నేత్రపర్వం లక్ష్మీనరసింహుని కళ్యాణం జిల్లా కేంద్రంలో ఘనంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువులు నిర్వహించిన వేద పండితులు కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి దంపతులు భారీగా తరలివచ్చిన భక్తజనం భూపాలపల్లి: నేత్రపర్వంగా లక్ష్మీనరసింహుని కళ్యాణం వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య నేత్రపర్వంగా జరిగింది. ధర్మ ప్రచారంలో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం రాష్ట్రంలోనే మొట్టమొదట శనివారం భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్రకళ్యాణ నిర్వహణకు ఈ దేవస్థానం ఆధ్వర్యంలో పి. నవీన్, సహాయ కార్యనిర్వహనధికారి నోడల్ అధికారిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర జిల్లా స్థాయి అధికారులు హాజరై స్వామి వారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవానికి సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామి వారి ఆశీస్సులను పొందారు.ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారులు,సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంపై స్థానిక భక్తులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ దేవస్థానం చేపడుతున్న ధార్మిక సేవలను అభినందించారు. భవిష్యత్తులో ఇదే విధంగా మరిన్ని ప్రాంతాల్లో ప్రచార రథం ద్వారా స్వామి వారి కళ్యాణాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. వెంకట్ రావు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులతో కలిసి హాజరై, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ సనాతన ధర్మపరిరక్షణకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ధర్మ ప్రచారం ద్వారా సమాజంలో నైతిక విలువలు, శాంతి ఐక్యత పెంపొందుతాయని ఎమ్మెల్యే అన్నారు. దివ్య కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు, యువత భక్తులు పాల్గొన్నారు.
నేత్రపర్వం లక్ష్మీనరసింహుని కళ్యాణం జిల్లా కేంద్రంలో ఘనంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువులు నిర్వహించిన వేద పండితులు కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి దంపతులు భారీగా తరలివచ్చిన భక్తజనం భూపాలపల్లి: నేత్రపర్వంగా లక్ష్మీనరసింహుని కళ్యాణం వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య నేత్రపర్వంగా జరిగింది. ధర్మ ప్రచారంలో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం రాష్ట్రంలోనే మొట్టమొదట శనివారం భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో యాదగిరిగుట్ట
శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్రకళ్యాణ నిర్వహణకు ఈ దేవస్థానం ఆధ్వర్యంలో పి. నవీన్, సహాయ కార్యనిర్వహనధికారి నోడల్ అధికారిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర జిల్లా స్థాయి అధికారులు హాజరై స్వామి వారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవానికి సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామి వారి ఆశీస్సులను పొందారు.ఈ కార్యక్రమంలో
జిల్లా దేవాదాయ శాఖ అధికారులు,సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంపై స్థానిక భక్తులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ దేవస్థానం చేపడుతున్న ధార్మిక సేవలను అభినందించారు. భవిష్యత్తులో ఇదే విధంగా మరిన్ని ప్రాంతాల్లో ప్రచార రథం ద్వారా స్వామి వారి కళ్యాణాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. వెంకట్ రావు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి ఇతర ముఖ్య
నాయకులతో కలిసి హాజరై, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ సనాతన ధర్మపరిరక్షణకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ధర్మ ప్రచారం ద్వారా సమాజంలో నైతిక విలువలు, శాంతి ఐక్యత పెంపొందుతాయని ఎమ్మెల్యే అన్నారు. దివ్య కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మహిళలు, యువత భక్తులు పాల్గొన్నారు.
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మల్కాజ్ గిరి నేరేడు మెట్ గ్రామంలో శ్రీ సంఘన బోయిన రాజు యాదవ్ @ గొట్ల రాజు యాదవ్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహా పడి పూజ... స్వామియే శరణం అయ్యప్ప1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ1
- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ1