతుకు రూ.20వేల ఇన్ పుట్ సబ్సిడ సాయం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ సాయాన్నిరైతులు సాగుకుమాత్రమే వినియోగించాలని లావు సూచించారు. ప్రభుత్వ ధృవీకరణ పొందిన కంపెనీల నుంచే నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు కొనాలని అప్పుడే రైతులు నష్టపోకుండా ఉంటారన్నారు. గ్యాస్ సరఫరాపై మహిళలు ఎవరూ ఆదుర్తా పడాల్సిన పనిలేదన్నారు. *రైతులతో పాటు మహిళలకు అందించే పథకాల్ని వారు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ కృతికా శుక్లా* ప్రభుత్వాలు రైతులతో పాటు మహిళలకు వివిధ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు అందిస్తున్నాయని, వాటిని గ్రామీణ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. డ్రోన్ల వినియోగంతో సాగు భారం తేలికవుతుందని ముఖ్యంగా పురుగుమందుల పిచికారీ ఎంతో సులభమవుతుందని ఆమె తెలిపారు. రైతులు యాంత్రీకరణ పరికరాలతో సాగును తేలిగ్గా చేయవచ్చన్నారు. ఉద్యాన పంటలతో అధిక లాభాలు వస్తాయని, రైతులు వాటిసాగుకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఆమె హితవుపలికారు. ఈ కార్యక్రమంలో డిఏవో జగ్గారావు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, రైతు నాయకులు అంబటి సోంబాబు, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, గట్టినేని రమేష్, గ్రామ నాయకులు గట్టినేని విజయ్ సాయి , గట్టినేని సుమంత్, గోరంట్ల కోటేశ్వరరావు, నందిగాం నాగబాబు, నెల్లూరి రామారావు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

on 14 March
user_మీడియా ఇన్చార్జి
మీడియా ఇన్చార్జి
Animal Protection Organisation చిలకలూరిపేట హెచ్.ఓ. పురుషోత్తపట్నం, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
on 14 March
992bb690-4ef9-42cd-bf26-8c57ab98f6e6

More news from Spsr Nellore and nearby areas
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    14 hrs ago
  • ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • స్మాల్ స్కాలర్స్ పాఠశాలలో వారు స్కూల్లో ఏడవ తరగతి వరకు చదివి ఇప్పుడు టెన్త్ క్లాస్ సీబీఎస్సీ పరీక్షలు స్కూల్ టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు అభినంద సభ జరిగింది. ఆ సమావేశాలలో స్కూల్ కరస్పాండెంట్ పి పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ ఎల్కేజీ నుండి ఏడవ తరగతి వరకు ప్రారంభించిన మా స్కూలు అనతి కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని అందుకు ఉదాహరణగా మా స్కూలు నందు ఏడవ తరగతి పాసై నగరంలో వివిధ స్కూళ్లలో చదివి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులు వివిధ రకాల పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. పద్మజా రెడ్డి గారి మాట్లాడుతూ స్మాలర్ స్కాలర్ స్కూల్ 2012లో ఈ బిల్డింగ్ లో ప్రారంభించామని ,ప్రీ ప్రైమరీ లెవెల్ లో మాంటిసోరి కరికులం ఫాలో అవుతూ విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లభాష పరిపూర్ణంగా రావాల్సిన అవసరం ఉంది. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ గా మారిపోయాయి. మా స్కూల్లో రెగ్యులర్గా వివిధ కార్యక్రమాల ద్వారా ఇంగ్లీషులో మాట్లాడడం వారి మాతృభాషలాగా అలవాటు చేశాము. స్కూల్లో జరిగే స్పీచ్ కాంపిటీషన్స్ మరియు డిబేట్ కాంపిటీషన్స్ లో ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని పాల్గొనేటట్టు చేస్తున్నాము, దీనివలన ప్రతి విద్యార్థికి పబ్లిక్ స్పీకింగ్ అలవాటవుతుంది. మా పూర్వ విద్యార్థి డి సాత్విక్ రెడ్డి 487 మార్క్స్ తెచ్చుకుని తను తన స్కూల్ టాపర్ గా నిలిచాడు. ఇంగ్లీష్ భాషలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుని స్మాలర్ స్కాలర్స్ స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు. ఇదే విధంగా మా పూర్వ విద్యార్థిని వి. ఇవాంజులిన్ 475 మార్కులు తెచ్చుకుని మా స్కూలు పేరు నిలిపింది. విద్యార్థులను నైమిశా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పి .శశిధర్ రెడ్డి గారు మరియు సొసైటీ ట్రెజరర్ బి .రామ్మోహన్ రెడ్డి గారు అభినందించారు. కరస్పాండెంట్ పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ స్కూల్ని సెవెంత్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు త్వరలో ఎక్స్పాండ్ చేస్తున్నామని తెలిపారు.
    2
    స్మాల్ స్కాలర్స్ పాఠశాలలో వారు స్కూల్లో ఏడవ తరగతి వరకు చదివి ఇప్పుడు టెన్త్ క్లాస్ సీబీఎస్సీ పరీక్షలు స్కూల్ టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు అభినంద సభ జరిగింది. 
ఆ సమావేశాలలో స్కూల్ కరస్పాండెంట్ పి పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ ఎల్కేజీ నుండి ఏడవ తరగతి వరకు ప్రారంభించిన మా స్కూలు అనతి కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని అందుకు ఉదాహరణగా మా స్కూలు నందు ఏడవ తరగతి పాసై నగరంలో వివిధ స్కూళ్లలో చదివి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులు వివిధ రకాల పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. 
పద్మజా రెడ్డి గారి మాట్లాడుతూ స్మాలర్ స్కాలర్ స్కూల్ 2012లో ఈ బిల్డింగ్ లో ప్రారంభించామని ,ప్రీ ప్రైమరీ లెవెల్ లో మాంటిసోరి  కరికులం ఫాలో అవుతూ విద్య అందిస్తున్నామని తెలిపారు. 
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లభాష పరిపూర్ణంగా రావాల్సిన అవసరం ఉంది. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ గా మారిపోయాయి. మా స్కూల్లో రెగ్యులర్గా వివిధ కార్యక్రమాల ద్వారా ఇంగ్లీషులో మాట్లాడడం వారి మాతృభాషలాగా అలవాటు చేశాము. స్కూల్లో జరిగే స్పీచ్ కాంపిటీషన్స్ మరియు డిబేట్ కాంపిటీషన్స్ లో ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని పాల్గొనేటట్టు చేస్తున్నాము, దీనివలన ప్రతి విద్యార్థికి పబ్లిక్ స్పీకింగ్ అలవాటవుతుంది. 
మా పూర్వ విద్యార్థి డి సాత్విక్ రెడ్డి 487 మార్క్స్ తెచ్చుకుని  తను  తన స్కూల్ టాపర్ గా  నిలిచాడు. ఇంగ్లీష్ భాషలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుని స్మాలర్ స్కాలర్స్ స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు. 
ఇదే విధంగా మా పూర్వ విద్యార్థిని వి. ఇవాంజులిన్ 475 మార్కులు తెచ్చుకుని మా స్కూలు పేరు నిలిపింది. 
విద్యార్థులను నైమిశా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పి .శశిధర్ రెడ్డి గారు మరియు సొసైటీ ట్రెజరర్ బి .రామ్మోహన్ రెడ్డి గారు అభినందించారు. 
కరస్పాండెంట్ పద్మజా రెడ్డి గారు మాట్లాడుతూ స్కూల్ని సెవెంత్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు త్వరలో ఎక్స్పాండ్ చేస్తున్నామని తెలిపారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కరీంనగర్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఆయన, 2025లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ కొనసాగించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని ఇటీవల వరంగల్‌కు వచ్చి లొకేషన్ తీసుకుని ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. కరీంనగర్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఆయన, 2025లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ కొనసాగించాడు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలుసుకుని ఇటీవల వరంగల్‌కు వచ్చి లొకేషన్ తీసుకుని ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    29 min ago
  • Post by N సూరి
    3
    Post by N సూరి
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో ఒంటికోట బడులు కావడం ఆపై అధికంగా ఎండ ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని అధికారులు విడుదల చేయగా చిన్నారులు ఎంచక్కా కెనాల్ లో ఈత కొడుతూ ఎండ వేడిని సేద తీరుతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అతి ఎండ ఉండడం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు చిన్నారులకు ఇంటికి వెళితే అధికంగా వేడి ఉండడంతో ఉపశమనం కొరకు కెనాల్ కాలువలో చల్లని నీటిలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు
    1
    పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో ఒంటికోట బడులు కావడం ఆపై అధికంగా ఎండ ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని అధికారులు విడుదల చేయగా చిన్నారులు ఎంచక్కా కెనాల్ లో ఈత కొడుతూ ఎండ వేడిని సేద తీరుతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అతి ఎండ ఉండడం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు చిన్నారులకు ఇంటికి వెళితే అధికంగా వేడి ఉండడంతో ఉపశమనం కొరకు కెనాల్ కాలువలో చల్లని నీటిలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    20 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    14 hrs ago
  • వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వతగిరి మండలం రావూరుకు చెందిన దామెర శ్రీనివాస్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తూరులోని మీసేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆయన అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
    1
    వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వతగిరి మండలం రావూరుకు చెందిన దామెర శ్రీనివాస్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తూరులోని మీసేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆయన అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    37 min ago
  • Post by N సూరి
    1
    Post by N సూరి
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.