రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం రైతు భరోసాకు రూ. 5563 కోట్లు విడుదలకు సిద్ధం నస్తురుపల్లి నుండి ప్రారంభించనున్న సీఎం నస్తురుపల్లి వేదికగా రైతు భరోసా రెండో విడత ప్రారంభం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా నిధులతో73 లక్షల రైతులకు లాభం కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల మాస్టర్ ప్లాన్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు నేడు జిల్లాలో పర్యటించి ఉన్న ముఖ్యమంత్రి ఏర్పాటను పరిశీలించిన మంత్రులు అధికారులు భూపాలపల్లి : రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఊరటగా రైతు భరోసా కింద రూ5563 కోట్ల నిధులను సోమవారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని నిధులను విడుదల చేస్తారు. ఆదివారం నస్తురుపల్లిలో ఏర్పాట్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తదితరులతో కలిసి పరిశీలించారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 73 లక్షల మంది రైతులకు 1.15 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందించామని చెప్పారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ, పనిముట్లు, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని, రైతును రాజును చేయడమే లక్ష్యమన్నారు. సీఎం కాళేశ్వరం సందర్శనతో పాటు రూ200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల తదితరులు పాల్గొన్నారు. రైతులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం రైతు భరోసాకు రూ. 5563 కోట్లు విడుదలకు సిద్ధం నస్తురుపల్లి నుండి ప్రారంభించనున్న సీఎం నస్తురుపల్లి వేదికగా రైతు భరోసా రెండో విడత ప్రారంభం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా నిధులతో73 లక్షల రైతులకు లాభం కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల మాస్టర్ ప్లాన్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు నేడు జిల్లాలో పర్యటించి ఉన్న ముఖ్యమంత్రి
ఏర్పాటను పరిశీలించిన మంత్రులు అధికారులు భూపాలపల్లి : రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఊరటగా రైతు భరోసా కింద రూ5563 కోట్ల నిధులను సోమవారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని నిధులను విడుదల చేస్తారు. ఆదివారం నస్తురుపల్లిలో ఏర్పాట్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తదితరులతో కలిసి పరిశీలించారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 73 లక్షల మంది రైతులకు 1.15 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందించామని చెప్పారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ,
పనిముట్లు, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని, రైతును రాజును చేయడమే లక్ష్యమన్నారు. సీఎం కాళేశ్వరం సందర్శనతో పాటు రూ200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల తదితరులు పాల్గొన్నారు. రైతులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.
- Post by Merugu Rajitha1
- హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుకూరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారి సేవలను స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.1
- *హుజూరాబాద్ డంప్ యార్డ్ పై బీజేపీ యుద్దభేరీ...* *నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం* *ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి* *డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే* *ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం* *చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది* *కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా* *అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి* *బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు* హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు. *నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం* *ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి* *డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే* *ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం* *చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది* *కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా* *అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి* *బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు* హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.1
- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలల లో గత రాత్రి ఆకతాయిలు హల్చల్ చేశారు. పాఠశాల తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో ఉన్న సామాగ్రి తో పాటు టీచింగ్ మెటీరియల్ ను ధ్వంసం చేశారు. నేడు ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో సామాగ్రి.ధ్వంసం అయి ఉండడం తో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొంత మంది గంజాయి మత్తులో ఈ అరాచకం సృష్టించి ఉంటారని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే టీచింగ్ మెటీరియల్ ధ్వంసం చేశారని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, స్థానికులు కోరుతున్నారు..1
- .పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు. గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు. మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి1
- Post by Vodnala thirupthi1
- raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel1
- Post by Merugu Rajitha1