ధరణిని అడ్డం పెట్టుకుని భూములను అక్రమంగా కొల్లగొట్టిన వ్యవహారాలపై ప్రత్యేక విచారణ బృందాన్ని SET ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటించారు. నిషేధిత జాబితా 22ఏపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ✳️ భూములకు సంబంధించి ప్రధానంగా నాలుగు రకాల సమస్యలు కాలక్రమేణా తలెత్తాయని సవివరంగా సభ ముందు ఆవిష్కరించారు. జరిగిన భూ దోపిడీ వ్యవహారాలన్నింటినీ ప్రత్యేక విచారణ టీమ్ కు రిఫర్ చేస్తున్నట్టు తెలిపారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రస్తుతం ఎదుర్కొంటున్న భూ సమస్యల వరకు వివిధ అంశాలను సభలో వివరించారు. ✳️ 1908లో ప్రారంభమైన భూ రికార్డుల నుంచి 2011 వరకు వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలు, వాటి వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. 1954-55లో వచ్చిన కాస్రా పహానీ, 1955లో ఇనాం భూముల చట్టం రద్దు, వినోబా బావే భూదానోద్యమం, 1965లో తీసుకొచ్చిన చట్టం, గిరిజనులు, ఆదివాసీలకు సంబంధించి 1/70 యాక్ట్, 1989లో కొత్త ఆర్వోఆర్ చట్టం, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ విధానం వంటి అంశాలను వివరించారు. ✳️ భూములు అతికొద్ది మంది చేతుల్లో బంధీ అయిన నేపథ్యంలో 1973లో ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని, ఆ తర్వాత 1977లో అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా బదలాయింపును నిషేధించే చట్టం వచ్చిందని తెలిపారు. పోడు భూముల విషయంలో ఆదివాసీలకు రక్షణ కల్పించేందుకు 2006లో యూపీఏ ప్రభుత్వం ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు సభలో ప్రస్తావించారు. ✳️ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018లో ధరణి పోర్టల్ తీసుకొచ్చే వరకు జరిగిన పరిణామాలను కూడా ముఖ్యమంత్రి వివరించారు. 2018లో ధరణి విధానం కోసం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థకు బాధ్యతలు అప్పగించారని, అక్కడి నుంచి టెరాసిస్, ఫాల్కన్ తదితర కంపెనీలకు.. వరుసగా చేతులు మారిన వైనాన్ని విడమరిచి చెప్పారు. ✳️ తెలంగాణ రైతాంగానికి సంబంధించిన సుమారు 2.50 కోట్ల ఎకరాల భూముల రికార్డులు, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు, యజమానుల ఫోన్ నంబర్లతో సహా కామెరాన్ హైలాండ్స్‌కు తరలించిన విధానం జరిగిందని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా రికార్డులన్నీ విదేశీ శక్తుల చేతుల్లో పెట్టారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ కబ్జాలను నిరోధించేందుకు 1982 జూన్‌లో ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని, తెలంగాణ ఏర్పడిన వెంటనే అప్పటి ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందని పేర్కొన్నారు. ఆ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారన్న ప్రశ్నించారు. ✳️ ప్రైవేటు భూములకు సంబంధించి 3,73,930 ఎకరాలపై వివాదం ఉన్నట్లు ముఖ్యమంత్రి గారు సభకు వివరించారు. ప్రజల భూములను కాపాడటంతో పాటు భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు 2025లో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ధరణి పేరుతో జరిగిన అక్రమాలను నిరోధించి ప్రజల ఆస్తులను రక్షించేందుకు అన్ని వర్గాలతో, అన్ని స్థాయిల్లో చర్చించి, అంశాలను పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టి సమగ్ర ప్రక్షాళన దిశగా ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ✳️ నిషేధిత భూములకు సంబంధించి 22ఏ సెక్షన్‌ను తమ ప్రభుత్వం తీసుకురాలేదని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే 1999లో తొలిసారిగా సెక్షన్ 22ఏను తీసుకొచ్చారని తెలిపారు. భూదాన, వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ భూములను రక్షించడమే దీని ఉద్దేశమని వివరించారు. ✳️ నిషేధిత భూములను క్లాజుల వారీగా వర్గీకరించాలని 2015 డిసెంబర్‌లో ఫుల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని, ఆ తర్వాత కటాఫ్ తేదీ తదితర అంశాల నేపథ్యంలో జరిగిన లావాదేవీలు, పరిణామాలతో వివాదాలు తలెత్తాయని తెలిపారు. ఒక సర్వే నంబర్‌లో ఒకచోట వివాదం ఉంటే మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చడంతో సమస్య మరింత పెరిగిందన్నారు. ఇలా సుమారు మూడు లక్షలుగా ఉన్న వివాదాలు 30 లక్షల ఎకరాలకు పెరిగాయని చెప్పారు. ✳️ 2020 అక్టోబర్‌లో 7,91,542 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విస్తీర్ణాన్ని 3,73,930 ఎకరాలకు తగ్గించినట్లు ముఖ్యమంత్రి గారు తెలిపారు. అలాగే పార్ట్-బీలోని వివాదాస్పద భూములను 17 లక్షల ఎకరాలకు తగ్గించామని చెప్పారు. 22ఏ నిషేధిత జాబితాను గత డిసెంబర్‌లోనే అప్‌డేట్ చేసినప్పటికీ చాలామంది ఈ విషయాన్ని గమనించలేదన్నారు. ✳️ నిషేధిత జాబితాకు సంబంధించి ప్రధానంగా ఎనిమిది అంశాలకు పరిష్కారం అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు స్పష్టతనిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే నిషేధిత జాబితా కొనసాగుతోందని, ప్రజా ప్రభుత్వం కొత్తగా భూములను జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. ✳️ ఇకపై ఏదైనా భూమిని 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చాలంటే సంబంధిత కలెక్టర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సంబంధిత వ్యక్తి అభ్యంతరాలు, అవసరమైన రికార్డులను పరిశీలించి, విచారణ చేపట్టిన తర్వాతే భూమిని నిషేధిత జాబితాలో చేర్చాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ నిర్ణయంపై అసంతృప్తి ఉంటే 60 రోజుల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని, ఆ తర్వాత 90 రోజుల్లో రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు. ✳️ దేవాదాయ, వక్ఫ్ రికార్డులను పరిశీలించి భూముల స్థితిని నిర్ధారిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో కొంత భాగం మాత్రమే వివాదాస్పదంగా ఉంటే ఆ భాగాన్ని మాత్రమే నిషేధిత జాబితాలో కొనసాగించి, మిగిలిన భూమిని జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు. ✳️ నిషేధిత జాబితాపై ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలోనే శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుత సమావేశాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా రంగం, ఎల్‌నినో ప్రభావం, కరవు పరిస్థితులు వంటి కీలక అంశాలపై చర్చించాలని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించిందని తెలిపారు. ఈ సీజన్‌లో విద్యుత్ వినియోగం ఒకేరోజు 19,500 మెగావాట్ల అత్యధిక డిమాండ్‌కు చేరిందని పేర్కొన్నారు. ఇలా అన్ని ప్రధాన అంశాలపై చర్చ జరగాలని ప్రభుత్వం భావించిందన్నారు. ✳️ వారసత్వంగా వచ్చిన సమస్యలపై శాసనసభలో చర్చించుకున్న తర్వాత తప్పిదాలకు తావులేకుండా ప్రతిపక్షాలు అవసరమైన సూచనలు ఇస్తే ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ✳️ రాష్ట్రంలో నిరుపేదలకు చెందాల్సిన లక్ష కోట్ల రూపాయల విలువైన భూములు దోపిడీకి గురయ్యాయని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, భూముల దోపిడీని క్షమిస్తే భవిష్యత్ తరాలు క్షమించవని వ్యాఖ్యానించారు. ✳️ ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడిన వ్యవహారాలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. అలాంటి అన్ని వ్యవహారాలను ప్రత్యేక విచారణ బృందానికి రిఫర్ చేస్తామని, భూ దోపిడీకి పాల్పడిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపిస్తామని సభలో ప్రకటించారు.

- Post by Shaikshada1
- ప్రజా పోరాటం, త్యాగాలకు ప్రతీక సెప్టెంబర్ 17 : శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని జాతి నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక దినమన్నారు. నిజాం పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం, చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్ణయాత్మక నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన చరిత్ర కేవలం ఒక తేదీ కాదని, ప్రజల పోరాటం, త్యాగం, స్వాభిమానం, జాతీయ సమైక్యతకు ప్రతీక అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ చరిత్రను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. రెండేళ్ల ప్రజాపాలన ప్రస్థానంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలబెట్టేందుకు కృషి చేస్తోందన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవాన్ని అందిస్తూ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ గ్రేడ్ సెక్షన్ ఆఫీసర్ విట్టల్, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ జిల్లాలోని మహా గణనాథుడిని దర్శించుకున్న భక్తులు! ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ జనతా మండల్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 52 అడుగుల భారీ గణనాథుడిని గురువారం జిల్లా ప్రజలు పెద్దఎత్తున దర్శించుకున్నారు. అత్యంత వైభవంగా వెలసిన ఈ భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.1
- విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన ఉండాలీ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ . తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ, విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒకరు ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండి, పొదుపును పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాల గురించి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రతి ఒకరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం. ........... నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తిల అధ్యక్షతన తెలంగాణ ప్రాజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పారదర్శక, జవాబుదారీ, సంక్షేమంతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడం, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా చేయడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యంమని మున్సిపల్ చైర్మన్ కావ్య తేలిపారు.1
- ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్ కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.1
- జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.1
- ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ADB: పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షాతో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.1